Our amazing new site will launch in

Monday, 14 July 2014

ఆచార్య గిరిరాజ్ కిషోర్ మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు (విహిప ప్రాంత అధ్యక్షులు )

14/07/2014, విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ జేష్ట్య నాయకులు అనేక సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన పూజ్య శ్రీ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారు విశ్వ హిందూ పరిషద్ కేంద్ర కార్యాలయం, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6 , డిల్లి లో  13/07/2014 (  నిన్న ) నాడు పరపదించడం జరిగింది.

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం లో వారికి ఆత్మకు శాంతి కలగాలని ఘన నివాళి అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ గోల దుర్గయ్య గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ రాజు గారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు, హిందూ సమాజ సంఘటన కార్యం లో తన 93 వ ఏట కూడా చూపిన ఉత్సాహం మన అందరికి స్పూర్తి దాకయం, వారి జీవనమే సగటు కార్యకర్తకు దిక్సూచి గా పని చేస్తుంది, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

శ్రీ రామ జన్మ భూమి ఉద్యమాన్ని తన భుజ స్కంధాల పై మోశారు : శ్రీ గాళ్ రెడ్డి 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ లేని శ్రీ రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉహించడమే కష్టం, అంతలా తనే ఉద్యమమై ఉద్యమమే తానై శ్రీ రాముని సేవలో తరించిన ధన్యజీవి, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 
  

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style