08/07/2014, విజయశ్రీ భవనం, భాగ్యనగర్ : " తెలంగాణా బోనాలు " పండుగను ' రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ' ఆర్భాటంగా ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీల అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని విశ్వ హిందు పరిషద్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.
స్థానిక విశ్వ హిందు పరిషద్ రాష్ట్ర కార్యాలయం లో పరిషద్ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవ్ రాజు గారు మాట్లాడుతూ ' ఆర్భాటంగా బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రూపాయలు 20 లక్షలు మంజూరు చేసామని హామీ ఇచ్చిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని చూపింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్ననాను, ప్రకటించిన 20 లక్షలలో చిల్లి గవ్వ కూడా విడుదల చేయకుండా హిందు సమాజాన్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పై విశ్వ హిందు పరిషద్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఇదే సమయంలో అన్య మతస్తుల ప్రార్థనాలయాల అభివృద్ధికి పది కోట్ల రూపాయలు విడుదల చేయడం గర్హనీయం, ఇలాంటి విషయాలు పునరావృతం అయితే హిందు సమాజం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను ' అని అన్నారు 
No comments:
Post a Comment