Our amazing new site will launch in

Tuesday, 8 July 2014

అన్య మతాలకు ప్రాధాన్యత ఇస్తూ - బోనాలపై నిర్లక్ష్యమా ? : విశ్వ హిందు పరిషద్

08/07/2014, విజయశ్రీ భవనం, భాగ్యనగర్ : " తెలంగాణా బోనాలు " పండుగను ' రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ' ఆర్భాటంగా ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీల అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని విశ్వ హిందు పరిషద్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.

స్థానిక విశ్వ హిందు పరిషద్ రాష్ట్ర కార్యాలయం లో పరిషద్ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవ్ రాజు గారు మాట్లాడుతూ ' ఆర్భాటంగా బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రూపాయలు 20 లక్షలు మంజూరు చేసామని హామీ ఇచ్చిన  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని చూపింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్ననాను, ప్రకటించిన 20 లక్షలలో చిల్లి గవ్వ కూడా విడుదల చేయకుండా హిందు సమాజాన్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పై  విశ్వ హిందు పరిషద్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఇదే సమయంలో అన్య మతస్తుల ప్రార్థనాలయాల అభివృద్ధికి పది కోట్ల రూపాయలు విడుదల చేయడం గర్హనీయం, ఇలాంటి విషయాలు పునరావృతం అయితే హిందు సమాజం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను ' అని అన్నారు     

విశ్వ హిందూ పరిషద్ సేవ పని విభాగము - సూచనా పత్రము

విశ్వహిందూ పరిషత్‌ 1964 ఆవిర్భవించబడి నేటికి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా 2014 ఆగష్టు 17వ తేది గోకులాష్టమి నుండి 2015 సెప్టెంబరు 5వ తేది గోకులాష్టమి వరకు దేశవ్యాప్తంగా సర్ణజయంతి ఉత్సవాలు నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగానే పరిషత్‌ సేవా విభాగ్‌ ఈ క్రింద ఉదాహరించబడిన కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించింది. 
కేంద్రం 2014 ఫిబ్రవరి 22, 23 తేదీలలో రాయపురం బైఠక్‌లో మరియు 2014 జూన్‌ 15వ తేది భాగ్యనగరంలో క్షేత్రబైఠక్‌ నిర్వహించబడింది. అందులో తీసుకున్న ఈ క్రింది సూచనలు గమనించగలరు. 

1. క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలను రెట్టింపుచేయాలి. అందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్న జిల్లాలు మినహా, మిగతా జిల్లాలలో సేవాప్రకల్పాలను ప్రారంభం చేయాలి. 
2. సేవావిభాగ్‌ ఆధ్వర్యములో భాగ్యనగరంలో పెద్దఎత్తున సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించాలి. 
3. ప్రతి బాలకళ్యాణ ఆశ్రమమునుండి ఒక మంచి సాంస్కృత కార్యక్రమము ఏర్పాటు చేయాలి. 
4. ఆశ్రమ విద్యార్తులకు ఇప్పటినుండే శిక్షణను ఇవ్వాలి. 
5, పూర్వవిద్యార్థులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనునట్లు చూడాలి. 
6. మనజిల్లాళి ఉన్న మిగతా ట్రస్టులను గుర్తించి వాటి చిరునామాలను సేకరించాలి. 
7. జిల్లా స్వాగత సమితికి ప్రతిష్టితుల పేర్లను సేకరించాలి. 
8. మన ఆశ్రమములో మనము నిర్వహించే కార్యక్రమాల సి.డి. తయారు చేయాలి. 
9. దాని సహాయముతో ప్రాంతస్థాయిలో కంబైండు సి.డి ని తయారు చేయవచ్చును. 
10. కంబైండు ఫోల్డరు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. 
11. కేంద్రసూచన ప్రకారము ప్రాంతంలో ఒక నిర్వహణ సమితివేయాలి. అందుకు మీ మీ జిల్లాలనుండి తగిన పేర్లను సేకరించి పంపగలరు. 
12. మనకు కావలసిన ధనసేకరణ చేసుకోవాలి. 
13. ప్రాంతనిధి రూ.3000/- పంపాలి. 
14. అలాగే మీ ఆశ్రమముయొక్క ఆడిట్‌ నివ దిక పంపాలి. 
15. సర్ణజయంతి కార్యక్రమాలు విజయవంతము చేయడానికి మీ మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయగలరు. 
16. సేవా విభాగ్‌ కార్యక్రమాల సక్రియ నిర్వహనకు, ప్రాంతస్థాయిలో ఒక పూర్తి సమయ కార్యకర్త అవసరము. కార్కర్తకు రూ.7000/- లు ఖర్చు అవుతుంది. ఈ విషయములో మీ సమితి ఆలోచించి అభిప్రాయాలను ప్రాంతానికి త్వరలో తెలియజేయగలరని మనవి. 

భవదీయ

Sunday, 6 July 2014

హైదరాబాద్ : ఒకే కంటేనర్ లో 117 ఆవులను కుక్కి తరలించిన వైనం - అడ్డుకున్న భజరంగ్ దళ్

  • మనవ హృదయం గగ్గురుపోడిచే సంఘటన
  • మదిలో ఏ కొంచం అయిన జాలి ఉన్న మనిషికైనా కన్నీరు పెట్టించే దృశ్యం
  • ఒకే లారి కంటేనర్ లో 117 ఆవులను ఆమనవీయంగా క్రుక్కి కబెలాలకు తరలించిన వైనం 
  • అడ్డుకున్న భజరంగ్ దళ్ 
  • స్థానిక బేరం గూడ గోశాలకు తరలింపు 

పటాన్ చేరు, హైదరాబాద్ 07/07/2014 : హైదరాబాద్ పరిసరాలలో ఆవుల పట్ల జరుగుతున్న ఆమానవీయ హత్యాఖండా రోజుకొకటి బయటకి వస్తూనే ఉంది, ఇదే నేపథ్యంలో తేది : 06/07/2014 నాడు భాగ్యనగర్ సమీపంలోని పటాన్ చేరు ప్రాంత్రంలో ఒకే లారి కంటేనర్ లో 117 ఆవులను దారుణంగా క్రుక్కి కబెలాలకు అక్రమంగా రవాణ చేస్తున్న లారీని స్థానిక భజరంగ్ దళ్ - విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
లారీని తెరిచి చూస్తె గుండె తరుక్కు పోయే దృశ్యాలు కళ్ళముందు కదలాడాయి, కనీసం అవులకు నిలబడెంత స్థలం కూడా లేదు ఆన్ని ఆవుల కాళ్ళు మడిచి కట్టి దారునాతి దారుణంగా అక్రమ రవాణ చేయడం మనస్సును ద్రవింపజేసే దృశ్యమే. వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు స్పందించి తక్షణ వైద్య సహాయాన్ని అందించి స్థానిక బీరం గూడ గో-శాలకు తరలించడం జరిగింది.




ముగిసిన విహిప ప్రాంత వర్షరంభ సమావేశాలు - స్వర్ణోత్సవాల నిర్వహణకు పిలుపు

07/07/2014, సంగారెడ్డి : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలు తేది : 05/07/2014 నుండి 06/07/2014 వరకు రెండు రోజుల పాటుగా సంగారెడ్డి లో జరిగినాయి, పరిషద్ ఈ సంవత్సరం తన స్వర్ణ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలను వేడుకగా జరపాలని బావించిన స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకత్వం తగిన ఏర్పాటు చేయడం జరిగింది.

భారత మాత పునర్వైభవ ప్రాప్తికి ఇదే సరైన సమయం : శ్రీ రాఘవరెడ్డి గారు

సమావేశాల తోలి రోజైన 05/07/2014 నాడు విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు ప్రత్యేక అతిధిగా హాజరయ్యి


కార్యకర్తలకు మార్గదర్శనం చేసారు. ఈ సందర్భంలో వారు మార్గదర్శనం చేస్తూ " విశ్వ హిందూ పరిషద్ ఈ సంవత్సరం తో తన 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తీ చేసుకోబోతున్నది, గతంలో చేసిన పని ఒక ఎత్తు ఈ సంవత్సరం చేయాల్సిన పని ఒక ఎత్తు, పరిషద్ స్వర్ణ జయంతి సంవత్సరం జరుపుకుంటున్న సమయంలో మన ధర్మ జాగృతి పనిలో ఉండడం మన పూర్వ జన్మ సుకృతం, దేశంలో దాదాపు 90 కోట్ల హిందువులు ఉన్న ఈ దైవియ కార్యం కోసం ఆ భగవంతుడు మనల్ని ఎంచుకోవడంలోనే ఆ అంతరార్ధం దాగి ఉంది, ఈ అంశాన్ని మనం గమనించాలి, ఆ భగవంతుడు మన పై విశ్వాసం తో మన ముందు ఉంచిన లక్ష్యాన్ని కార్యదీక్షతో పూర్తీ చేసి ఆ భగవంతుని విశ్వాసాన్ని నిలబెట్టాలి, దేశంలో ఒక బృహత్తర మార్పు రాబోతున్నది, తిరిగి భారత మాత తన పరవ వైభవ స్థానంలో ఉండి విశ్వ గురువుగా ప్రపంచానికి మార్గ దర్శనం చేయబోతున్నది ఈ మార్పుకు మనమే వారధులం కావాలి, ఆ మార్పునకు ప్రత్యక్ష సాక్షులం కావాలి, మన కన్నులతో దేశ పునర్వైభవం చూడాలి, దాని కోసం దేశంలో ప్రతి గ్రామంలో విశ్వ హిందూ పరిషద్ జెండా ఎగరాలి, హిందుత్వం కోసం పరితపించే కార్యకర్తలను ప్రతి గ్రామంలోను నిర్మాణం చేయాలి, హిందూ సమాజం నేడు మన వైపు ఆశగా, అనేక ఆకాంక్షలతో చూస్తూ ఉంది, పరిషద్ తో కలసి పనిచేయడానికి హిందూ యువకులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు, మన పని కేవలం ఆయువ శక్తి మార్గదర్శనం చేయడమే ఈ లక్ష్య సాధన దిశలో మన మందరం కలిసి ఉద్యమ స్పూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది." అని అన్నారు.

పదం పదం కదం కదం కలిపి మహోద్యమం  నిర్మిద్దాం : శ్రీ సురేందర్ రెడ్డి గారు

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యదక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ " దేశంలోని అన్ని ప్రాంతాలు విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి, ఈ క్రమంలో అనేక లక్ష్యాలు నిర్ణయించుకున్నాయి, మనం కూడా మన ప్రాంతంలోని ప్రతి ఉప మండల స్థాయిలో పూర్తీ స్థాయి విశ్వ హిందూ పరిషద్ సమితిలను నిర్మించాలి, ప్రతి గ్రామ స్థాయిలో ఎదో ఒక మార్గంలో పరిషద్ పని ప్రారంభం కావాలి " అని అన్నారు. 

ఈ సమావేశాలలో పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి శ్రీ సత్యం జి, ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ దుర్గయ్య గారు, సహా కార్యదర్శి శ్రీ వ్యసరాజ్ గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ్ రాజు గారు, లతో పాటు గా అనేక మంది క్షేత్ర మరియు ప్రాంత స్థాయి అధికారులు రెండు రోజులపాటు సమావేశాలలో ఉంది మార్గదర్శనం చేయడం జరిగింది.           

విశ్వ హిందు - Jul - 2014

(or)
Download as pdf format





Friday, 6 June 2014

పోరు భూమిలో బాసిన చిహ్నం ఎందుకు ? - ఒకరు దివ్యధాత్రి... ఒకరు సరస్వతి!


తెలుగు పలుకుల తేనె
ఇదె మన తెలంగాణ,
పోతన్న కవనపు
పసిడి వెనె్నల సోన,
కాకతీయాంధ్ర సా
మ్రాట్టులు పటిమతో
రాసి పోసిన సర్వ
జన హితముల ఖజాన!
తెలంగాణ రాష్ట్రం దశాబ్దుల భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ చరిత్రలో వికేంద్రీకృత ప్రగతికి మరో రూపం, తల్లి పాదాల చెంత సభ తీరి న నాలుగు కోట్ల తెలుగువెలుగుల సమష్టి తే జం... తెలంగాణ రాష్ట్రం శతాబ్దుల తెలుగు భా షా పవన తరంగిణికి వినూతన మాధుర్యం కల్పించిన మహాదివ్య పరిమళం... సహస్రాబ్దుల భారత జాతీయ నందనంలో పొంగులెత్తిన మకరంద ప్రవాహం... భారత రాజ్యాంగపు మొదటి అధిసూచికలో తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ ఉల్లేఖనం, యుగయుగాల హైందవ జాతీయ ప్రస్థానంలో సరికొత్త ప్రారంభం...
తుంగభద్ర ఉత్తర తీరం నుండీ వైనగంగ- పెన్‌గంగ- దక్షిణతీరం వరకూ ఝరాసంగమం నుండి భద్రాచలం వరకూ విస్తరించి ఉన్న భౌగోళిక స్వరూపం తెలంగాణ రాష్ట్రం! కృష్ణాగోదావరీ నదులు తెలంగాణ ప్రజల సనాతన ప్రగతిగతికి ప్రత్యక్ష సాక్ష్యాలు! ఈ భౌగోళిక స్వరూపానికి ప్రతీక ‘తెలంగాణ తల్లి’. ఈ భౌగోళిక స్వరూపంలోని పుట్టకు చెట్టుకు గట్టుకు చెరువుగట్టుకు, సనాతన సాంస్కృతిక సుగంధాలతో గుబాళిస్తున్న ఈ మట్టి కణాలకు తెలంగాణ తల్లి వెలుగుల రూపం. తెలంగాణ తల్లికి ప్రణమిల్లడం తెలంగాణ భూమాతృ సమార్చనం! ఈ భూమి నుండి బంగారం పండడమే ‘బంగారపు’తెలంగాణ... ఈ భూమి సతతహరిత శోభలతో అలరారడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన ‘ఆకుపచ్చని’ తెలంగాణ! తెలంగాణ భూమికి విస్తృతి భరతభూమి, తెలంగాణ తల్లిని పూజించడం భరతమాతను పూజించడం...
భూమినుండి లభిస్తున్న ఆహారం ఇతర సంపద నిజమైన ప్రగతికి మూల భూభూతమైనవి. భూమిని పరిరక్షించడం ప్రగతి సాధనకు అనివార్యం. తెలంగాణ ధాన్యాగారం మాత్రమేకాదని, విత్తనాల భాండాగారం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు! పంటలను పండించడానికి అవసరమయ్యే విత్తనాలను పండించడానికి దేశంలోనేకాక ప్రపంచంలోనే అత్యంత అనువైన ప్రాంతం తెలంగాణ, అని వ్యవసాయ శాస్తవ్రేత్తలు నిర్ధారించినట్టు తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే వెల్లడించాడు! అందువల్ల విత్తనాలను పండించే బృహత్ వ్యవసాయ క్షేత్రంగా తెలంగాణను రూపొందించినట్టయితే ప్రజల జీవితం అభ్యుదయ సువర్ణశోభలను సంతరించుకొంటుంది! అందుకంటె ధాన్యం, పంటలను పండించడం కంటె పంటలను పండించడానికి అనివార్యమైన విత్తనాలను ఉత్పత్తిచేయడం వల్ల రైతులకు, వ్యవసాయ శ్రామికులకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇప్పటికే మన దేశానికి అవసరవౌతున్న విత్తనాలలో నలబయి శాతం ‘తెలంగాణ’లో ఉత్పత్తిచేస్తున్నారట! తెలంగాణ విత్తనాల భాండాగారమైనట్టయితే విదేశాలకు సైతం విత్తనాలను భారీగా ఎగుమతి చేయవచ్చు!
ఇప్పటికీ తెలంగాణలో దాదాపు ఎనబయి నాలుగు ‘కంపెనీ’లు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయట! అందువల్ల దేశ అవసరాలలో నలబయి శాతం తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలు తీరుస్తున్నప్పటికీ రైతులకు ఒనగూడిన ప్రయోజనం లేదు. లాభాలను ఈ వాణిజ్య సంస్థలు బొక్కేస్తున్నాయి! మెన్‌సాంటో వంటి విదేశీయ వాణిజ్య సంస్థలు ‘బిటి’ పత్తి విత్తనాలను అనేక ఏళ్లపాటు తెలంగాణ రైతులకు అత్యధిక ధరలకు అమ్మి లాభాలను దోచుకున్నాయి! ఇప్పుడు కూడ దోచుకుంటూనే ఉన్నాయి. ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను విత్తనాలను ఉత్పత్తిచేయకుండా, విదేశాలనుండి తెచ్చి అమ్మకుండా తెలంగాణ ప్రభుత్వం నిరోధించినప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ సాకారం అయ్యేందుకు అవకాశం ఉంది.
వెయ్యి ఎకరాలలో ప్రయోగాత్మకంగా విత్తనాలను ఈఏడు పండిస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రైతులకు వ్యవసాయ వ్యయంలో డెబ్బయిఐదు శాతం సబ్సిడీనిస్తారట! కానీ రైతులు వేల ఎకరాలలోను విదేశీయ సంస్థలు లక్షల ఎకరాలలోను సమాంతరంగా పండించడంవల్ల తెలంగాణ ప్రజల బతుకులు బంగారు మయం కాజాలవు! విదేశీయులైన ‘ఘరానా’ దోపిడీదారులు ఇక్కడ విత్తనాలు అమ్మకుండా ఉత్పత్తిచేయకుండా నిషేధించినప్పుడు మాత్రమే తెలంగాణ విత్తనాల భాండాగారం కాగలదు! పత్తికాయ నుండి పురుగును వెళ్లగొట్టాలి... వ్యవసాయం నుండి ‘మల్టీనేషనల్ కంపెనీ’లను వెళ్లగొట్టాలి. రైతులకు ఋణ విముక్తి కల్పించడానికి కొత్త ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలి! విముక్తి పొందిన రైతులను మళ్లీ ఋణగ్రస్తులు కాకుండా నిరోధించాలంటే ‘బిటి’, ‘జిఎమ్’ పంటలను, బహుళ జాతీయ సంస్థల ఎరువులను విత్తనాలను క్రమంగా నిషేధించి, దశలవారీగా సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి! ఆవుల ప్రాణాలు, అడవుల పచ్చదనం రక్షణ పొందగలిగినప్పుడే సేంద్రియ వ్యవసాయం వృద్ధిపొందుతుంది! ఆరోగ్యకరమైన విత్తనాలు, ఆహార ఉత్పత్తులు బంగారపు తెలంగాణకు బాటలు! ప్రజలు భూమిపుత్రులు, సమాజం భూదేవి సంతానం... భూమి బందీ అయినప్పుడు ప్రజల బతుకులు కూడ బందీ అవుతున్నాయి.
తెలంగాణ భౌగోళిక స్వరూప స్వభావాలకు ఇలా తెలంగాణ తల్లి ప్రతీక! ఈ తల్లి భూదేవికి ప్రతిబింబం. తెలంగాణ ప్రజల భాష తెలుగు భాష... తెలుగు భాష తెలుగుల ఆచార పద్ధతులు జీవనరీతులు తెలుగు సాహిత్యం తెలుగు అక్షరాలు తెలంగాణ గడ్డపై అతి ప్రాచీన కాలంనుండి వికసించాయి! అందువల్ల తెలుగుతనం తెలంగాణ ప్రజల తరతరాల వారసత్వం! కన్నడ భాష తెలుగు భాష కలిసి ఉన్న రోజులు చరిత్రలో ఉన్నాయి. ఈ రెండు భాషలకు మూలమైన ప్రాకృత భాషను మాట్లాడిన రోజులున్నాయి. ఆ ప్రాకృత భాషకు మూలమైన మరో ప్రాకృత భాష ఉండి ఉండవచ్చు! సృష్ట్యాదిగా ప్రజలు మాట్లాడిన భాషకు మాట్లాడుతూ వచ్చిన భాషకు చివరి రూపాంతరం నేటి మన తెలుగు! ఈ తెలుగు కన్నడం కలసిన భాష రెండుగా విడివడినప్పుడు కన్నడ తెలుగు భూభాగాలు కలసినచోటనే మొదట తెలుగు వికసించింది, తూర్పుగా విస్తరించింది! ‘నాగబు’అన్న మొదటి తెలుగు పదం పుట్టినది కూడ తెలంగాణ పరిసరాలలోనే... అందువల్ల తెలుగుభాష తెలంగాణ వారిది. శబ్దానికి విగ్రహరూపం ‘అక్షరం’. భావానికి విగ్రహరూపం ‘్భష’. మన సమష్టి భావజాలానికి మన తరతరాల జీవన అభివ్యక్తికి మాధ్యమం భాష! తెలంగాణ సమష్టి భావజాలానికి విగ్రహం తెలుగుభాష! ఈ తెలుగు భాషకు, తెలుగు వాఙ్మయానికి, తెలుగుభాషా సరస్వతికి విగ్రహరూపం తెలుగుతల్లి... అందువల్ల తెలంగాణ ప్రజలకు ‘తెలంగాణతల్లి’తోపాటు, ‘తెలుగుతల్లి’కూడ ఆరాధ్య.... తెలంగాణ తల్లి భౌగోళిక ప్రతీక, భూమాత రూపం, తెలుగుతల్లి భాషా వాఙ్మయాలకు ప్రతీక, భాష ద్వారా ఆవిష్కృతవౌతున్న భావానికి ప్రతీక, సరస్వతీ మాత రూపం! అందువల్ల తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలందరూ ‘తెలుగుతల్లి’ని ‘తెలంగాణ తల్లి’ని సమానంగా పూజించాలి! ఒక తల్లి తెలంగాణ ప్రజల స్వభావం, మరో తల్లి తెలంగాణ ప్రజల స్వరూపం...ఒకరు సరస్వతి, మరొకరు దివ్యధాత్రి! రాజధాని నగరంలో తెలుగుతల్లి, తెలంగాణ తల్లి విగ్రహాలు రెండూ ఉన్నాయి. రెండింటినీ పూజించడం పరిరక్షించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రగతికీ సుగతికీ సోపానం... సకల దేవతారాధన సనాతన భారత జాతీయ సంస్కృతిలో అవిభాజ్యం!
భారత జాతీయ భౌగోళిక సాంస్కృతిక స్వరూప స్వభావాలలో వివిధ ప్రాంతీయ భౌగోళిక సంప్రదాయాలు భాగం! అందువల్ల సకల దేవీదేవతామూర్తుల సమర్చనం పరమదేవత అయిన భారతమాతృ సమారాధనలో భాగం....
తెలుగు భాష తెలంగాణ రాష్ట్ర ప్రజలకూ, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ మాత్రమేకాదు ప్రవాస తెలుగు ప్రజలకు కూడ సమాన మాధ్యమం! సమాన వారసత్వం! తెలుగు సాహితీ స్రవంతులు ఉభయ రాష్ట్రాల ప్రజల భావ సమైక్యతకు వారధులు... తెలుగులో రామాయణ కావ్యం మొదట అవతరించింది తెలంగాణ గడ్డమీద! మహాభారత రచనకు శ్రీకారం చుట్టింది అవశేషాంధ్రప్రదేశ్ నేలమీద... మహాభాగవతం ఓరుగల్లులో వికసించింది, ప్రబంధ సాహిత్యం హంపీ విజయనగరంలో పల్లవించింది! తెలుగు సాహిత్య పరిమళం మాత్రం తెలుగునేల నలుచెరగులా విస్తరించింది. అందువల్ల తెలుగు సాహిత్య వారసత్వం రెండు రాష్ట్రాలకూ సమానం! ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ గీతం ఉభయ రాష్ట్రాలకూ ఉమ్మడి రాష్టగ్రీతంగా కొనసాగినందువల్ల ప్రమాదం లేదు! ‘తెలుగు’పై తెలంగాణకు సమాన హక్కులున్నాయి. తెలుగును పరిరక్షించడంలో కూడ అవశేష ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి సమాన బాధ్యత ఉంది! ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ను శంకరంబాడి సుందరాచారి రచించే నాటికి క్రీస్తుశకం 1942నాటికి, తెలుగువారికి భౌగోళికమైన సరిహద్దులు లేవు! తెలుగుభాష కాని తెలుగుతల్లిని కీర్తించిన ఈ పాట కాని భౌగోళిక పరిధిలో బందీకారాదు!! రెండు రాష్ట్రాల ప్రజలేకాక ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు సైతం ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ను పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలి! ఇతర గీతాలను- ఉద్యమ గీతాలను ప్రబోధ గీతాలను ఆకాంక్షా గీతాలను, అభ్యుదయ గీతాలను, సాంస్కృతిక గీతాలను కూడ పాడుకోవాలి...
తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తప్పులు దొర్లినట్టు ప్రచారమైంది. ‘సత్యమేవజయ తే’అన్న ధ్యేయవాక్యం ఉండవలసిన స్థానంలో లేదట! దీన్ని సవరించుకోవడం సులభం! కాకతీయ సామ్రాజ్య కీర్తితోరణమైన ద్వారాన్ని రాజముద్రలో ప్రధాన చిహ్నంగా ఏర్పాటుచేయడం సర్వమత సమభావస్ఫూర్తికి నిదర్శనం! కాకతీయుల సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు మొత్తం తెలుగునేలకు మధ్యలో ఉండేది! ఇప్పటికీ ఎప్పటికీ కాకతీయ సామ్రాజ్య గరిమ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, అవశేష ఆంధ్రప్రదేశ్ వారికే కాదు భారతీయులందరికీ గర్వకారణం! ఈ జాతీయ స్ఫూర్తి కేంద్రాన్ని క్రీస్తుశకం 1323వ సంవత్సరంలో విదేశాలనుండి వచ్చిపడిన జిహాదీ బీభత్సకారులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన కాకతీయ సామ్రాజ్యం సర్వమత సమాన రాజ్యాంగ వ్యవస్థకు ప్రతీక! ధ్వంసంచేసిన వారు ఏకమత రాజ్యాంగ వ్యవస్థాపకులు, ఇతర మతాల పొడగిట్టని మతోన్మాదులు! ఈ మతోన్మాదులు కాకతీయ సామ్రాజ్యం ధ్వంసమైన నాటినుంచి ఆరువందల ఇరవై అయిదేళ్లపాటు ఈ ఏకమతోన్మాదులు తెలంగాణను ‘‘పాలించడం’’ చరిత్ర. ఈ మతోన్మాద చరిత్రకు పరాకాష్ఠ 1948లో అంతరించిన ‘నిజాం’పాలన! ఈ ‘పాలన’కు ప్రతిరూపం చార్మినార్... అందువల్ల కాకతీయ చిహ్నంతోపాటు ‘నిజాం’ల చిహ్నాన్ని కూడ ‘రాజముద్ర’లో ప్రతిష్ఠించడం ‘నిజాం’ల దమనకాండకు బలైన తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం! ఆవునూ, గోమాయువును ఒకేచోట...?!

Monday, 5 May 2014

శ్రీకాకుళం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 138 మంది మతం మారిన హిందువులు


క్రైస్తవం తన వ్యూహాలను మార్చుకొంది, హిందూ ఆచార వ్యవహారాలను తనలో చొప్పించుకుని ఒక ముసుగుతో మన ముందుకొస్తుంది, చర్చిల  ముందు ధ్వజ స్థంబాలు, కాషాయ బట్టలతో ఫాదరీలు, పెళ్ళిలలో పసుపు పూసుకోవడం, తాళి కట్టడం లాంటివి ఆ వ్యుహలలో భాగమే, ఇలాంటి అంశాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి - మాన్య శ్రీ జుగల్ కిషోర్ శర్మ విహిప ధర్మ ప్రసార్ సమితి అఖిల భారత ప్రాముఖ్   

శ్రీకాకుళం, 06/04/2014 : తేది 04/05/2014 నాడు  శ్రీకాకుళం జిల్లా లోని సీతంపేట్, బుర్జా మండలాలకు సంబందించిన అనేక గ్రామాలలోని సుమారు 30 కుటుంబాకు చెందిన 138 మంది గతంలో క్రైస్తవులుగా మారిన హిందువులు తిరిగి తమ తల్లి ఒడి లాంటి హిందూ ధర్మంలోకి పునరాగమణ కార్యక్రమం ద్వారా తిరిగి వచ్చారు.శ్రీకాకుళం జిల్లా లో క్రైస్తవ మిషనరీల ప్రభావం గణనీయ స్థాయిలో ఉంది, ఆర్థిక, అంగ, అధికార బలాల సహాయంతో అక్కడ నివసిస్తున్న గిరిజనులను ప్రభావితం చేసి క్రైస్తవ మత వ్యాప్తికి వారిని ఉపయోగించుకోవడం అక్కడ సర్వ సాధారణంగా జరుగుతూ ఉంది, ఈ అంశాన్ని గ్రహించిన స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకులు అనేక రోజులుగా స్థానికంగా ఉంటూ క్రైస్తవం స్వీకరించిన వారిని కలుస్తూ వారిలో వారు హిందుత్వాన్ని వీడి ఏం కోల్పోయారో తెలియజేయడానికి విస్తృతంగా చేసిన ప్రయత్నాలు ఈ విధంగా సఫలం అవుతున్నాయ్.
ఈ కార్యక్రమానికి విహిప అఖిల భారతీయ ధర్మ ప్రసార్ ప్రాముఖ్ మాన్య శ్రీ జుగల్ కిశోర్ జి మార్గదర్శనం చేస్తూ ' క్రైస్తవ మిషనరిల ప్రలోభాలకు, కుట్రలకు, మోసపూరిత మాటలకు వాగ్దానాలకు లోనై మతం మారిన అనేక మంది హిందువులు, మతం మారినప్పటికీ తమ నరనరాల్లో ఉన్న తమ పూర్వికుల రక్తం వారిని హిందుత్వం నుండి దూరం కాకుండా రక్షిస్తూ ఉంది, అనేక ఆచార - వ్యవహారాలలో హిందూ ధర్మం పద్దతిని వారు విడవడం లేదు, అలాంటి వారందరూ తిరిగి తమ మాతృధర్మం లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి  వారిని సరైన మార్గదర్శనం తో ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది ' అని అన్నారు
యజ్ఞ కార్యక్రమంతో జరిగిన ఈ పునరాగమణ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి సుమారు 500 మంది హిందువులు హాజరయ్యారు, తిరిగి తమ అమ్మ ఒడికి చేరుకుంటున్న తమ సహోదరులను శ్రీ రాముని చిత్ర పటం బహుకరించి మనసారా ఆహ్వానించారు, కార్యక్రమం సాముహక భోజనాలతో పూర్తైంది. 
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ జుగల్ కిషోర్ గారితో పాటుగా, మాన్య శ్రీ గుమ్మల్ల సత్యం గారు , సవర సంప్రదాయానికి చెందిన గురువులు శ్రీ భీమన్న గారు, స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకులు పాల్గొన్నారు. 

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style