Our amazing new site will launch in

Friday, 6 June 2014

పోరు భూమిలో బాసిన చిహ్నం ఎందుకు ? - ఒకరు దివ్యధాత్రి... ఒకరు సరస్వతి!


తెలుగు పలుకుల తేనె
ఇదె మన తెలంగాణ,
పోతన్న కవనపు
పసిడి వెనె్నల సోన,
కాకతీయాంధ్ర సా
మ్రాట్టులు పటిమతో
రాసి పోసిన సర్వ
జన హితముల ఖజాన!
తెలంగాణ రాష్ట్రం దశాబ్దుల భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ చరిత్రలో వికేంద్రీకృత ప్రగతికి మరో రూపం, తల్లి పాదాల చెంత సభ తీరి న నాలుగు కోట్ల తెలుగువెలుగుల సమష్టి తే జం... తెలంగాణ రాష్ట్రం శతాబ్దుల తెలుగు భా షా పవన తరంగిణికి వినూతన మాధుర్యం కల్పించిన మహాదివ్య పరిమళం... సహస్రాబ్దుల భారత జాతీయ నందనంలో పొంగులెత్తిన మకరంద ప్రవాహం... భారత రాజ్యాంగపు మొదటి అధిసూచికలో తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ ఉల్లేఖనం, యుగయుగాల హైందవ జాతీయ ప్రస్థానంలో సరికొత్త ప్రారంభం...
తుంగభద్ర ఉత్తర తీరం నుండీ వైనగంగ- పెన్‌గంగ- దక్షిణతీరం వరకూ ఝరాసంగమం నుండి భద్రాచలం వరకూ విస్తరించి ఉన్న భౌగోళిక స్వరూపం తెలంగాణ రాష్ట్రం! కృష్ణాగోదావరీ నదులు తెలంగాణ ప్రజల సనాతన ప్రగతిగతికి ప్రత్యక్ష సాక్ష్యాలు! ఈ భౌగోళిక స్వరూపానికి ప్రతీక ‘తెలంగాణ తల్లి’. ఈ భౌగోళిక స్వరూపంలోని పుట్టకు చెట్టుకు గట్టుకు చెరువుగట్టుకు, సనాతన సాంస్కృతిక సుగంధాలతో గుబాళిస్తున్న ఈ మట్టి కణాలకు తెలంగాణ తల్లి వెలుగుల రూపం. తెలంగాణ తల్లికి ప్రణమిల్లడం తెలంగాణ భూమాతృ సమార్చనం! ఈ భూమి నుండి బంగారం పండడమే ‘బంగారపు’తెలంగాణ... ఈ భూమి సతతహరిత శోభలతో అలరారడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన ‘ఆకుపచ్చని’ తెలంగాణ! తెలంగాణ భూమికి విస్తృతి భరతభూమి, తెలంగాణ తల్లిని పూజించడం భరతమాతను పూజించడం...
భూమినుండి లభిస్తున్న ఆహారం ఇతర సంపద నిజమైన ప్రగతికి మూల భూభూతమైనవి. భూమిని పరిరక్షించడం ప్రగతి సాధనకు అనివార్యం. తెలంగాణ ధాన్యాగారం మాత్రమేకాదని, విత్తనాల భాండాగారం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు! పంటలను పండించడానికి అవసరమయ్యే విత్తనాలను పండించడానికి దేశంలోనేకాక ప్రపంచంలోనే అత్యంత అనువైన ప్రాంతం తెలంగాణ, అని వ్యవసాయ శాస్తవ్రేత్తలు నిర్ధారించినట్టు తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే వెల్లడించాడు! అందువల్ల విత్తనాలను పండించే బృహత్ వ్యవసాయ క్షేత్రంగా తెలంగాణను రూపొందించినట్టయితే ప్రజల జీవితం అభ్యుదయ సువర్ణశోభలను సంతరించుకొంటుంది! అందుకంటె ధాన్యం, పంటలను పండించడం కంటె పంటలను పండించడానికి అనివార్యమైన విత్తనాలను ఉత్పత్తిచేయడం వల్ల రైతులకు, వ్యవసాయ శ్రామికులకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇప్పటికే మన దేశానికి అవసరవౌతున్న విత్తనాలలో నలబయి శాతం ‘తెలంగాణ’లో ఉత్పత్తిచేస్తున్నారట! తెలంగాణ విత్తనాల భాండాగారమైనట్టయితే విదేశాలకు సైతం విత్తనాలను భారీగా ఎగుమతి చేయవచ్చు!
ఇప్పటికీ తెలంగాణలో దాదాపు ఎనబయి నాలుగు ‘కంపెనీ’లు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయట! అందువల్ల దేశ అవసరాలలో నలబయి శాతం తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలు తీరుస్తున్నప్పటికీ రైతులకు ఒనగూడిన ప్రయోజనం లేదు. లాభాలను ఈ వాణిజ్య సంస్థలు బొక్కేస్తున్నాయి! మెన్‌సాంటో వంటి విదేశీయ వాణిజ్య సంస్థలు ‘బిటి’ పత్తి విత్తనాలను అనేక ఏళ్లపాటు తెలంగాణ రైతులకు అత్యధిక ధరలకు అమ్మి లాభాలను దోచుకున్నాయి! ఇప్పుడు కూడ దోచుకుంటూనే ఉన్నాయి. ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను విత్తనాలను ఉత్పత్తిచేయకుండా, విదేశాలనుండి తెచ్చి అమ్మకుండా తెలంగాణ ప్రభుత్వం నిరోధించినప్పుడు మాత్రమే బంగారు తెలంగాణ సాకారం అయ్యేందుకు అవకాశం ఉంది.
వెయ్యి ఎకరాలలో ప్రయోగాత్మకంగా విత్తనాలను ఈఏడు పండిస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రైతులకు వ్యవసాయ వ్యయంలో డెబ్బయిఐదు శాతం సబ్సిడీనిస్తారట! కానీ రైతులు వేల ఎకరాలలోను విదేశీయ సంస్థలు లక్షల ఎకరాలలోను సమాంతరంగా పండించడంవల్ల తెలంగాణ ప్రజల బతుకులు బంగారు మయం కాజాలవు! విదేశీయులైన ‘ఘరానా’ దోపిడీదారులు ఇక్కడ విత్తనాలు అమ్మకుండా ఉత్పత్తిచేయకుండా నిషేధించినప్పుడు మాత్రమే తెలంగాణ విత్తనాల భాండాగారం కాగలదు! పత్తికాయ నుండి పురుగును వెళ్లగొట్టాలి... వ్యవసాయం నుండి ‘మల్టీనేషనల్ కంపెనీ’లను వెళ్లగొట్టాలి. రైతులకు ఋణ విముక్తి కల్పించడానికి కొత్త ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలి! విముక్తి పొందిన రైతులను మళ్లీ ఋణగ్రస్తులు కాకుండా నిరోధించాలంటే ‘బిటి’, ‘జిఎమ్’ పంటలను, బహుళ జాతీయ సంస్థల ఎరువులను విత్తనాలను క్రమంగా నిషేధించి, దశలవారీగా సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి! ఆవుల ప్రాణాలు, అడవుల పచ్చదనం రక్షణ పొందగలిగినప్పుడే సేంద్రియ వ్యవసాయం వృద్ధిపొందుతుంది! ఆరోగ్యకరమైన విత్తనాలు, ఆహార ఉత్పత్తులు బంగారపు తెలంగాణకు బాటలు! ప్రజలు భూమిపుత్రులు, సమాజం భూదేవి సంతానం... భూమి బందీ అయినప్పుడు ప్రజల బతుకులు కూడ బందీ అవుతున్నాయి.
తెలంగాణ భౌగోళిక స్వరూప స్వభావాలకు ఇలా తెలంగాణ తల్లి ప్రతీక! ఈ తల్లి భూదేవికి ప్రతిబింబం. తెలంగాణ ప్రజల భాష తెలుగు భాష... తెలుగు భాష తెలుగుల ఆచార పద్ధతులు జీవనరీతులు తెలుగు సాహిత్యం తెలుగు అక్షరాలు తెలంగాణ గడ్డపై అతి ప్రాచీన కాలంనుండి వికసించాయి! అందువల్ల తెలుగుతనం తెలంగాణ ప్రజల తరతరాల వారసత్వం! కన్నడ భాష తెలుగు భాష కలిసి ఉన్న రోజులు చరిత్రలో ఉన్నాయి. ఈ రెండు భాషలకు మూలమైన ప్రాకృత భాషను మాట్లాడిన రోజులున్నాయి. ఆ ప్రాకృత భాషకు మూలమైన మరో ప్రాకృత భాష ఉండి ఉండవచ్చు! సృష్ట్యాదిగా ప్రజలు మాట్లాడిన భాషకు మాట్లాడుతూ వచ్చిన భాషకు చివరి రూపాంతరం నేటి మన తెలుగు! ఈ తెలుగు కన్నడం కలసిన భాష రెండుగా విడివడినప్పుడు కన్నడ తెలుగు భూభాగాలు కలసినచోటనే మొదట తెలుగు వికసించింది, తూర్పుగా విస్తరించింది! ‘నాగబు’అన్న మొదటి తెలుగు పదం పుట్టినది కూడ తెలంగాణ పరిసరాలలోనే... అందువల్ల తెలుగుభాష తెలంగాణ వారిది. శబ్దానికి విగ్రహరూపం ‘అక్షరం’. భావానికి విగ్రహరూపం ‘్భష’. మన సమష్టి భావజాలానికి మన తరతరాల జీవన అభివ్యక్తికి మాధ్యమం భాష! తెలంగాణ సమష్టి భావజాలానికి విగ్రహం తెలుగుభాష! ఈ తెలుగు భాషకు, తెలుగు వాఙ్మయానికి, తెలుగుభాషా సరస్వతికి విగ్రహరూపం తెలుగుతల్లి... అందువల్ల తెలంగాణ ప్రజలకు ‘తెలంగాణతల్లి’తోపాటు, ‘తెలుగుతల్లి’కూడ ఆరాధ్య.... తెలంగాణ తల్లి భౌగోళిక ప్రతీక, భూమాత రూపం, తెలుగుతల్లి భాషా వాఙ్మయాలకు ప్రతీక, భాష ద్వారా ఆవిష్కృతవౌతున్న భావానికి ప్రతీక, సరస్వతీ మాత రూపం! అందువల్ల తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలందరూ ‘తెలుగుతల్లి’ని ‘తెలంగాణ తల్లి’ని సమానంగా పూజించాలి! ఒక తల్లి తెలంగాణ ప్రజల స్వభావం, మరో తల్లి తెలంగాణ ప్రజల స్వరూపం...ఒకరు సరస్వతి, మరొకరు దివ్యధాత్రి! రాజధాని నగరంలో తెలుగుతల్లి, తెలంగాణ తల్లి విగ్రహాలు రెండూ ఉన్నాయి. రెండింటినీ పూజించడం పరిరక్షించడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రగతికీ సుగతికీ సోపానం... సకల దేవతారాధన సనాతన భారత జాతీయ సంస్కృతిలో అవిభాజ్యం!
భారత జాతీయ భౌగోళిక సాంస్కృతిక స్వరూప స్వభావాలలో వివిధ ప్రాంతీయ భౌగోళిక సంప్రదాయాలు భాగం! అందువల్ల సకల దేవీదేవతామూర్తుల సమర్చనం పరమదేవత అయిన భారతమాతృ సమారాధనలో భాగం....
తెలుగు భాష తెలంగాణ రాష్ట్ర ప్రజలకూ, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ మాత్రమేకాదు ప్రవాస తెలుగు ప్రజలకు కూడ సమాన మాధ్యమం! సమాన వారసత్వం! తెలుగు సాహితీ స్రవంతులు ఉభయ రాష్ట్రాల ప్రజల భావ సమైక్యతకు వారధులు... తెలుగులో రామాయణ కావ్యం మొదట అవతరించింది తెలంగాణ గడ్డమీద! మహాభారత రచనకు శ్రీకారం చుట్టింది అవశేషాంధ్రప్రదేశ్ నేలమీద... మహాభాగవతం ఓరుగల్లులో వికసించింది, ప్రబంధ సాహిత్యం హంపీ విజయనగరంలో పల్లవించింది! తెలుగు సాహిత్య పరిమళం మాత్రం తెలుగునేల నలుచెరగులా విస్తరించింది. అందువల్ల తెలుగు సాహిత్య వారసత్వం రెండు రాష్ట్రాలకూ సమానం! ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ గీతం ఉభయ రాష్ట్రాలకూ ఉమ్మడి రాష్టగ్రీతంగా కొనసాగినందువల్ల ప్రమాదం లేదు! ‘తెలుగు’పై తెలంగాణకు సమాన హక్కులున్నాయి. తెలుగును పరిరక్షించడంలో కూడ అవశేష ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి సమాన బాధ్యత ఉంది! ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ను శంకరంబాడి సుందరాచారి రచించే నాటికి క్రీస్తుశకం 1942నాటికి, తెలుగువారికి భౌగోళికమైన సరిహద్దులు లేవు! తెలుగుభాష కాని తెలుగుతల్లిని కీర్తించిన ఈ పాట కాని భౌగోళిక పరిధిలో బందీకారాదు!! రెండు రాష్ట్రాల ప్రజలేకాక ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు సైతం ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ను పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలి! ఇతర గీతాలను- ఉద్యమ గీతాలను ప్రబోధ గీతాలను ఆకాంక్షా గీతాలను, అభ్యుదయ గీతాలను, సాంస్కృతిక గీతాలను కూడ పాడుకోవాలి...
తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తప్పులు దొర్లినట్టు ప్రచారమైంది. ‘సత్యమేవజయ తే’అన్న ధ్యేయవాక్యం ఉండవలసిన స్థానంలో లేదట! దీన్ని సవరించుకోవడం సులభం! కాకతీయ సామ్రాజ్య కీర్తితోరణమైన ద్వారాన్ని రాజముద్రలో ప్రధాన చిహ్నంగా ఏర్పాటుచేయడం సర్వమత సమభావస్ఫూర్తికి నిదర్శనం! కాకతీయుల సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు మొత్తం తెలుగునేలకు మధ్యలో ఉండేది! ఇప్పటికీ ఎప్పటికీ కాకతీయ సామ్రాజ్య గరిమ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, అవశేష ఆంధ్రప్రదేశ్ వారికే కాదు భారతీయులందరికీ గర్వకారణం! ఈ జాతీయ స్ఫూర్తి కేంద్రాన్ని క్రీస్తుశకం 1323వ సంవత్సరంలో విదేశాలనుండి వచ్చిపడిన జిహాదీ బీభత్సకారులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన కాకతీయ సామ్రాజ్యం సర్వమత సమాన రాజ్యాంగ వ్యవస్థకు ప్రతీక! ధ్వంసంచేసిన వారు ఏకమత రాజ్యాంగ వ్యవస్థాపకులు, ఇతర మతాల పొడగిట్టని మతోన్మాదులు! ఈ మతోన్మాదులు కాకతీయ సామ్రాజ్యం ధ్వంసమైన నాటినుంచి ఆరువందల ఇరవై అయిదేళ్లపాటు ఈ ఏకమతోన్మాదులు తెలంగాణను ‘‘పాలించడం’’ చరిత్ర. ఈ మతోన్మాద చరిత్రకు పరాకాష్ఠ 1948లో అంతరించిన ‘నిజాం’పాలన! ఈ ‘పాలన’కు ప్రతిరూపం చార్మినార్... అందువల్ల కాకతీయ చిహ్నంతోపాటు ‘నిజాం’ల చిహ్నాన్ని కూడ ‘రాజముద్ర’లో ప్రతిష్ఠించడం ‘నిజాం’ల దమనకాండకు బలైన తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం! ఆవునూ, గోమాయువును ఒకేచోట...?!

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style