Our amazing new site will launch in

Wednesday, 12 October 2011

యోగులు సాగిన మార్గమిది


యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది

శాశ్వత శాంతుల స్వర్గమిది
భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది


రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికి
నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది
వినయము విద్యాభూషణములు కల విమల మనస్కుల వీడు ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది 
|| యోగులు ||


సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళి గణించినది
ఆద్యంతములకు అటు నిటు నిలిచి ఆనందము పరికించినది
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్ఠలు కాంచిన కాంచన స్వప్నమిది  
|| యోగులు ||


కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది
పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది
హాలహలమును అరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది     
|| యోగులు ||

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style