Our amazing new site will launch in

Monday, 13 October 2014

కరసేవకుల బలిదానాన్ని వృదా కానివ్వం : భజరంగ్ దళ్ తీర్మానం

హరిద్వార్ , 14/10/2014 : హరిద్వార్ లోని శ్రీ ప్రేమనగర్ ఆశ్రమం లో నిర్వహించబడుతున్న భజరంగ్ దళ్ జాతీయ స్థాయి సమావేశాల్లో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర ఉద్యమంలో అమరులైన కర సేవకుల కుటుంబాలను సత్కరించడం జరిగింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో దేశంలోని 42 ప్రాంతాలకు చెందిన భజరంగ్ దళ్ జిల్లాల మరియు విభాగ్ ల సంయోజకులు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అనేక మంది విశ్వ హిందు పరిషద్ జాతీయ నాయకులు ఈ సమావేశాలకు మార్గ దర్శనం చేసారు, కార్యక్రమ ముగింపులో జరిగిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.
ముగింపు సమావేశంలో భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పండి గారు మాట్లాడుతూ ' అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య శ్రీ రామ మందిరం నిర్మించి తీరుతాం, దేశంలోని మరెక్కడా కూడా బాబర్ పేరుతొ నిర్మాణాలను సహించేది లేదు, ఏ పవిత్ర లక్ష్య సాధనలో భాగంగా కరసేవ రోజున తమ ప్రాణాలను సహితం తృణప్రాయంగా భావించి రామ కార్యంలో బలిదానం అయిన మన సహోదరులు మన మార్గదర్శకుల త్యాగం వృదా కావడానికి వీల్లేదు, వీర హనుమాన్ వారసుల వలె మనం రామ కార్యంలో మున్డుందాం ' అని అన్నారు

Monday, 6 October 2014

ఆదోని: గోవధను అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు - ప్రతిగ విహెచ్పి కార్యాలయం పై రాళ్ళ దాడి


ఆదోని, అక్టోబర్ 5: రాస్తారోకోలు, ఆందోళనలు, రాళ్లదాడితో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆదివారం అట్టుడికింది. సోమవారం నాటి పండుగ సందర్భంగా ఓవర్గం వారు తరలిస్తున్న గోవులను భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించడం ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో ఆ వర్గంవారు పట్టణంలోని విహెచ్‌పి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా విహెచ్‌పి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిపై ఓ వర్గం వారు రాళ్లురువ్వడంతో ప్రతిగా వీర రాళ్లు విసిరారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం జరిగే పండుగ సందర్భంగా వధించేందుకు తీసుకువెళ్తున్న గోవులను స్థానిక భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసుల సాయంతో గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆ వర్గం వారు ఊరేగింపుగా టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. మాంసం కోసం తెచ్చిన ఆవులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. డిఎస్పీతో మైనారిటీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శివరామిరెడ్డి హామీ ఇవ్వడంతో శాతించిన వారు నినాదాలు చేస్తూ ఊరేగింపుగా కదిలారు. ఇంతలో విశ్వహిందూపరిషత్ కార్యాలయం రావడంతో దానిపైకి రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న మరో దుకాణం అద్దాలు సైతం పగిలాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడినుంచి తరిమివేశారు. విహెచ్‌పి కార్యాలయంపై దాడికి నిరసనగా భజరంగ్‌దళ్, విహెచ్‌పి కార్యకర్తలు సాయంత్రం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్తుండగా మరోవర్గం వారు ఓ ప్రార్థనాలయం నుంచి రాళ్లురువ్వారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను తరిమికొట్టారు.

Tuesday, 15 July 2014

జాగృత హిందూ ప్రతీక - ఆచార్య గిరిరాజ్ కిషోర్ - ఒక పరిచయం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ ప్రచారక్‌ అయిన ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌ గారు 13-7-2014 నాడు ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో బ్రహ్మౖెెక్యం చెందారు. వారి వయస్స 96 సంవత్సరాలు. చిన్న తనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘంలో చేరి అంచెలంచలుగా పైకిి ఎదగి, ప్రచారక్‌గా పూర్తి సమయాన్ని, సర్వశక్తి యుక్తులను సమాజానికి అంకితం చేశారు. విశ్వహిందూ పరిషత్‌ 1983లో చేపట్డిన ఏకాత్మతా యాత్రా సందర్భంగా వారు, మాన్యశ్రీ అశోక్‌ సింఘాల్‌ గారితో కలిసి పరిషత్‌కు అంకితమయ్యారు. పరిషత్‌ ఉద్యమాలలో వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి ఆందోళనలో వారిపాత్ర అద్వితీయమైనది. విద్యార్థి పరిషత్‌లోను, భారతీయ జనసంఘంలో కూడా వీరి సేవలను వివిధ సందర్భాలలో అందించారు


అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణమే ఆచార్యp గిరిరాజ్ కిషోర్ జి కి అసలైన నివాళి : విహెచ్పి నేత తొగాడియ

నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి- ప్రవీణ్ భాయి తొగాడియా




15/07/2014, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6, క్రొత్త డిల్లి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి తరం ప్రచారక్ మరియు విశ్వ హిందూ పరిషద్ స్థాపన, నిర్మాణంలో నిరంతర కృషి చేసిన హిందూ రాష్ట్ర స్వాప్నికుడు, హిందూ దేశ ఆత్మ గౌరవ చిహ్నం అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మానోద్యమ నేత స్వర్గీయ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారి భౌతిక దేహం తేది : 14/07/2014 ణ రోజు సందర్శకుల సౌకర్యార్థం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ కార్యాలయంలో ఉంచడం జరిగింది.
ప్రవీణ్ భాయి తొగాడియా
ఈ సందర్భంలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యధ్యక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు తన సంతాప సందేశాన్ని తెలియజేస్తూ " ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది, నేడు విశ్వ హిందూ పరిషద్ మరియు సమస్త హిందూ సమాజం తన పెద్ద దిక్కును కోల్పోయింది, శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మాణమే ' ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి కి నిజమైన నివాళి ' - ఆ నిజమైన నివాళి ఇవ్వడానికి హిందూ సమాజం సిద్దమవ్వాలి " అని అన్నారు.  

Monday, 14 July 2014

కర్నూల్ : ప్రతి మహిళా ఒక జిజాబాయి కావాలి - విహిప ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి వరలక్ష్మి

14/07/2014, కర్నూల్ : విశ్వ హిందూ పరిషద్ మహిళా విభాగం మాతృమండలి ప్రముఖుల జిల్లా స్థాయి సమావేశం తేది : 13/07/2014 నాడు స్థానిక విశ్వ హిందూ పరిషద్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది, ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది మాతృమండలి ప్రముఖులు హాజరయ్యారు.
ప్రసంగిస్తున్న శ్రీమతి వరలక్ష్మి గారు
1000 సంవత్సరాల విధర్మియ దాడుల తర్వాత కూడా ఈ దేశాన్ని నిలబెట్టిన అదృశ్య శక్తి 'అమ్మ' : శ్రీ మతి వరలక్ష్మి  
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి హాజరయిన విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత మాతృమండలి ప్రముఖ్ శ్రీ మతి  వరలక్ష్మి గారు మార్గ దర్శనం చేస్తూ " విహిప స్వర్ణ జయంతి సంవత్సరం రాబోతున్నది దేశ వ్యాప్తంగా హిందూ సంఘటన కార్యం క్రొత్త వేగాలు అందుకుంటున్నది ఆకాశంలో సగమైన మనం, దేశ సేవలోను అగ్రేసరులుగా ఉందాం, అనేక దురాక్రమణభరిత దండయాత్రలు, బౌతిక భౌద్ధిక దాడులు, మెడపై ఎల్లప్పుడూ వేలాడిన విధర్మియ పాలన అయిన ఈ దేశపు ఆత్మ చావలేదు, అందుకే ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి ఈ దేశన్ని నిలబెట్టిన ఆత్మ కోసం, ఆ ఆత్మ, ఆ అంతరంగిక శక్తి " అమ్మా " , ప్రపంచంలో అనేక దేశాలు ఒకే ఒక దండయాత్ర తో మటుమాయం అయ్యాయి, అనేక మతాలూ ఒకే ఒక్క దెబ్బతో మటుమాయం అయ్యాయి, కాని నాదేశం నిలబడింది " జిజాబాయి " లాంటి అమ్మల వలన, కాబట్టి మన మందరు ఆ పౌరుష చరిత్రకు చారిత్రిక వారసులం, మన జీవన క్రమంలో కూడా ఆ సుగుణాలను అలవరుచుకుందాం, మనం మన పిల్లలను ' వీర శివాజిలు'గా మారుద్దాం , మనల్ని మనం జిజాబాయి లుగా మర్చుకుందాం ' అని అన్నారు.
హాజరయిన మాతృమండలి ప్రముఖులు 
ఈ కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ వ్యాసరాజ్ గారు, ప్రాంత సంఘటన మంత్రి శ్రీ కేశవరాజు గారు, విభాగ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు (విహిప ప్రాంత అధ్యక్షులు )

14/07/2014, విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ జేష్ట్య నాయకులు అనేక సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా వ్యవహరించిన పూజ్య శ్రీ ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారు విశ్వ హిందూ పరిషద్ కేంద్ర కార్యాలయం, సంకట్ మోచన్ హనుమాన్ ఆశ్రమం, సెక్టార్ - 6 , డిల్లి లో  13/07/2014 (  నిన్న ) నాడు పరపదించడం జరిగింది.

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం లో వారికి ఆత్మకు శాంతి కలగాలని ఘన నివాళి అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ గోల దుర్గయ్య గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ రాజు గారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు : శ్రీ రామరాజు 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ జి మృతి హిందూ సమాజానికి తీరని లోటు, హిందూ సమాజ సంఘటన కార్యం లో తన 93 వ ఏట కూడా చూపిన ఉత్సాహం మన అందరికి స్పూర్తి దాకయం, వారి జీవనమే సగటు కార్యకర్తకు దిక్సూచి గా పని చేస్తుంది, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

శ్రీ రామ జన్మ భూమి ఉద్యమాన్ని తన భుజ స్కంధాల పై మోశారు : శ్రీ గాళ్ రెడ్డి 

ఆచార్య గిరిరాజ్ కిషోర్ లేని శ్రీ రామ జన్మభూమి ఉద్యమాన్ని ఉహించడమే కష్టం, అంతలా తనే ఉద్యమమై ఉద్యమమే తానై శ్రీ రాముని సేవలో తరించిన ధన్యజీవి, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 
  

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style