వివిధ దేశాలలోని అల్పసంఖ్యాక మతస్థులపై వారి ప్రార్థనా మందిరాలపై వారి అస్తిత్వ కేంద్రాలపై దాడులు జరుగుతుండడం అంతర్జాతీయ వైపరీత్యం! ఇలా దాడులు జరుగుతున్న ధరణీతలంలోని ఏ ప్రాంతంలో కూడ అధిక సంఖ్యాక మతస్థులపై కాని వారి ఆరాధనా స్థలాలపై కాని ఆయా జాతీయ స్ఫూర్తి కేంద్రాలపై కాని దాడులు జరగడం లేదు! ఇలా అల్పసంఖ్యాక మతస్థులు దురవస్థకు గురికావడం ఆయా దేశాలలోని అధిక సంఖ్యాకులలోని కొందరి
మతోన్మాదానికి మత విద్వేషానికి నిదర్శనం. కానీ మన దేశంలో మాత్రమే అధిక సంఖ్యాకులైన హిందువుల ఆలయాల విధ్వంసం జరుగుతోంది. ఇది జాతీయ వైపరీత్యం!! దీన్ని అల్పసంఖ్యాకులైన వారిలో కొందరి మతోన్మాదానికి మత విద్వేషానికి నిదర్శనంగా భావించాలి! ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం కాని రాజకీయ వేత్తలు కాని సిద్ధంగాలేకపోవడం వైపరీత్యం! హిందువులు అధిక సంఖ్యాకులు మాత్రమేకాదు, అనాదిగా ఈ దేశంలోని స్వజాతీయులు. మధ్యలో పుట్టిన మతాలవల్ల కాని, గిట్టిన మతాలవల్ల కాని, కొత్తగా వచ్చిన మతాలవల్ల కాని ఏ దేశంలోను ‘స్వజాతీయత’ మారడం లేదు! మన దేశంలోను మారరాదు! ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కూడ రాజకీయవేత్తలు, కుహనా బుద్ధిజీవులు సిగ్గుపడుతుండడం మరోవైపరీత్యం! ఇప్పుడు రాష్ట్ర రాజధానిలోని హైందవ దేవాలయాలపై దాడులు నడుస్తున్నాయి. ఆలయాలలో పథకం ప్రకా రం దొంగతనాలు జరుగుతున్నట్టు అవి జరుగుతున్న తీరునుబట్టి బుర్రలో బుద్ధి ఉన్నవారికి స్పష్టంగా తెలిసిపోతుంది! గత నెలరోజులలో భాగ్యనగరంలోని పనె్నండు హైందవ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
మతోన్మాదానికి మత విద్వేషానికి నిదర్శనం. కానీ మన దేశంలో మాత్రమే అధిక సంఖ్యాకులైన హిందువుల ఆలయాల విధ్వంసం జరుగుతోంది. ఇది జాతీయ వైపరీత్యం!! దీన్ని అల్పసంఖ్యాకులైన వారిలో కొందరి మతోన్మాదానికి మత విద్వేషానికి నిదర్శనంగా భావించాలి! ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం కాని రాజకీయ వేత్తలు కాని సిద్ధంగాలేకపోవడం వైపరీత్యం! హిందువులు అధిక సంఖ్యాకులు మాత్రమేకాదు, అనాదిగా ఈ దేశంలోని స్వజాతీయులు. మధ్యలో పుట్టిన మతాలవల్ల కాని, గిట్టిన మతాలవల్ల కాని, కొత్తగా వచ్చిన మతాలవల్ల కాని ఏ దేశంలోను ‘స్వజాతీయత’ మారడం లేదు! మన దేశంలోను మారరాదు! ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కూడ రాజకీయవేత్తలు, కుహనా బుద్ధిజీవులు సిగ్గుపడుతుండడం మరోవైపరీత్యం! ఇప్పుడు రాష్ట్ర రాజధానిలోని హైందవ దేవాలయాలపై దాడులు నడుస్తున్నాయి. ఆలయాలలో పథకం ప్రకా రం దొంగతనాలు జరుగుతున్నట్టు అవి జరుగుతున్న తీరునుబట్టి బుర్రలో బుద్ధి ఉన్నవారికి స్పష్టంగా తెలిసిపోతుంది! గత నెలరోజులలో భాగ్యనగరంలోని పనె్నండు హైందవ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
వీటి సంఖ్య పద్దెనిమిది అని కూడ సమాచారం ప్రచారమైంది. పనె్నండు ఆలయాలు దాడులకు గురికావడం వెనుక వ్యూహం ఉంటుందన్నది స్పష్టం. అల్పసంఖ్యాక మతాల సామాన్య ప్రజలకు ఇందులో భాగం లేదు. కానీ ఈ వ్యూహంలో తీవ్రవాద కార్యకలాపాలకు ప్రధాన అడ్డాగా ఉన్న పొరుగుదేశం పాకిస్తాన్ ప్రేరిత బంగ్లాదేశ్‌లోని జిహాదీ బృందాల ప్రేరిత మతోన్మాదులు ఉన్నారా? అన్నది ‘నిఘా’ వ్యవస్థలో కనిపెట్టవలసిన అంశం. భారతదేశాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని పాకిస్తాన్‌లోని జిహాదీ ముఠాలు అనేకసార్లు ప్రకటించి ఉన్నాయి. ఇలా బద్దలుకొట్టడంలో భాగంగానే మన దేశంలో అనేక బీభత్స ఘటనలు జరిగాయి. వేలాది మంది హిందువులను పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’లు హత్యచేశారు. 2008 నవంబర్ నాటి ముంబయి హత్యాకాండ తరువాత అంతర్జాతీయ సమాజపు ఒత్తిడులకు లొంగిన పాకిస్తాన్ ప్రభుత్వం వ్యూహం మార్చింది. భారతదేశంలోకాక తమ దేశాలలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరపడం ‘జిహాదీ’ హంతకులు మార్చుకున్న వ్యూహంలో భాగం! ఇందులోభాగంగానే జిహాదీలు బంగ్లాదేశ్‌లోను పాకిస్తాన్‌లోను మిగిలి ఉన్న హైందవ ఆలయాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ నేలమట్టం చేసే కార్యక్రమాన్ని మన దేశానికి కూడ విస్తరించారా? చప్పుడు కాకుండా ప్రతిరోజు ఎన్ని హైందవ ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ‘నిఘా’ యంత్రాంగాలు పసికట్టగలుగుతున్నాయా?? భాగ్యనగరంలోనే నెల రోజులలో ఇన్ని ఆలయాలపై దాడులు జరిగాయి. ఆలయాలలో దొంగతనాలు జరిగిపోయాయి. మరి మొత్తం దేశంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ యంత్రాంగం, అధికార గణం ఎల్లప్పుడు అందుబాటులో ఉండే రాష్ట్ర రాజధానిలోనే ఆలయాలకు భ్రదత కరువైతే, మారు మూల ప్రాంతాల ఆలయాల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశంలో లెక్కలేనన్ని చారిత్రక ఆలయాలున్నాయ. వాటికి రక్షణ ఎవరు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ విధ్వంసాన్ని అడ్డుకునేదెవరు. ఇక రాష్ట్ర రాజధానిలో జరిగే ఆలయ విధ్వంసకాండ గురించిన సమాచారం మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే తెలీదు! దేశం మొత్తంమీద జరిగే పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ కలాపాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి??
జంట నగరాలలో ఒక దేవాలయంపై జరుగుతున్న దాడికి మరో దేవాలయంపై జరుగుతున్న దాడికి సంబంధం లేదని, పథకం ప్రకారం ఇవి జరగడం లేదని పోలీసులు ‘‘కనిపెట్టారు!’’ పథకం ప్రకారం ఈ మతోన్మాద కలాపాలు కొనసాగుతున్నాయని అంగీకరిస్తే మత సామరస్యం దెబ్బతింటుందన్న భయం పోలీసులకు ఉండవచ్చు. తప్పులేదు. ఇవన్నీ చెదరుమదురు ఘటనలైనప్పుడు హిందూ ఆలయాలపై మాత్రమే ఎందుకని ఇలా దాడులు జరిగాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడ ప్రభుత్వంవారి బాధ్యత! దొరతనం వద్ద ఎలాంటి సమాధానం లేదు! జంటనగరాలలోని వివిధచోట్ల ప్రధానంగా పాతబస్తీలో దుండగులు రాళ్లురువ్వుతున్నారు. కాశ్మీర్ లోయలో గతంలో ఇలా రాళ్లకుప్పలు వెలిశాయి, ఆ కుప్పల నుండి దుండగులు రాళ్లుతీసుకొని భద్రతాదళాల మీద వర్షం కురిపించారు. ఈ రాళ్లు రువ్వే ఘటనలు జంటనగరాలకు వ్యాపించడం వెనుక కూడ ఎలాంటి పథకం లేదా? నగరం మధ్యలో నిలబడి వందలాది మంది దుండగులు రువ్వడానికి కావలసిన రాళ్లు ఎక్కడనుండి సరఫరా అవుతున్నాయి? ముషీరాబాద్‌లో దేవాలయంవద్ద రాళ్లు రువ్వారు. షాఆలిబండ బంగారు మైసమ్మ ఆలయంపై కూడ రాత్రి పూట అనేక గంటలపాటు రాళ్లు విసిరారు? రెండు దేవాలయాల మధ్య పది కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. అక్కడా ఇక్కడా కూడ అదే దురాలోచన పుట్టడం రాళ్లురువ్వడం ‘పథకం’లో భాగమా కాదా?? భాగం కాదని కనిపెట్టడానికి పోలీసులకు దొరికిన ప్రాతిపదిక ఏమిటో?? పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ముఠాలు దేశమంతటా ఉన్నాయి. భాగ్యనగరంలోను ఉన్నాయి!! ఉన్నాయని గత చరిత్ర నిరూపించింది!! ఈమధ్యకాలంలో ఈ ముఠాలను ప్రభుత్వంవారు ఏరిపారేశారా?? పథకం ఆ ముఠాలది కావచ్చు కదా?? మత సామరస్యం అంటే ఈ దేశాన్ని మాతృభూమిగా భావించే స్వజాతిలోని వివిధ మతాలమధ్య పరస్పర ప్రేమ, అవగాహన! పాకిస్తాన్‌లో మన దేశాన్ని బద్దలుకొట్టడానికి కుట్రచేస్తున్న జిహాదీ తండాలకు, ఇక్కడ ఉన్నవారి అనుచరులకూ ఈ దేశ ప్రజలలో మత సామరస్యం ఎలా కుదురుతుంది?? కుదరదని ఆలయాలను ధ్వంసం చేస్తున్న జిహాదీ ఉన్మాదులు నిరూపించడం లేదా?? ఇకముందైనా ఆలయాల మీద దాడులు జరగకుండా నిరోధించడం పోలీసుల విధి, ప్రభుత్వ కర్తవ్యం. అప్పుడు ‘పథకం ప్రకారం’ దాడులు జరిగాయా? ‘పథకం లేకుండా’ దాడులు జరిగాయా అన్న ప్రశ్నలు పుట్టవు! ఇలా నిరోధించడం క్రీస్తుశకం 712నుంచి కూడ ఈ దేశంలోని ప్రభుత్వాలకు సాధ్యం కాలేదన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం! మరి ఆలయాలకు దిక్కెవ్వరు...??
గత నెల ఐదవ తేదీన జంట నగరాలలోని ఉప్పుగూడ ప్రాంతంలోని మంగళ ముఖ హునుమాన్ మందిరంపై దాడి జరిగింది. ఈనెల ఐదవ తేదీన బంగారు మైసమ్మ ఆలయంపై దాడి జరిగింది. ఈ మధ్యకాలంలో అనేక ఆలయాలలో దొంగతనాలు దోపిడీలు జరిగిపోయాయి. ఇదంతా పథకం ప్రకారం కాకుండా పనిలేని అల్లరిమూకలు ఎవరికివారు తమాషాకి జరిపిస్తున్న వ్యవహారమా? పథకం ఉందని ఒప్పుకున్నట్టయితే భగ్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న పుట్టుకువస్తుంది. అందువల్ల ‘‘పథకమే లేదని’’ ప్రకటించడం సులభమైన పని. గత నెల 11వ తేదీన లాల్‌దర్వాజావద్ద గల సింహవాహినీ మహంకాళిదేవీ ఆలయంలో జరిగిన చోరీ పథకం లేకుండా జరిగి ఉంటుందా?? అమ్మవారి కిరీటం, బంగారు ప్రభ, వజ్రపు తిలకం, స్వర్ణమయ పాదాలు అపహరణకు గురిఅయ్యాయట! వజ్రపు తిలకం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు? ఆ బొట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. ముచికుందా నది వరదలలో భాగ్యనగరం కొట్టుకొని పోకుండా రక్షించినందుకు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ అమ్మవారికి ఈ వజ్రపు తిలకాన్ని సమర్పించాడట! ఇలాంటి చారిత్రక ఆలయ ఆభరణాలను కొల్లగొట్టినవారు విస్తృత విధ్వంసక పథకంలో భాగస్వాములు కాని చిల్లర దొంగలా?? ఇలా వరుసగా నెల లోపల పద్దెనిమిది ఆలయాలపై దాడులు కానీ, వాటిలో దొంగతనాలు జరిగిన సంగతి భాగ్యనగర వాసులకే తెలియదు!!
పదేళ్ల క్రితం అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఐదువారాల క్రితం బంగ్లాదేశ్‌లో ఎనిమిది హైందవ ఆలయాలను జిహాదీలు ధ్వంసం చేశారు! పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక హైందవ దేవాలయాన్ని సెప్టెంబరు నెలలో దుండగులు ధ్వంసంచేశారు. కాశ్మీర్ లోయలో క్రీస్తుశకం 1947లో ఎన్ని హిందూ ఆలయాలు ఉండేవి?? ఇప్పుడెన్ని ఉన్నాయి?? 712లో మహమ్మద్ బిన్ కాశిమ్ అనే బీభత్సకారుడు సింధులోని దేవల పట్టణంలోకి చొరబడిన నాటికి, సింధులో ఎన్ని ఆలయాలు ఉన్నాయి?? ఇప్పుడెన్ని ఉన్నాయి. పాకిస్తాన్‌గా బంగ్లాదేశ్‌గా ఏర్పడిన అఖండ భారత భూభాగంలో మహమ్మద్ బిన్ కాశిమ్ కాలంనాటికి ఉన్న ఆలయాలు ఎన్ని?? ఇప్పుడున్నవి ఎన్ని?? 712 నుండి 1947 వరకు కొనసాగిన అఖండ భారత చరిత్రలో ఆలయ విధ్వంసం ప్రధాన వైపరీత్యం! గజనీ, ఘోరీ, ఖిల్జీ, తుగ్లక్ ముఘల్ పేర్లతో చెలామణి అయిన బీభత్సకారులు ఎన్నివేల ఆలయాలను ధ్వంసం చేశారు?? ఔరంగజేబు అనేవాడు పరిపాలకుని ముసుగువేసుకున్న బీభత్సకారుడు. ఆలయ విధ్వంసంకోసం అతగాడు ఒక ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పరచడం చారిత్రక సత్యం!!
క్రీస్తు శకం 712నుండి నిరంతరాయంగా అమలుజరుగుతున్న ఆలయ విధ్వంసక పథకంలో ఇప్పుడు భాగ్యనగరంలో జరిగిన దాడులు భాగం... కాదనడం సత్యాన్ని సత్యంగా అంగీకరించకపోవడం!!
ఆంధ్రభూమి సౌజన్యంతో
ఆంధ్రభూమి సౌజన్యంతో

No comments:
Post a Comment