చారివూతక కట్టడాల కంటే విశ్వాసం గొప్పదని, ఆ కట్టడాలతో ఆలయాలను పోల్చడం ఏ మతంవారైనా చేయడం సరయింది కాదని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. చారివూతక కట్టడాలతో దేవాలయాలను పోల్చడం హిందువుల మనోభావాలను కించపరిచిన అన్నారు. సోమవారం భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తుండగా తనను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగనాడు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తుల దర్శనాన్ని అడ్డుకుంటూ నిషేధాజ్ఞలు విధించి మరో మతస్థుల ప్రార్థనలకు సడలించి అనుమతించడం వివక్ష కాదా, ఇది లౌకికవాదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. హిందూ ధర్మం పురుడు పోసుకున్న దేశంలో లౌకికవాదం పేరుతో హిందూ ధర్మాన్ని, హిందువులపై వివక్షను కొనసాగిస్తూ ప్రభుత్వం అణగదొక్కుతోందని విమర్శించారు.
అన్ని మతాలు, కులాలవారు శాంతియుతంగా ఉండాలని గౌరవించే తనలాంటి సాధువులను ఆలయ దర్శనానికి వెళ్తే ఎందుకు అరెస్టు చేసినట్లో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. అరెస్టు పేరుతో తనను ఏడుగంటలపాటు నిర్బంధించారని, ఈ సంఘటన తనతోపాటు లక్షల మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందని అన్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందని, తనను స్థానికేతరుడు అంటూ ఆలయానికి వెళ్లడానికి వీల్లేదనడం ఆశ్చర్యం కలిగించిందని, ప్రాంతీయ విభేదాలు భక్తికి అడ్డురావని అన్నారు. ‘‘నేనేమైనా దేశవూదోహినా? లేక కసబ్‌నా? నేను చేసిన ద్రోహమేమిటి? దేవుని దర్శించడానికి వెళితే అడ్డుకోవడం వివక్ష కాదా’’ అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో హిందూ ధర్మంపై జరుగుతున్న దాడి, వివక్షకు సీఎం కిరణ్‌కుమార్‌డ్డి వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే రాష్ట్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. చార్మినార్‌లాంటి కట్టడాలు ఆలయంతో దెబ్బతినడంలేదని, వాహనాల రాకపోకలు అధికమవడం వల్ల ధ్వని, వాయు కాలుష్యంతో దెబ్బతింటోందనే విషయాన్ని గ్రహించాలన్నారు.
నమస్తేతెలంగాణ సౌజన్యంతో

No comments:
Post a Comment