రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) సోమవారం వెల్లడించింది. రామసేతుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా
కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం కోర్టుపై ఆధారపడడంపై విహెచ్‌పి ధ్వజమెత్తింది. ‘మైనార్టీల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పుడు హిందువుల విశ్వాస పరిరక్షణ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలి’ అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ఇక్కడ సోమవారం విలేఖరులతో అన్నారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించేటట్లు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ, తమిళనాడు విహెచ్‌పి శాఖ తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై విహెచ్‌పి ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment