భాగ్యనగర్ , విశ్వ హిందు పరిషద్ ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత ధర్మ ప్రసార్ కార్యకర్తల అభ్యాస వర్గ ( శిక్షణ తరగతులు ) తేది ఏప్రిల్ 28, 29, 30 లలో జి పుల్లా రెడ్డి మెమోరియల్ హైస్కూల్
, దిల్ శుఖ్ నగర్ , భాగ్యనగర్ లో జరిగింది. 46 స్థలాల నుండి 74 మంది కార్యకర్తలు హాజరయ్యారు , కేంద్రియ సహా కార్యదర్శి శ్రీ సత్యం గారు వర్గలో మూడు రోజుల పాటు ఉండి కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేసారు .
ఈ వర్గ ఉద్గాటన కార్యక్రములో పాల్గొన్న శ్రీ రమణ గురు (హనుమత్ ఉపాసకులు ) ఆశి: ప్రసంగం లో హిందూ ధర్మ వైశిష్ట్యాని వివరిస్తూ విశ్వ శాంతిని కోరుకునే ఏకైక దర్మం హిందూ ధర్మమని దీనిని విశ్వ వ్యాపితం చేయాలని అప్పుడే జగత్తు అంత శాంతి విరసిల్లుతుందని అన్నారు , శ్రీ దుర్గయ్య ( పస్చిమాంద్ర కార్యదర్శి) మార్గ దర్సనం చేస్తూ " తల్లి బాద తీర్చని వాడు - తనయుడే కాడని " శ్రీ కృష్ణ పరమాత్ముడు తన తల్లి బాద తీర్చడానికి ముష్కర సంహారం చేసాడు ఇప్పుడు భారత మాత విధర్మీయుల భౌతిక , భౌద్ధిక దురాక్రమనతో వేదనను అనుభవిస్తుంది ఆ తల్లి వేదనను తీర్చేందుకు మనమందరం శ్రీ కృష్ణులం కావాలని అన్నారు .
రెండో రోజు అంతర్జాతీయ అద్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు వర్గలో పాల్గొని పరిషత్ కార్య ద్రుడికరణ దృశ్య ఎక్కువ మంది పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలను , వానప్రస్తి కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు , శ్రీ జుగల్ కిశోర్ ( జాతీయ కార్యదర్శి ) మాట్లాడుతూ సత్సంగం కేంద్రంగా పరిషత్ కార్యం జరగాలని దర్మం కోసం ఆలోచించే వ్యక్తుల ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే యోజనాబద్ద సమయదానం ఇవ్వాలని అన్నారు .
వర్గ సమారొహ్ లో శ్రీ సత్యం గారు మాట్లాడుతూ మన కార్యకర్తల అసమాన కృషి , త్యాగమయ జీవన విదానం , సర్వ వ్యాపి సర్వ స్పర్శి అనే ఆలోచనా ధోరణి వలన ధర్మంతరణం చెందిన 6,60,000 మంది మన సహోదరులు తిరిగి తమ స్వధర్మం లోనికి తిరిగి వస్తున్నరు. ఈ విషయంలో మన కార్యకర్తల కృషిని ఇప్పుడిప్పుడే హిందూ సమాజం గుర్తించి అభినందించడం ప్రారంభమైనదని , మన కృషికి తగ్గ ఫలితాన్ని మనం మన కన్నులతో చూసే రోజు దగ్గరలోనే ఉంది, దానికై ఇప్పుడు జరుగుతున్నా ధర్మ ప్రసార్ పనిని 100 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు

No comments:
Post a Comment