Our amazing new site will launch in

Monday, 30 April 2012

విజయవంతమైన ధర్మ ప్రసార్ అభ్యాస వర్గ

భాగ్యనగర్ , విశ్వ హిందు పరిషద్ ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత ధర్మ ప్రసార్ కార్యకర్తల అభ్యాస వర్గ ( శిక్షణ తరగతులు ) తేది ఏప్రిల్ 28, 29, 30 లలో జి పుల్లా రెడ్డి మెమోరియల్ హైస్కూల్
, దిల్ శుఖ్ నగర్ , భాగ్యనగర్ లో జరిగింది. 46 స్థలాల నుండి 74 మంది కార్యకర్తలు హాజరయ్యారు , కేంద్రియ సహా  కార్యదర్శి శ్రీ సత్యం గారు వర్గలో మూడు రోజుల పాటు ఉండి కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేసారు . 

ఈ వర్గ ఉద్గాటన కార్యక్రములో పాల్గొన్న శ్రీ రమణ గురు (హనుమత్ ఉపాసకులు ) ఆశి: ప్రసంగం లో హిందూ ధర్మ వైశిష్ట్యాని వివరిస్తూ విశ్వ శాంతిని కోరుకునే ఏకైక దర్మం హిందూ ధర్మమని దీనిని  విశ్వ వ్యాపితం చేయాలని  అప్పుడే జగత్తు అంత శాంతి విరసిల్లుతుందని అన్నారు , శ్రీ దుర్గయ్య ( పస్చిమాంద్ర కార్యదర్శి) మార్గ దర్సనం చేస్తూ " తల్లి బాద తీర్చని వాడు - తనయుడే కాడని " శ్రీ కృష్ణ పరమాత్ముడు తన తల్లి బాద తీర్చడానికి ముష్కర సంహారం చేసాడు ఇప్పుడు భారత మాత విధర్మీయుల భౌతిక , భౌద్ధిక దురాక్రమనతో వేదనను అనుభవిస్తుంది ఆ తల్లి వేదనను తీర్చేందుకు మనమందరం శ్రీ కృష్ణులం కావాలని అన్నారు .
రెండో రోజు అంతర్జాతీయ అద్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు వర్గలో  పాల్గొని పరిషత్ కార్య ద్రుడికరణ దృశ్య ఎక్కువ మంది పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలను , వానప్రస్తి కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు , శ్రీ జుగల్ కిశోర్ ( జాతీయ కార్యదర్శి ) మాట్లాడుతూ సత్సంగం కేంద్రంగా పరిషత్ కార్యం జరగాలని దర్మం కోసం ఆలోచించే వ్యక్తుల ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే యోజనాబద్ద సమయదానం ఇవ్వాలని అన్నారు . 
వర్గ సమారొహ్ లో శ్రీ సత్యం గారు మాట్లాడుతూ మన కార్యకర్తల అసమాన కృషి , త్యాగమయ జీవన విదానం , సర్వ వ్యాపి సర్వ స్పర్శి అనే ఆలోచనా ధోరణి వలన ధర్మంతరణం చెందిన 6,60,000 మంది  మన సహోదరులు తిరిగి తమ స్వధర్మం లోనికి తిరిగి వస్తున్నరు. ఈ విషయంలో మన కార్యకర్తల కృషిని ఇప్పుడిప్పుడే హిందూ సమాజం గుర్తించి అభినందించడం ప్రారంభమైనదని , మన కృషికి తగ్గ ఫలితాన్ని మనం మన కన్నులతో చూసే రోజు దగ్గరలోనే ఉంది, దానికై ఇప్పుడు జరుగుతున్నా ధర్మ ప్రసార్ పనిని 100 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు 

విశ్వ హిందు - May-2012



(or)
Download as pdf format 


Monday, 23 April 2012

రామసేతుపై కోర్టును ఆశ్రయిస్తాం - వి హి ప అంతర్జాతీయ అద్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి

రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) సోమవారం వెల్లడించింది. రామసేతుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా
కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం కోర్టుపై ఆధారపడడంపై విహెచ్‌పి ధ్వజమెత్తింది. ‘మైనార్టీల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పుడు హిందువుల విశ్వాస పరిరక్షణ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలి’ అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ఇక్కడ సోమవారం విలేఖరులతో అన్నారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించేటట్లు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ, తమిళనాడు విహెచ్‌పి శాఖ తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై విహెచ్‌పి ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Tuesday, 10 April 2012

మెదక్ జిల్లలో 11 కుటుంబాల పునరాగమనం

మెదక్ : మెదక్ జిల్లా దుల్తబాద్ మండములోని ఎలికంటి గ్రామములో జరిగిన పునరాగమన కార్యక్రమంలో 11 కుటుంబాలకు చెందిన
 20 మంది తమ మాతృ ధర్మం లోకి పునరాగమనం చెందారు. 

ఈ సందర్భంగా గ్రామములో శ్రీ బాల రెడ్డి గారి నేతృత్వంలో 151 కుండాల భారి ధర్మ రక్షా హోమం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల 30 గ్రామాల నుండి సుమారు 500 మంది ప్రజలు హాజరై వారిని సాదరంగా హిందు  ధర్మం లోనికి  ఆహ్వానించారు,  
పునరాగమనం చెందిన కుటుంబాలకు శ్రీ రాముని చిత్ర పటాలను శ్రీ జి సత్యం వి హి ప జాతీయ కార్యదర్శి గారి చేతుల మీదుల భాహుకరించడం జరిగింది 

Friday, 6 April 2012

హిందువులు సమర్పణ భావాన్ని పెంచుకోవాలి :Dr ప్రవీణ్ ప్రవీణ్ తొగాడియా

06-Apr-2012 , భాగ్యనగరం : హిందువులలో సమర్పణ భావం  పెరగాల్సిన అవసరం చాలా ఉందని విశ్వ హిందు పరిషద్
అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా అన్నారు. సికింద్రాబాద్ లోని బెల్ల్సన్ తాజ్ హోటల్ లో జరిగిన ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మత-మార్పిడ్లు దేశ సమైక్య్హతకి భంగం కలిస్తుంది దీన్ని నివారించడానికి దేశం లోని హిందువులు తమ సంపాదనలోని కొంత భాగాన్ని సమాజ హితానికి ఖర్చు చెయ్యాలి అలాగే తమ శేష జీవితం లోని సమయాన్ని వానప్రస్తి పూర్తి సమయ కార్యకర్తగా సమాజ కార్యం చెయ్యొచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగ్యనగరం లోని ప్రముఖ వ్యాపార వేత్తలు , ప్రతిష్టిత వ్యక్తులు మరియు శ్రీ రామ రాజు గారు , శ్రీ సత్యం గారు , శ్రీ వెంకటేశ్వర రాజు గారు , శ్రీ కేశవ్ జి మొదలగువారు పాల్గొన్నారు 

గో ఉత్పత్తులను విరివిగా వాడండి - ప్రవీణ్ తొగాడియా

మాననీయ ప్రవీణ్ జి భాగ్యనగర్ పర్యటనలో భాగంగా " సింధు భవన్ ని సందర్శించడం జరిగింది , అక్కడ జరిగిన ఆత్మీయ సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఏ కులం వారైన హిందువులందరూ సోదరులని ఒకరి కష్టం వస్తే మరొకరు తప్పక సహాయపడాలని అప్పుడే మనం " హైందవ సోదర సర్వే " అనే వాక్యాన్ని పాటించిన వారౌతామని తెలిపారు . 
సింధు భవన్ ఆత్మీయ సమావేశం లో ప్రవీణ్ జి

ఇస్లాం దురాక్రమణ మూలాన అనేక ప్రాంతాలు మన దేశం నుండి వేరైనప్పటికి ఆ ప్రాంతాల ప్రజలు తమ మాతృ దేశం పై మమకారం తో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని అన్నారు 
సింది సమాజ్ సభ్యులు ప్రవీన్ భాయి తొగాడియా కి ఆత్మిక కృతజ్ఞ్యతలు తెలిపుతూ హనుమాన్ గదని భాహుమతి గా ఇచ్చారు .

హిందువుల హక్కులను కాలరాస్తే సహించం :శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర లో ప్రవీణ్ భాయి తొగాడియ

భాగ్యనగరం , ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరిగే " శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర " అంగరంగ వైభవంగా జరిగింది , గౌలిగూడ శ్రీ రామ ఆలయం నుండి ప్రారంభమైన యాత్రకి ప్రజలనుండి అనూహ్య స్వాగతం లభించింది దాదాపు అరవై వేల ద్విచక్ర వాహనాలో లక్షకి పైగా భజరంగీలు ఈ యాత్రలో పాలోనడం జరిగింది 
హిందువుల హక్కులను కాలరాస్తే సహించం : ప్రవీణ్ భాయి తొగాడియ 
యాత్ర ముగింపు సమావేశం లో మాననీయ ప్రవీణ్ భాయి తొగాడియ ప్రసంగిస్తూ ఈ దేశం హిందు వ్యతిరేక దేశం గా మారబోతుందని అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ లేకుండా పోతుంది , మన రాజకీయ నాయకులు తమ స్వార్ధానికి హిందు సమాజాన్ని పణంగా పెడుతున్నారు అలాంటి వారికి సామాజిక , ఆర్ధిక భాహిష్కరణ చేయాలి , వారిని హిందు ఉత్సవాలకు ఆహ్వానించొద్దు అప్పుడు వారికి హిందు సమాజ విలువ తెలుస్తుంది , అలాగే మనం మన ఓటును హిందుత్వం కోసం పనిచేసే నాయకులకే వేయాలని " మన ఓట్లు ప్రాంతం పేరుతొ , కులం పేరుతొ " విడిపోయినంత కాలం మన రాజకీయ నాయకులు ముస్లింల గడ్డం దువ్వుతారని , ఈలాంటి పరిణామాల నుండి హిందు దేశాన్ని రక్షించడానికి హిందు ఓటు బ్యాంకు నిర్మాణం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
 
మత ప్రాతిపతిక రిజర్వేషన్లకు ఈ దేశంలోని హిందులకు ప్రాణ సంకటం గా మారాయని , ఇవి దేశ సమైక్యతకు భంగం కలిగిస్తాయి ఈ దేశం హిందువులది కాబట్టి హిందువులే ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలి , ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషద్ దేశవ్యాపితంగా ఒక ఉప్పెన లాంటి మహోద్యమాన్ని నిర్మాణం చేయబోతుందని ఆ ధాటికి హిందు వ్యతిరేక శక్తులు నశించిపోవడం తధ్యమని ఆయన అన్నారు .
 
 

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style