Our amazing new site will launch in

Sunday, 4 March 2012

రాష్ట్రంలో మత మార్పిడులకు అడ్డుకట్ట - విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 3: ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశంతో సహా అనేక జిల్లాలలో క్రైస్తవ మిషనరీలు విచ్చలవిడిగా పాల్పడుతున్న మత మార్పిడులను అడ్డుకునేందుకు గట్టి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు
జి రాఘవరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో పూర్తిసమయం పని చేసే ఒక కార్యకర్తను నియమించి క్రైస్తవ మిషనరీలు పాల్పడుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తామని ఆయన శనివారం విలేఖరులకు చెప్పారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన శనివారం మొట్టమొదటిసారిగా పరిషత్ అగ్రనాయకులు అశోక్ సింఘాల్, హరి విష్ణు దాల్మియా తదితరులతో కలసి హోలీని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటితో పోల్చిచూస్తే ఇప్పుడు రాష్ట్రంలో మత మార్పిడులు తగ్గాయని ఆయన చెప్పారు. ఇకనుంచి ప్రతి ఆదివారం క్రైస్తవ మిషనరీలకు పోటీగా హిందువులలో మత మార్పిడికి వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని మిషనరీలు మత మార్పిడి చేస్తున్నాయని చెప్పారు. క్రైస్తవ మిషనరీలకు అందుతున్నట్లు నిధులు విశ్వహిందూ పరిషత్‌కు అందిననాడు మత మార్పిడులకు తెర పడుతుందని అన్నారు. మన దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు తమ సొంత ఆశ్రమాలు, పీఠాల అభివృద్ధిపైనే దృష్టిని కేంద్రీకరించటంతో హిందువులను సమైక్యపరచి ఏకతాటిపై నడిపించలేకపోతున్నామని ఆయన అభిప్రాయ పడ్డారు. ఐదు దశాబ్దాలలో విశ్వహిందూ పరిషత్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్విరామ కృషి చేసిందని చెప్పారు. విశ్వహిందూ పరిషత్ మరింత బలపడగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గోమాంసం ఎగుమతి చేస్తే తీవ్ర పరిణామాలు
పనె్నండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో గోమాంసాన్ని పెద్దఎత్తున ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలన్న ప్రణాళికా సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల హిందువులు భక్తితో పూజించే ఆవులు అధిక సంఖ్యలో బలైపోతాయని పరిషత్ సంరక్షణ సభ్యుడు అశోక్ సింఘాల్ విలేఖరులకు చెప్పారు. వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోసంరక్షణకు అధికప్రాధాన్యం ఇవ్వగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గోమాంసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని అనుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. హిందువులను నెమ్మది నెమ్మదిగా మైనారిటీలుగా మార్చి ముస్లింలు, క్రైస్తవులకు అధికప్రాధాన్యం లభించే విధంగా సోనియాగాంధీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో భాగంగానే మత కలహాల నిరోధక బిల్లుకు రూపకల్పన చేశారని అన్నారు. సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న జాతీయ సలహా మండలి ఈ బిల్లును రూపొందించిందని ఆయన గుర్తు చేశారు. భారత దేశంలో హిందువులను దశల వారీగా మైనారిటీలుగా మార్చడానికి కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. రామమందిరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆయన అంగీకరించారు. హిందువులు తమ ఆరాధ్యదైవంగా పూజించే రామునికి దివ్య మందిరాన్ని తాము నిర్మించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు

Sunday, 12 February 2012

2014 లో రామమందిరం నిర్మిస్తాం - అశోక్ సింఘాల్



అయోధ్యలో రామమందిరాన్ని 2014లో నిర్మించి తీరుతామని, ఈ అంశంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కితగ్గే ప్రసక్తి లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంరక్షకులు అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు. మత హింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయన శనివారం హైదరాబాద్‌లో
విహెచ్‌పి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిలో ముష్కరులు బాంబుదాడులకు పాల్పడిన సందర్భంలో కన్నీటి బొట్టు రాల్చని సోనియాగాంధీ బాట్లా ఎన్‌కౌంటర్ మృతుల పట్ల సానుభూతి ప్రకటించడం
జాతికి చేస్తున్న ద్రోహంగా అభివర్ణించారు. ఈ విధంగా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ దేశంలో పెరుగుతున్న మత విద్వేషాలకు సోనియా కారణభూతురాలిగా మారుతున్నారని అన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి ప్రతిపాదించిన మతహింస నిరోధక బిల్లు కేవలం హిందువులను బలిపశువులను చేయడానికేనని, అందుకే తాము మొదటి నుంచీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలోని సాధువులనంతా ఒక్కతాటిపైకి తెచ్చి ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేలా ఏప్రిల్‌లో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఇటీవలి కాలంలో మతమార్పిడులు పెరగడం ఆందోళన కలిగిస్తున్న పరిణామమని, దీని వెనుక ప్రభుత్వ సాయం ఉందేమోనంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని, హిందూ మతం ప్రాశస్త్యం తెలుసుకుని ఆ మతస్తులుగా పుట్టినందుకు గర్వించాలే తప్ప ప్రలోభాలకు తలొగ్గి మతమార్పిడి చేసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. యువతంతా వేలంవెర్రిలా వ్యాలెంటైన్ డే జరుపుకోవడం మన సంస్కృతీ, సంప్రదాయాలకు తీరని ద్రోహం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు రంగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, పౌరసంబంధాల ప్రతినిధి వెంకటేశ్వర్రాజు, సమన్వయకర్త ఆకారపు కేశవరాజు తదితరులు పాల్గొన్నారు.


చినజీయర్‌తో సింఘాల్ భేటీ

అశోక్ సింఘాల్ తన పర్యటనలో భాగంగా పలువురు స్వామీజీలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని అపురూప వేంకటేశ్వరాలయాన్ని సందర్శించి అక్కడ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ మతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, తిరుమల వివాదం గురించి, మతహింస నిరోధక బిల్లు గురించి వీరిరువురి నడుమ చర్చ కొనసాగినట్లు తెలిసిం

Saturday, 28 January 2012

గోరక్షణ తక్షణ కర్తవ్యం:VHP ప్రాంత సమావేశాలలో శ్రీ రామరాజు గారు

శ్రీ ఎం రామరాజు గారి మార్గదర్శనం
భాగ్యనగర్ , హింది నగర్ జిల్లా : హిందినగర్(మెహిదీ పట్నం) జిల్లాలోని గుడిమల్కాపూర్లో విశ్వా హిందూ పరిషద్ ప్రాంత సమావేశాలు తేది 28 నాడు ఆంధ్ర ప్రదేశ్ - పశ్చిమ ప్రాంత అధ్యక్షులు  శ్రీ M రామరాజు
గారి జ్యోతి ప్రజ్వలన  తో ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు 23(పరిషద్ దృశ్య) జిల్లాల అద్యక్ష, కార్యదర్శులు, ఆయా ఆయం ప్రముఖులు హాజరైనారు.


ప్రాంత అధ్యక్షులు  శ్రీ M రామరాజు  మాట్లాడుతూ మన రాష్ట్రంలో గోవధ ను నిషేదిస్తూ చట్టాన్ని రూపొందించినా బక్రీద్ పేరుతొ నిరాటంకంగా గోహత్య జరుగుతుందని ప్రభుత్వ వ్యవస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని, దేశ ఆర్దికాభివృద్ధికి , భారత సంస్కృతికి ప్రతీకైన గో మాత ను రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు 
ప్రసంగిస్తున్న శ్రీ జి దుర్గయ్య గారు

ప్రాంత కార్యదర్శి శ్రీ జి దుర్గయ్య గారి ఆద్వర్యంలో ఆయా జిల్లాల కార్యదర్శులు తమ తమ జిల్లా నివేదికలను వివరించారు. ప్రాంత సమావేశాలలో  అనేక తీర్మానాలపై చర్చ జరిగింది
పాల్గొన్న ఆయా జిల్లాల అద్యక్ష కార్యదర్శులు ఆయం ప్రముఖులు

Monday, 16 January 2012

పశ్చిమ గోదావరి పేరంపేట లో 53 మంది హిందుత్వంలోకి పునరాగమనం

యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం
పేరంపేట , పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి మండలము లోని పోరంపేట గ్రామములో క్రైస్తవ మతంలోని మారిన 53 మంది తిరిగి తమ స్వధర్మమైన హిందుత్వాన్ని
తేది 04/01/2012 నాడు యజ్ఞ కార్యక్రమం ద్వారా  స్వీకరించారు . 
 ఈ కార్యక్రమంలో పెరంపేట గ్రామంలోని సుమారు 2500 మంది హాజరై తమ సహోదరులను స్వధర్మంలోనికి ఆవ్హనించారు. పూజ్య శివ స్వామీ , పూజ్య శ్రద్ధానంద భారతి స్వామీ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ రాముడి నుండి దూరమైనా మన సహోదరులను రాముని దగ్గరకు తీసుకొచ్చే కార్యం కంటే గొప్ప కార్యం మారేది లేదని అంటూ హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని సమగ్గ్రంగా వివరించారు.
మార్గదర్శనం చేస్తున్నపూజ్య స్వామిజీ లు
 యజ్ఞ అనంతరం అందరు కలసి  సాముహిక భోజనం చేయడం జరిగింది , పునరాగమనం చెందినా కుటుంబాల వారు తమ తోటి సహోదరులు చూపిన ఈ ఆత్మీయత కు కృతఙ్ఞతలు తెలుపుతూ తమల మరెవరు క్రైస్తవ మిషనరిల మాయ వలలో పడకుండా జాగ్రత్త పడతామని దానికోసం తమ అనుభవాలను అందరితో పంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పూజ్య శివ స్వామీ , శ్రీ శ్రీ శ్రీ పూజ్య శ్రద్ధానంద భారతి స్వామీ, శ్రీ హన్మంత్ రావ్ పూర్వ ఆంద్ర కార్యదర్శి - విశ్వహిందు పరిషద్ మరియు అనేక పరిషద్  పెద్దలు పాల్గొన్నారు  

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style