అయోధ్యలో రామమందిరాన్ని 2014లో నిర్మించి తీరుతామని, ఈ అంశంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కితగ్గే ప్రసక్తి లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంరక్షకులు అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు. మత హింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయన శనివారం హైదరాబాద్‌లో
విహెచ్‌పి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిలో ముష్కరులు బాంబుదాడులకు పాల్పడిన సందర్భంలో కన్నీటి బొట్టు రాల్చని సోనియాగాంధీ బాట్లా ఎన్‌కౌంటర్ మృతుల పట్ల సానుభూతి ప్రకటించడం
విహెచ్‌పి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిలో ముష్కరులు బాంబుదాడులకు పాల్పడిన సందర్భంలో కన్నీటి బొట్టు రాల్చని సోనియాగాంధీ బాట్లా ఎన్‌కౌంటర్ మృతుల పట్ల సానుభూతి ప్రకటించడం
జాతికి చేస్తున్న ద్రోహంగా అభివర్ణించారు. ఈ విధంగా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ దేశంలో పెరుగుతున్న మత విద్వేషాలకు సోనియా కారణభూతురాలిగా మారుతున్నారని అన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి ప్రతిపాదించిన మతహింస నిరోధక బిల్లు కేవలం హిందువులను బలిపశువులను చేయడానికేనని, అందుకే తాము మొదటి నుంచీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలోని సాధువులనంతా ఒక్కతాటిపైకి తెచ్చి ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేలా ఏప్రిల్‌లో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఇటీవలి కాలంలో మతమార్పిడులు పెరగడం ఆందోళన కలిగిస్తున్న పరిణామమని, దీని వెనుక ప్రభుత్వ సాయం ఉందేమోనంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని, హిందూ మతం ప్రాశస్త్యం తెలుసుకుని ఆ మతస్తులుగా పుట్టినందుకు గర్వించాలే తప్ప ప్రలోభాలకు తలొగ్గి మతమార్పిడి చేసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. యువతంతా వేలంవెర్రిలా వ్యాలెంటైన్ డే జరుపుకోవడం మన సంస్కృతీ, సంప్రదాయాలకు తీరని ద్రోహం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు రంగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, పౌరసంబంధాల ప్రతినిధి వెంకటేశ్వర్రాజు, సమన్వయకర్త ఆకారపు కేశవరాజు తదితరులు పాల్గొన్నారు.
చినజీయర్‌తో సింఘాల్ భేటీ
అశోక్ సింఘాల్ తన పర్యటనలో భాగంగా పలువురు స్వామీజీలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని అపురూప వేంకటేశ్వరాలయాన్ని సందర్శించి అక్కడ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ మతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, తిరుమల వివాదం గురించి, మతహింస నిరోధక బిల్లు గురించి వీరిరువురి నడుమ చర్చ కొనసాగినట్లు తెలిసిం

No comments:
Post a Comment