Our amazing new site will launch in

Sunday, 18 August 2013

Press Release : ఉద్యమాల పేరిట తిరుమల భక్తులను అడ్డుకోవడం శోచనీయం - శ్రీ రామ రాజు ప్రాంత అద్యక్షులు

పత్రిక ప్రకటన 
విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్ 

ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు చేయడం , ఉద్యమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి హక్కు అయిన్నప్పటికి గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి వద్ద చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తె హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నాయి .
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల్ శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి ప్రతినిత్యం దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచా వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్షలాదిగా వస్తుంటారు , వారందరినీ సేవ చేసే భాగ్యాన్ని ఆ స్వామివారు తిరుమల తిరుపతి వాసులకు కలిపించిన విషయాన్ని ఆందోళనకారులు గుర్తించాలని కోరుతున్నాం .
పుణ్య క్షేత్రాలను ఆందోళన పరిది నుండి మినహాహించాలని , రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలను వెంటనే తీసుకోవాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది . ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీల నేతలు , వివిధ సంఘాల ప్రతినిధులు కుడా పుణ్య క్షేత్రాల వద్ద ఆందోళనలు నిర్వహించకుండా తమ శ్రేనుకలు పిలుపునిచ్చి హిందువుల మనోభావాలు గాయపడకుండా వ్యవహరించాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది . 
ఆందోళన కారుల ముసుగులో కొన్ని హిందు వ్యతిరేక శక్తులు , సంస్థలు కుడా తిరుమల భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ తిరుమల తిరుపతి పవిత్రతను దేబ్బదియడానికి ప్రయత్నం చేతున్నారు , వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకుని తిరుమల్ తిరుపతి పవిత్రతను కాపాడాలని , లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సివస్తుందని హేచ్చారిస్తున్నాము .
భవదీయ       

రామ రాజు        
ప్రాంత అధ్యక్షులు 


Monday, 5 August 2013

పశ్చిమాంద్ర ప్రాంత వర్షారంభ సమావేశాలు - హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి

దిల్ శుక్ నగర్ , భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ పశ్చిమ ఆంద్ర ప్రదేశ్ ప్రాంత వర్షారంభ సమావేశాలు తేది 3 , 4 ఆగస్టు 2013 లలో భాగ్యనగర్ లోని  దిల్ శుక్ నగర్ శ్రీ పుల్లారెడ్డి స్మారకోన్నత పాఠశాలలో జరిగాయి , ఈ సమావేశాలకు జిల్లా స్థాయి మరియు ఆ పై స్థాయి అధికారాలు హాజరయ్యారు , మాన్య శ్రీ గోపాల్ జి  దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి రెండు రోజులు పూర్తిగా ఉండి మార్గదర్శనం చేసారు , సమారొహ్ లో మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మార్గదర్శనం చేసారు.
అదికాధిక సమయం ఇవ్వడం ద్వారా మన లక్ష్యాలను సాధిద్దాం : మాన్య  శ్రీ గోపాల్ జి 
మాన్య శ్రీ  గోపాల్ జి సమావేశాల ఉద్గాటన కార్యక్రమంలో స్వర్ణ జయంతి లక్ష్యాల ముఖ చిత్రాన్ని  ఆహుతుల ముందు ఉంచుతూ " మనం వచ్చే సంవత్సరం స్వర్ణ జయంతి లోకి అడుగు పెట్టబోతున్నాం ఎందఱో త్యాగ ధనుల ధ్యాగల పునాదుల మీద నేడు పరిషద్ ప్రపంచంలోనే అది పెద్ద మరియు  అత్యదిక దేశాలలో ఉన్న సంఘటన గా రూపాంతరం చెందిది , వారి త్యాగ ఫలాలను నేడు  హిందు సమాజం అనుభవిస్తూ ఉంది , ఈ రోజున హిందువులు తమ తమ పండుగులను, ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అంటే అది మన జేష్ఠ కార్యకర్తల నిరాడంబర , త్యాగమయ జీవన ఫలితమే . ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం పరమ పూజ్య గురూజీ స్వప్నం హిందుత్వ జీవనం ఆధారంగా మన తల్లి భారతంబ పునర్వైభవ సాధన కై మళ్ళి ఒకసారి అంకితం కావాల్సిన సమయం వొచ్చింది . స్వామీ వివేకుడు అన్న ఆట్టాడుగు వాని ఇంటిలో భారతమాత ఉదయించాలి , మనం ప్రతి పల్లెకు చేరాలి  ప్రతి గుండెని కదిలించాలి , కేవలం హిందుత్వ జీవిన విధాన గొప్పతనం తెలియకనే మన వారు ప్రక్క చూపులు చూస్తున్నారు , నేడు ఈ దేశం ఎదుర్కుంటున్న అనేక సమశ్యలు పరిష్కారం కేవలం మనమే , దాని కోసం అధికాధిక సమయం ఇచ్చి పనిచేయాల్సిన ఆవసరం ఉంది , స్వర్ణ జయంతి లో పని చేసే అవకాశం రావడం మన పూర్వ జన్మ సుకృతం అని భావించాల్సిన ఆవసరం ఉంది ఈ సమయంలో ఒక సంవత్సరం పాటు దేశం కోసం , ధర్మం కోసం పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలు ధన్య జీవులవుతారు " అంటూ వారిచ్చిన మార్గదర్శనం తో అందరి హృదయాలలో విశ్వ గురువు భారత మాత రూపం కదలాదిడింది .

ప్రాంత స్థాయిలో జరిగిన కార్యక్రమాల సమీక్షా - లక్ష్యాల నిర్ణయం   
మాన్య శ్రీ కేశవా రాజు gaar
మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత అధ్యక్షులు ) గారి అధ్యక్షతన జరిగిన సమీక్ష ను మాన్య గాళ్ రెడ్డి ప్రాంత కార్యదర్శి గారు నిర్వహించారు , గత సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు వాటి అనువర్తి పై సుదీర్గంగా సమీక్ష జరిగింది అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు మరియు లక్ష్యాల ప్రతులను ప్రాంత కార్యదర్శి గారికి అందించడం జరిగింది , మాన్య కేశవరాజు గారు సంఘటన నిర్మాణ విషయమై జిల్లా కార్యదర్శులకు సూచనలు ఇస్తూ కార్యక్షేత్రం లో జరిగిన అనుభవాలను వివరించడం జరిగింది. మన ప్రాంత స్థాయిలో తర్వాత ప్రాంత స్థాయి నివేదికతో సమీక్షా సమావేశం ముగిసింది . 


హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి : మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి అంతర్జాతీయ అధ్యక్షులు 
మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు 
సమావేశాల సమారోహ కార్యక్రమానికి హాజరైన విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు తనదైన శైలిలో ప్రసంగిస్తూ " ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో బిల్లు పెట్టి చట్టం చేయడం ద్వారా అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణానికి మార్గ సుగుమం చేయాలి లేని యడల  గౌహతి అస్సాం కేంద్రంగా జరిగిన పరిషద్ కేంద్రీయ ప్రబంధ సమితి బైటక్ లో నిర్ణయించిన ప్రకారం అయోధ్య శ్రీ రామ జన్మభుమిలో భవ్య మందిర నిర్మానర్థమై పరిషద్ మళ్ళి బృహత్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతున్నది , దానికి దేశం లోని ప్రముఖ సాదు సంతులు న్యాయకత్వం వహించబోతున్నారు , దానిలో భాగంగానే దేశం లోని అన్ని ప్రాంతాల నుండి అయోధ్య పరిక్రమ యాత్ర జరుగబోతున్నది దీనిలో హిందు సమాజాన్ని రామ భక్తులను పూర్తీ స్థాయిలో పాల్గొనే విధంగా కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకుని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను , నేడు ప్రపంచంలోని అన్ని మతాలూ తమ మతమే ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటూ ఆ దిశలో తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు వారందరి లక్ష్యం కేవలం హిందు సమాజం , ఈ హిందు దేశం అన్న విషయం మనదరికి అవగతమే కాబట్టి హిందు సమాజం లో విశుగీషు ప్రవృత్తిని నిర్మాణం చేయాలి ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం దేశంలో ఒక గొప్ప మార్పును తేబోతున్నాం సంఘటిత హైందవ శక్తి ముందు ముష్కర మూకల ఆటలు ఇంకేతో కాలం సాగలేవు , దానిని సాధించడం కోసం అత్యధిక సంఖ్యలో పుర్ణకాలిన , వానప్రస్తి కార్యకర్తలు అవసరం ఉన్నది దేశ మాత తన కోసం పనిచేసే ప్రియ పుత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ సౌభాగ్యాన్ని ఎవరు విడిచి పెట్టొద్దు.  జై శ్రీ రాం " అని అన్నారు .       


 పాల్గొన్న ప్రతినిధులు 



  
           

Saturday, 27 July 2013

గౌహతి , అస్సాం : విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు - భవ్య రామ మందిర నిర్మానార్థమై తీర్మానం

26 & 27 జులై , గౌహతి , అస్సాం : విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు జులై 26,27 తేదిలలో అస్సాం రాష్ట్రం గౌహతిలోని హరియాన భవన్ , నారాయణ నగర్ లో జరిగాయి , ఈ సమావేశాలలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులను అస్సాం ప్రాంత పద్దతిలో తిలక దారణ చేసి ఆహ్వానించడం జరిగింది .
లక్ష్య సాధనలో పునరంకితం అవుదాం : మాన్య  శ్రీ ఆశోక్ సింఘాల్
వేదిక పై మార్గదర్శనం చేస్తున్న పెద్దలు 
ఈ సమావేశాలు విశ్వ హిందు పరిషద్ మార్గదర్శకులు , సంరక్షకులు అయిన మాన్య శ్రీ అశోక్ సింఘాల్ గారి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమయునాయి, అనంతరం శ్రీ అశోక్ సింఘాల్ గారు తన సమ్మోహిత వక్తృత్వం తో మార్గదర్శనం చేస్తూ విశ్వ హిందు పరిషద్ ఒక సమర్థ సంఘటన గా ఎదిగి తన ఉద్యేశాల , లక్ష్యాల పట్ల సమర్పణ భావంతో పని చేస్తూఉంది , ఏ లక్ష్య సాధనకై పరిషద్ ప్రారంబించబడినదో ఆ పనిలో ఆ సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుడు మనకు కావల్సినంత శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తూ హిందు సంఘటన లక్ష్య సాధనలో పునరంకితం అవుదామని అన్నారు .   
తడననతరం స్వాగత సమితి అధ్యక్షులు ప్రఖ్యాత నేత్ర వైద్యులు అయిన శ్రీ తరణికాంత శర్మ గారు స్వాగతోపన్యాసం లో మాట్లాడుతూ "జగత్ జనని అయిన కామాక్షి మాత స్వస్థలానికి స్వాగతం , ఈ అస్సాం  సాక్షాత్తు ఆ చతుర్ముఖ బ్రహ్మ చే రచించబదినది , చరిత్రలో  ముష్కరమూకలు అనేక సార్లు దండయాత్ర చేసినప్పటికీ అస్సాంని జయించడంలో విఫలమయ్యారు  అస్సాం యుగ యుగాలనుండి హిందు రాష్ట్రమయిన భారత్ లో అంతర్భాగంగానే ఉంది ఉంటుంది కుడా , మేము పవిత్ర గంగా నది ప్రవహిస్తున్న దేశ వాసులమైనందుకు గర్విస్తున్నాం , ' కాశ్మీర్ అయిన కన్య కుమారి అయిన  నాగాలాండ్ అయిన అటక్ అయిన మనది ఒకే రక్తం , మనమందరం ఆ జగద్గురు భారతంబ సంతానం ' జై శ్రీ రాం " అని ముగించారు .
పరశురాముని తపస్థాలిలో ఈ భైటక్ జరగటం మన సుకృతం : మాన్య ప్రవీణ్ తొగాడియా 
 కేంద్రీయ ప్రబంద సమితి సమావేశాల కోసం చాలా మంచి ఏర్పాట్లు చేసిన అస్సాం క్షేత్ర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ మాన్య శ్రీ ప్రవీణ్ తొగాడియ పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మార్గదర్శనం చేస్తూ " పరశురాముని తపస్తలి మరియు శక్తి పీటం అయిన ఈ స్థలంలో ఈ సమావేశాలు జరగడం మన పూర్వ జన్మ సుకృతం , మన దేశం లో మొగలాయిల పాలనలో లేని  ఏదైనా ఒక ప్రాంతం ఉందీ అంటే అది కేవలం పరాక్రమమయిన అస్సాం మాత్రమె , అస్సాం 'లాచిత్ బడ్పుకాన్' వంటి అనేక మంది ధర్మాత్ములైన  వీర దేశ భక్తులతో నిండి ఉంది విశ్వ హిందు పరిషద్ అలాంటి పరాక్రమానికి ప్రతిక . 2014 విశ్వ హిందు పరిషద్ స్వర్ణ జయంతి జరుపుకొబోతుంది మనం మరింత బలంగా తయారవ్వాలి దానితో అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణం తధ్యం దాన్ని ఆపడం ఎవరి తరం కాదు , కాని రామ రాజ్య స్థాపన కై మనం తన మన ధన పూర్వకంగా సమర్పితమయ్యే సమయం ఆసన్నమయినది జై శ్రీ రాం " అని అన్నారు.
అయోధ్య లో భవ్య రామ మందిర నిర్మానార్థమై తీర్మానం ;
హాజరైన ప్రతినిధులు 
ఈ సమావేశాలలో శ్రీ రామ జన్మ భూమి లో భవ్య రామ మందిర నిర్మానార్థం తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంలో పరిషద్ అంతర్జాతీయ మహా మంత్రి మాన్య శ్రీ చంపత్ రాయి గారు ప్రయాగ కుంభ మేళ లో దేశంలోని అన్ని ప్రాంతాల సాధు సంతుల ద్వారా మరియు జూన్ నెలలో జరిగిన కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశాలో శ్రీ రామ జన్మ భూమి మందిర విషయంలో తీసుకున్న నిర్ణయాలు తదుపరి కార్యాచరణ ప్రణాళిక పై వివరనత్మకంగా , విస్తారంగా మాట్లాడుతూ " అయోధ్య లో ప్రస్తుతం మర్యాద పురుషోత్తముడు శ్రీ రాంలలా విగ్రహం ఉన్న చోటనే భవ్య రామ మందిరం నిర్మాణం అయి తీరుతుంది , అయోధ్య యొక్క సరిహద్దు లో ఎలాంటి విధర్మీయ పార్థనా స్థలం గాని మరెలాంటి స్మారక నిర్మాణం కాని జరగదు అలాగే దురాక్రమణ దారుడైన బాబరు పేరుతొ పూర్తీ భారత దేశం లో ఎలాంటి స్మారక నిర్మాణానికి అంగీకరించేది లేదు , అలాగే దేశం లోని ప్రముఖ సాదు సంతులు రాబోయే వర్ష కాల పార్లమెంట్ సమావేశాలలో అయోధ్య లో భవ్య రామ మందిర నిర్మాణానికి చట్టం చేయడం ద్వారా మార్గం సుగుమం చేయాలని లేని యెడల దేశ వ్యాప్త ప్రజా ఆందోళనలకు సాదు సంతులంతా నాయకత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వానికి" హెచ్చరిక చేసారు , ఈ పరిస్థితుల దృష్ట్యా పరిషత్ భవిష్యత్ కార్యచరణ ను వెల్లడించారు , దీనిలో భాగంగా 20 రోజులు , పాటు దేశం లోని ప్రముఖ సంతుల ఆధ్వర్యంలో అయోధ్య కు పాదయాత్ర యోజన చేయబడినది , ఈ యాత్ర ఆగస్ట్ 25 న ప్రారంభమై 13 సెప్టెంబర్ న ముగుస్తుంది , అలాగే దక్షిణ భారత దేశం లో 22 సెప్టెంబర్ న ప్రారంభమై 13 అక్టోబర్ తో ముగుస్తుంది . ఆగస్టు 18 న దేశ వ్యాప్తంగా అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ సంకల్ప దినోత్సవం నిర్వహించబడుతుంది , ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయ పిలుపునిచ్చారు . 
ఈ సమావేశాలలో  మొత్తం 4 తీర్మానాలు ఆమోదించారు :  

  1. శ్రీ రామ జన్మ భూమి 
  2. అస్సాం 
  3. చైనా దురక్రమణ
  4.  ఉత్తరఖండ్ విలయం  



       

_____________________________________________________________________

విశ్వ హిందు పరిషద్ , కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు  26 – 27 జులై 2013
హరియన భవన్ , నారాయణ నగర్ , కుమార్పద , గౌహతి అస్సాం  
_____________________
తీర్మానము – 2 
విషయము : అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణం
ప్రవేశపెట్టిన వారు : పూజ్య స్వామీ చిన్మయనంద్ సరస్వతి జి మహారాజ్ , హరిద్వార్
ప్రయాగ కుంభ మేళ 2013 లో నిర్వహించబడిన విశ్వ హిందు పరిషద్ మార్గదర్శక మండలి లోని దేశంలోని వివిధ ప్రాంతాలకి చెందిన  అందరు పూజ్య సాదు సంతుల సమావేశం లోని నిర్ణయం ప్రకారం హిందువుల పవిత్ర పుణ్య నగరం అయోధ్య లో బట్టలతో నిర్మిచంబడి ఉన్న రామ్ లలా మందిరం సాదు సంతులతో పాటు భక్తుల మనోభావాలకు విఘాతం కలిగిస్తుంది, దేశం లోని హిందువులందరూ సంకల్పిత భవ్య రామ మందిరం లో శ్రీ రాం లలా ను దర్శించాలని కోరుకుంటున్నారు , సాదు సంతుల , ప్రపంచంలోని అందరు హిందువుల అభిప్రాయాన్ని అలహాబాద్ ఉన్నత న్యాయ స్థానం యొక్క లక్నో పీటం లోని ముగ్గురు న్యాయమూర్తుల బృందం దాదాపుగా తన తీర్పు ద్వారా అంగీకరించింది ఆ తీర్పులో
1.       వివాద భూమి శ్రీ రాముని జన్మ స్థలమే , జన్మ భూమి స్వయంగా దేవ స్వరూపమే .
2.       వివాదాస్పద కట్టడం ఎదో ఒక హిందు ధార్మిక స్థలం పైననే నిర్మించబడినది .
3.       వివాదాస్పద కట్టడం ఇస్లాం మూల సూత్రాలకు విరుద్ధం గా నిర్మించబడినది, కాబట్టి దానిని మస్జిద్ గా పరిగనిచంలేము .
ఇస్లాం అనునాయుల ద్వారా న్యాయస్థానం లో  వేయనడిన దావాను ఉన్నత న్యాయముర్థుల బృందం రద్దు చేయడం ద్వారా,  శ్రీ రామ పరమాత్ముడే అయోధ్య లోని 70 ( డెబ్బయి ) ఎకరాల భూమికి నిజమైన యజమాని అని స్పష్టం చేయడం జరిగింది మార్గదర్శన్ మండలి నిర్ణయనుసారముగా దేశం లోని ప్రముఖ సాదు సంతుల బృందం ఒకటి మాననీయ భారత రాష్ట్రపతి గారిని కలసి ఒక విజ్ఞపన పత్రాన్ని సమర్పించింది  “ బారత ప్రభుత్వ అటార్నీ జనరల్ తేది 14 సెప్టెంబర్ 1994 లో ఉన్నత న్యాయాలయంలో ఒక ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తూ  “ఒక వేలా వివాదాస్పద స్థలంలో మందిరం లేదా హిందు ఆరాధన స్థలం గనక ఉన్నట్లయితే , ప్రభుత్వ కార్యాచరణ  హిందువుల మనో భావాలకు అనుసారంగానే ఉంటుంది “ అని అన్నారు , ఉన్నత న్యాయాలయ తీర్పు అనంతరం 70 ఎకరాల వివాదాస్పద భూమిని భవ్య మందిర నిర్మానర్తమై పార్లమెంటు లో చట్టం చేయడం ద్వారా హిందు సమాజానికి అందిచడం ప్రభుత్వ బాధ్యత .
అయోధ్యా నగర పరిధిలోని 84 ఎకరాలు హిందూ సమాజ పుణ్య క్షేత్రం అని మార్గదర్శాక్ మండలి ప్రకటిస్తుంది , ఈ పూర్తీ విస్తీర్ణాన్ని హిందు సమాజం పరమ పవిత్రంగా భావిస్తుంది ఈ పూర్తీ విస్తీర్ణం లో ఎ రకమైన విధర్మియ ఇస్లాం కట్టడాలను హిందు సమాజం  స్వీకరించదు , ఆ స్థలంలో ఏదైనా ఇస్లాం కట్టడం గనక నిర్మితమయితే అది దురక్రమదారు బాబరు పేరుతొ విశ్వసించబడుతుంది , ఈ కారణంగా హిందు – ముస్లీం ల వివాదం సద్దుమనగదు.
న్యాయస్థాన పరమయిన కార్యాచరణ చాలా సమయాభావముతో కూడుకుని ఉంది , కాని హిందు సమాజం శిగ్రాతిశిగ్రముగా రాం లలా ను భవ్య మందిరంలో పుజించాలనుకొంటుంది , భారత కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో చట్టం చేయడం ద్వారా మందిర నిర్మాణ ప్రక్రియలో ఉన్న ప్రభుత్వ మరియు న్యాయ పరమయిన అడ్డంకులను తొలగించాలని కేంద్రీయ మార్గదర్శన్ మండలి డిమాండ్ చేస్తుంది , ప్రభుత్వం ఈ పనిలో విఫలమైతే తదనంతరం హిందు సమాజం ద్వారా జరిగే ఆందోళనలకు ప్రభుత్వమే బాధ్యతా వహించాల్సి ఉంటుంది .

11 – 12 జూన్ 2013 న హరిద్వార్ లో జరిగిన కేంద్రీయ మార్గాదర్శాక్ మండలి సమావేశం లో శ్రీ రామ జన్మ భూమి తీర్మానాన్ని వి.హి.ప కేంద్రీయ ప్రభంద సమితి యదతదంగా ఆమోదిస్తున్నది .       
     

విశ్వ హిందు - Aug - 2013

(or)
Download as pdf format



Tuesday, 25 June 2013

ప్రకృతి విలయం కాదు..మానవ తప్పిదమే. - శ్రీ ఆకారపు కేశవరాజు


ఆదోని రూరల్ : ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మమల్ని కాపాడు తుందని, ప్రళయానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని వీహెచ్ పీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి ఆకరపు కేశవరాజు పేర్కొన్నారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే వరదలు తీవ్ర రూపం దాల్చి ఉత్తరాఖండ్‌లో వేలాది మంది మృత్యువాత పడ్డారన్నారు. వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు 2 వేల మంది ప్రమాద స్థలానికి చేరుకున్నారన్నారు. రుషికేష్, హరిద్వార్, కొట్టుద్వార్, హర దోన్‌లలో వేలాది మందికి వసతి, భో జన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. మరో 2 వేల మందిని కూడా రక్షించిన ట్లు పేర్కొన్నారు. వైద్య సహాయం కో సం నాలుగు వైద్య బృందాలు శివనా రాయణసింగ్ ఆధ్వర్యంలో సేవా కా ర్యక్రమాలు ప్రారంభించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మందులు, ఆహార పదార్థాలు సంఘటనా స్థలానికి చేరు కొని బాధితులకు అందిస్తున్నామన్నా రు.



హిమాలయాల్లో విద్యుత్ తయారీ అనుమతులు ఇవ్వడం, కొండలపైన ప్రాజెక్టులు కట్టడంవల్ల ఈ జల ప్రళ యం వచ్చిందని, దీనికి ప్రభుత్వ విధా నాలే కారణమని ఆయన ఆరోపించా రు. ప్రకృతి విపత్తులను గుర్తించేందు కు ప్రభుత్వం నియమించిన బృందం హిమాలయ కొండల్లో విద్యుత్‌శక్తి ప్రా జెక్టులు ఏర్పాటు చేస్తే నష్టం సంభవి స్తుందని 2001లో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలకు నివేదికలు సమర్పించినా ప్ర భుత్వాలు పెడ చెవిన పెట్టాయని ఆరో పించారు. 200 విద్యుత్ తయారీ కేంద్రాలు ఉన్నాయని, మరో 70 ప్రాజెక్టు లకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైందన్నారు. దీని వల్ల గంగానది ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అ న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేదార్ నాథ్‌కు వెళ్లిన తెలుగు భక్తులకు సహా యక చర్యలు అందించడంలో ఘోరం గా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో భజరంగ్‌దళ్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్్, నగర అధ్యక్షుడు బసవన్నగౌడ్, నగర కోశాధికారి భద్రి నారాయణప్ప, నగర సహ కార్యదర్శి దేవేంద్ర, భజరంగదళ్ నగర ప్రముఖ్ నాగరాజుగౌడ్, నగరసహా ప్రముఖ్ విజయకృష్ణ, రాష్ట్ర విభాగ్ కార్యదర్శి రామదాసు పాల్గొన్నారు.
 

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style