దిల్ శుక్ నగర్ , భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ పశ్చిమ ఆంద్ర ప్రదేశ్ ప్రాంత వర్షారంభ సమావేశాలు తేది 3 , 4 ఆగస్టు 2013 లలో భాగ్యనగర్ లోని దిల్ శుక్ నగర్ శ్రీ పుల్లారెడ్డి స్మారకోన్నత పాఠశాలలో జరిగాయి , ఈ సమావేశాలకు జిల్లా స్థాయి మరియు ఆ పై స్థాయి అధికారాలు హాజరయ్యారు , మాన్య శ్రీ గోపాల్ జి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి రెండు రోజులు పూర్తిగా ఉండి మార్గదర్శనం చేసారు , సమారొహ్ లో మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మార్గదర్శనం చేసారు.
అదికాధిక సమయం ఇవ్వడం ద్వారా మన లక్ష్యాలను సాధిద్దాం : మాన్య శ్రీ గోపాల్ జి
మాన్య శ్రీ గోపాల్ జి సమావేశాల ఉద్గాటన కార్యక్రమంలో స్వర్ణ జయంతి లక్ష్యాల ముఖ చిత్రాన్ని ఆహుతుల ముందు ఉంచుతూ " మనం వచ్చే సంవత్సరం స్వర్ణ జయంతి లోకి అడుగు పెట్టబోతున్నాం ఎందఱో త్యాగ ధనుల ధ్యాగల పునాదుల మీద నేడు పరిషద్ ప్రపంచంలోనే అది పెద్ద మరియు అత్యదిక దేశాలలో ఉన్న సంఘటన గా రూపాంతరం చెందిది , వారి త్యాగ ఫలాలను నేడు హిందు సమాజం అనుభవిస్తూ ఉంది , ఈ రోజున హిందువులు తమ తమ పండుగులను, ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అంటే అది మన జేష్ఠ కార్యకర్తల నిరాడంబర , త్యాగమయ జీవన ఫలితమే . ఈ స్వర్ణ జయంతి సంవత్సరంలో మనం పరమ పూజ్య గురూజీ స్వప్నం హిందుత్వ జీవనం ఆధారంగా మన తల్లి భారతంబ పునర్వైభవ సాధన కై మళ్ళి ఒకసారి అంకితం కావాల్సిన సమయం వొచ్చింది . స్వామీ వివేకుడు అన్న ఆట్టాడుగు వాని ఇంటిలో భారతమాత ఉదయించాలి , మనం ప్రతి పల్లెకు చేరాలి ప్రతి గుండెని కదిలించాలి , కేవలం హిందుత్వ జీవిన విధాన గొప్పతనం తెలియకనే మన వారు ప్రక్క చూపులు చూస్తున్నారు , నేడు ఈ దేశం ఎదుర్కుంటున్న అనేక సమశ్యలు పరిష్కారం కేవలం మనమే , దాని కోసం అధికాధిక సమయం ఇచ్చి పనిచేయాల్సిన ఆవసరం ఉంది , స్వర్ణ జయంతి లో పని చేసే అవకాశం రావడం మన పూర్వ జన్మ సుకృతం అని భావించాల్సిన ఆవసరం ఉంది ఈ సమయంలో ఒక సంవత్సరం పాటు దేశం కోసం , ధర్మం కోసం పూర్తీ సమయం ఇచ్చే కార్యకర్తలు ధన్య జీవులవుతారు " అంటూ వారిచ్చిన మార్గదర్శనం తో అందరి హృదయాలలో విశ్వ గురువు భారత మాత రూపం కదలాదిడింది .
ప్రాంత స్థాయిలో జరిగిన కార్యక్రమాల సమీక్షా - లక్ష్యాల నిర్ణయం
మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత అధ్యక్షులు ) గారి అధ్యక్షతన జరిగిన సమీక్ష ను మాన్య గాళ్ రెడ్డి ప్రాంత కార్యదర్శి గారు నిర్వహించారు , గత సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు వాటి అనువర్తి పై సుదీర్గంగా సమీక్ష జరిగింది అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు మరియు లక్ష్యాల ప్రతులను ప్రాంత కార్యదర్శి గారికి అందించడం జరిగింది , మాన్య కేశవరాజు గారు సంఘటన నిర్మాణ విషయమై జిల్లా కార్యదర్శులకు సూచనలు ఇస్తూ కార్యక్షేత్రం లో జరిగిన అనుభవాలను వివరించడం జరిగింది. మన ప్రాంత స్థాయిలో తర్వాత ప్రాంత స్థాయి నివేదికతో సమీక్షా సమావేశం ముగిసింది .
హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి : మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి అంతర్జాతీయ అధ్యక్షులు
![]() |
| మాన్య శ్రీ కేశవా రాజు gaar |
హిందూ సమాజం లో విశుగీషు ప్రవృత్తి నిర్మాణం కావాలి : మాన్య శ్రీ రాఘవ రెడ్డి జి అంతర్జాతీయ అధ్యక్షులు
![]() |
| మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు |
![]() |
| పాల్గొన్న ప్రతినిధులు |





No comments:
Post a Comment