పత్రిక ప్రకటన
విశ్వ హిందు పరిషద్ - ఆంద్ర ప్రదేశ్
ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు చేయడం , ఉద్యమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి హక్కు అయిన్నప్పటికి గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి వద్ద చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తె హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ఉన్నాయి .
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల్ శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి ప్రతినిత్యం దేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచా వ్యాప్తంగా ఉన్న హిందువులు లక్షలాదిగా వస్తుంటారు , వారందరినీ సేవ చేసే భాగ్యాన్ని ఆ స్వామివారు తిరుమల తిరుపతి వాసులకు కలిపించిన విషయాన్ని ఆందోళనకారులు గుర్తించాలని కోరుతున్నాం .
పుణ్య క్షేత్రాలను ఆందోళన పరిది నుండి మినహాహించాలని , రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలను వెంటనే తీసుకోవాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది . ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీల నేతలు , వివిధ సంఘాల ప్రతినిధులు కుడా పుణ్య క్షేత్రాల వద్ద ఆందోళనలు నిర్వహించకుండా తమ శ్రేనుకలు పిలుపునిచ్చి హిందువుల మనోభావాలు గాయపడకుండా వ్యవహరించాలని విశ్వ హిందు పరిషద్ కోరుతుంది .
ఆందోళన కారుల ముసుగులో కొన్ని హిందు వ్యతిరేక శక్తులు , సంస్థలు కుడా తిరుమల భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ తిరుమల తిరుపతి పవిత్రతను దేబ్బదియడానికి ప్రయత్నం చేతున్నారు , వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకుని తిరుమల్ తిరుపతి పవిత్రతను కాపాడాలని , లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సివస్తుందని హేచ్చారిస్తున్నాము .
భవదీయ
రామ రాజు
ప్రాంత అధ్యక్షులు

No comments:
Post a Comment