Our amazing new site will launch in

Sunday, 20 October 2013

అం.ప్ర లో 2500 స్థానాలలో 3.5 లక్షల మందితో విహిప అయోధ్య రామ మందిర సంకల్ప సభలు

విజయ శ్రీ భవనం , భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశాలలో నిర్ణయించబడిన కార్యకరమాలలో భాగంగా తేది 18/10/2013 నాడు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని " శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణ సంకల్ప సభలు " దేశ వ్యాప్తంగా లక్ష స్థానాలలో నిర్వహించాబడ్డాయి, అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేష్ లోని ( పూర్వ ఆంధ్ర ప్రదేష్ , పశ్చిమ ఆంద్ర ప్రదేష్ ) రెండు ప్రాంతాలలో కలిపి సుమారు 2500 స్థానాలో ఈ సంకల్ప సభలు  నిర్వహించబడ్డాయి , ఈ సభలలో సుమారు మూడు లక్షల యాభై వేల మంది రామ భక్తులు అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య మందిర నిర్మానార్థమై సంకల్పం తీసుకున్నారు .   
అయోధ్యలో శ్రీ రామ్ లలా ఇక ముందు చిన్న డేరా ఉండటం హిందూ సమాజం సహించజాలదు , తరతరాల నుండి ఏ మర్యాదా పురుషోత్తముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశం నడిచిందో ఆ శ్రీ రామునికి భవ్య మందిరం నిర్మాణం జరిగి ఈ దేశ స్వాభిమానం సగర్వంగా నిలిచే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది 
- శ్రీ మాధవ రెడ్డి గారి గాల్ రెడ్డి విహిప పశ్చిమాంధ్ర కార్యదర్శి  
అయోధ్య శ్రీ రామ జన్మ భూమి లో భవ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాలలో తక్షణం చట్టం చేయడం ద్వార మార్గం సుగుమం చేయాలి , లేకపోతే 2014 ఎన్నికలలో శ్రీ రామ భక్తులు ఓటు హక్కు నే ఆయుధంగా చేసుకుని తమ శక్తి ప్రదర్శన చేయాల్సి వస్తుంది
- శ్రీ హన్మంత్ రావు విహిప పూర్వాంధ్ర కార్యదర్శి

Saturday, 19 October 2013

సాకారం కాని స్వప్నం విడియో : బాబరు దురాక్రమణ నుండి బాబ్రీ విధ్వంసం వరకు శ్రీ రామ జన్మభూమి ఉద్యమం పై సజ్జన భారతి డాక్యుమెంటరి


  • మీర్ బాకి అధ్వర్యంలో బాబరు దురాక్రమణ నుండి 1992 డిసెంబర్ 6 గీతా జయంతి బాబ్రీ విద్వంసం వరకు 
  • 76 యుద్ధాలు వేలాది రామ భక్తుల బలిదానాలు చివరికి  1992 కరసేవలో స్వల్ప విజయం 
  • అయిన ఇంకా సాకారం కాని భక్తుల సుందర స్వప్నం భవ్య రామ మందిర నిర్మాణం 
  • సజ్జన భారతి ప్రత్యేక డాక్యుమెంటరి శ్రీ రామ జన్మ భూమి పై పూర్తీ సమాచారం  చూడండి  


Thursday, 10 October 2013

పశ్చిమాంధ్ర లో 7 చోట్ల విజయవంతం గా పూర్తైన భజరంగ్ దళ్ ' శౌర్య ప్రశిక్షణ వర్గ ' లు

విజయ శ్రీ భవన్ , భాగ్యనగర్ : విశ్వ హిందూ పరిషద్ యువ విభాగం అయిన భజరంగ్ దళ్ కార్యకర్తల శౌర్య ప్రశిక్షణ వర్గ లు ( అంతర్గత శిక్షణ తరగతులు) తేది అక్టోబర్ 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు ఏడు స్థలాలలో విజయవంతంగా పూర్తీ అయ్యాయి 
  1. మంత్రాలయం ( కర్నూలు విభాగ్ ) : 42 మంది శిక్షార్థులు 6 గురు శిక్షకులు 4 గురు ప్రబందకులు
  2. పాలమూరు ( పాలమూరు విభాగ్ ) : 76 మంది శిక్షార్థులు 4 గురు శిక్షకులు 13 గురు ప్రబందకులు 
  3. మెదక్ (మెదక్ విభాగ్ ) : 42 మంది శిక్షార్థులు 5 గురు శిక్షకులు 6 గురు ప్రబందకులు
  4. బోధన్ ( ఇందూరు విభాగ్ ) : 84 మంది శిక్షార్థులు 6 గురు శిక్షకులు 15 గురు ప్రబందకులు
  5. గోదావరి ఖని ( కరినగరం విభాగ్ ) : 45 మంది శిక్షార్థులు 8 గురు శిక్షకులు 15 గురు ప్రబందకులు
  6. నల్గొండ ( నల్గొండ విభాగ్ ) : 34 మంది శిక్షార్థులు 3 గురు శిక్షకులు 4 గురు ప్రబందకులు
  7. భాగ్యనగర్ ( భాగ్యనగర్ విభాగ్ ) : 35 మంది శిక్షార్థులు 3 గురు శిక్షకులు 6 గురు ప్రబందకులు 
  8. పశ్చిమాంధ్ర  మొత్తం : 358 మంది శిక్షార్థులు 35 గురు శిక్షకులు 57 గురు ప్రబందకులు

ప్రాంత స్థాయి అధికారులు అన్ని వర్గలలో పర్యటించి శిక్షార్థులకు అనేక శారిరిక, మానసిక, ఆధ్యాత్మిక , సామాజిక , చారిత్రక అంశాలతో పాటుగా వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన శిక్షణను అందిచారు . 


















Tuesday, 1 October 2013

2008 స్వామి లక్ష్మణానంద హత్య కేసులో 7 క్రైస్తవులను దోషులుగా తేల్చిన కోర్టు! గురువారం శిక్షలు ఖరారు


2008 కందమాల్ లో జరిగిన హింసాఖాండను క్రైస్తవుల పై జరిగిన దాడులుగా గోబెల్స్ ప్రచారం చేసిన కుహన లౌకికవాదులు , క్రైస్తవ మేధావులారా ! నిజం ప్రపంచం ముందుకొచ్చింది , ఇప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ? మీరు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ! - రాష్ట్రచేతన  
స్వామి లక్ష్మణానంద ( పాత చిత్రం )
భువనేశ్వర్ , ఒడిస్సా , 01/10/2013 :  2008 కందమాల్ లో జరిగిన స్వామి లక్ష్మణానంద సరస్వతి మరియు  అతని నలుగురు సహాయకుల హత్య కేసులో ఏడు గురు క్రైస్తవులను దోషులుగా తెలుస్తూ ఒడిస్సా లోని న్యాయస్థానం తీర్పును వేలువడించింది .     
కందమాల్ జిల్లా న్యాయస్థాన ప్రత్యేక అదనపు న్యాయమూర్తి శ్రీ RK తొస్ గారు తన తీర్పును ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కు సుమారు 200 KM దూరంలోఉన్న ఫుల్భాని న్యాయస్థానం లో వెల్లడిస్తూ శిక్షలను అక్టోబర్ 03 ణ ఖరారు చేస్తున్నట్ల్టు తెలిపారు .
2008 లో దాదాపు 50 మందితో కూడిన జన సముహముతో స్వామి లక్ష్మణానంద ఆశ్రమము పై దాడి చేసిన వారిలో దుర్యోధన్ సున మజ్హి , సనతాన్ బడ మజ్హి , గల్నాథ్ చలన్సేత్ , బ్రిజేయ్ కుమార్ సంసీ , భాస్కర్ కుమార్ మజ్హి మరియు భుధదేవ్ నాయక్ లను న్యాయస్థానం దోషులుగా తెల్చిందని, తమని స్వామి క్రైస్తవం నుండి హిందువులుగా మారమని బలవంతం చేసినందునే హత్య చేయమని వారు కోర్టుకు తెలిపారని న్యాయవాది మీడియా కు తెలిపారు .
2009 జనవరిలో నిందుతులపై పోలీసులు తోలి అభియోగా పత్రాన్ని నమోదు చేసారు , 2011 లో మరో ఇద్దరు మావోయిస్టు నాయకులు పొలారి రామా రావు , సవ్యసాచి పండా లను నిందితులగా చేరుస్తూ రెండో చార్జ్ షీట్ ను నమోదు చేసారు . రెండో చార్జ్ షీట్ లో తీర్పును మంగళవారం కోర్టు వెలువడించనుంది.

"మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, హిందూ ధర్మం తల్లిపాలవంటిది" ; కోరుట్ల హిందూ శంఖారావం లో స్వామి పరిపూర్ణనంద


  • హిందూ ధర్మ జాగృతి కై జనం లోకి వచ్చాను 
  • మతం డబ్బా పాలవంటిది , హిందూ ధర్మం తల్లి పాల వంటిది 
  • ఈ దేశం లో ఒక్క ఆవు కసాయివాని చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు 
  • లౌకిక దేశం లో  సన్యాసి దేవాలయాన్ని దర్శించడానికి ఆటంకాల ?
  • కోరుట్ల హిందూ శంఖారావం లో  శ్రీశ్రీశ్రీ స్వామి పరిపూర్ణానంద     

30/09/2013 కరినగరం,కోరుట్ల: శ్రీ పీఠంలో కూర్చుని ఉండలేక, ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ జాగృతికే జనంలోకి వచ్చానని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ అన్నారు. యుద్ధం చేయడం తన అభిమతం కాదని హిందూ ధర్మాన్ని విచ్ఛినం చేస్తున్న శక్తులను ఎదుర్కొనేందుకే జాతిని సన్నద్ధం చేయడమే తన పర్యటన లక్ష్యమని పునరుద్ఘటించారు. సోమవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం లో నిర్వహించిన హిందూ శంఖారావానికి ఆయన హాజరై మాట్లాడారు.
హిందుత్వం ఒక మతం కాదని, అది ఓ ధర్మంగా అభివర్ణించారు. మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, ధర్మం తల్లిపాలవంటిది. అలాంటి ధర్మానికి ప్రచారం అక్కర్లేదన్నారు. హిందూ ధర్మంలో సర్వ మతాలను సమాదరించే సహజలక్షణం ఇమిడి ఉందన్నారు. ఇతర మతాల్లో ఆ లక్ష ణం లోపించి హైందవ సంస్కృతిలో భేదాలను సృష్టిస్తున్నాయని, ఆలాంటి కలుపు మొక్కలను ఏరివేయడానికి హైందవులంతా ఐక్యమై ధర్మ పరిరక్షణకు పోరాడాలన్నారు.

భారతీయ సంస్కృతిలో ప్రతీ వస్తువును దైవంగా పూజించే తత్వముందని, మనిషిని దేవునిగా సంస్కరించే గుణా న్ని రాముడి చేతల్లో, కృష్ణుడి మాటల్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాంటి దైవాల్ని తులనాడుతున్న నాలుకలను శుద్ధి చేయడం కూడా తన పర్యటన లక్ష్యమన్నారు. దేశానికి ఆయువు పాయువు అయిన గోవులను వధిస్తూ, హైందవ దేవుళ్లను తులనాడుతూ వంద కోట్ల హిందువులను అడ్డంగా నరికేస్తామంటూ రంకెలేస్తున్న మతోన్మాదులకు హెచ్చరికలుగా హిందూ యువకులంతా ఐక్యమై బలనిరూపణ చేయాలన్నారు. వందకోట్ల హిందువులున్న ఈ భారతదేశంలో వివక్ష పూరిత రాజకీయం కొనసాగుతోందని, మక్కా, జెరుసలేంకు వెళ్లేందుకు రాయితీని కల్పించే ప్రభుత్వాలు ఒక హిందువు కాశీ వెళ్లడానికి రూపాయి రాయితీ కల్పించడం లేదన్నారు. బ్రహ్మోత్సవాలకు వెళితే అదనపు చార్జీలు వసూలు చేసే ఈ ప్రభుత్వాలకు లౌకికవాదం ఉందా అని ప్రశ్నించారు.

హిందువుకు బిందువైన నాయకులు రావాలి...
హైందవ ధర్మాన్ని కాపాడుతూ, సర్వ మతాలను సమాదరిస్తూ గోవధ లేని సమాజాన్ని నిర్మించగలిగే నాయకుల్ని తయారు చేయడం కోసం జనమంతా సిద్ధం కావాలని అన్నారు. అలాంటి నాయకుడు ఎలా ఏ మతంలోంచి వచ్చినా భారతీయ సంస్కృతిని పరిరక్షించే వాడైతే స్వాగతిస్తామని పేర్కొన్నా రు. తనకు ఏ పార్టీ ముఖ్యం కాదని, తాను పార్టీలకు చెందిన వాడను కాదని, హిందూ ధర్మ పరిరక్షణే తన సిద్ధాంతమన్నారు. ఇదికాకా భారతీయులంతా ఈ మట్టిని నమ్ముకొని జీవిస్తున్నారని, ఈ మట్టిలో కలిసిపోయే ముందు హిందూ ధర్మాన్ని తన వెంట తీసుకోవడమే కాక ఆ ధ ర్మాన్ని నిలబెట్టే ఒక్క వారసున్ని అయినా అం దించాలని, ఆ ప్రయత్నంలో ఒక్కో హిందు వూ నలుగురిని కన్నా ఇబ్బంది లేదని తెలిపారు.
ఇది నిజాం రాష్ట్రం కాదు... పక్కా తెలంగాణే...స్త్రీ, పురుష, ధన, మాన, ప్రాణాలు దోచుకొని అత్యంత హేయంగా ప్రవర్తించిన నిజాం కు ఈ తెలంగాణ జాగీరు కాదన్నారు. నిజాని కి తెలంగాణలో నిజాం అద్దెకున్నాడు తప్పితే అతినికి ఏ హక్కూ లేదన్నారు. ఇది అచ్చంగా తెలంగాణ రాష్ట్రమే తప్పా నిజాం రాష్ట్రం కాదని స్పష్టం చేశారు.
ఇది కరినగరి!శంకర భగవత్పాదులు ఈ దేశనికి, ప్ర పంచానికి తిండిపెట్టి పోషించే శక్తి ఉందన్న ట్లు... కరినగరి జిల్లాకు కూడా అంతటి శక్తి ఉందని, కనుక ఇది కరీంనగర్ కాకుండా కరినగరిగా స్వామిజీ అభివర్ణించారు. భవిష్యత్తులో అది శాశ్వతంగా కరినగిరిగానే స్థిరపడనుందని జోస్యం చెప్పారు.

దేశోద్ధారణకు నడుం బిగించాలి... డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రీ
హైందవ ధర్మ ప్రచారకులు డాక్టర్ అన్నదానం చిదంబరంశాస్త్రీ మాట్లాడుతూ దేశం లో పూజనీయమైనవి అవమానించబడుతుండడం వల్ల అశాంతి, అలజడులు ప్రజ్వరిల్లుతున్నాయన్నారు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తలు భ గవద్గీతతో ప్రేరణ పొందిన వారేనని, గీతాసా రం గ్రహించి దేశోద్ధరణకు నడుం కట్టాలన్నారు.
హిందూ ధర్మానికి భంగం కలిగేది బయ ట నుంచి మాత్రమే కాదని, అంతర్గత శక్తులు కూడా పతనానికి కారణమవుతున్నాయని బాచంపల్లి సంతోష్‌కుమార్‌శర్మి అన్నారు. హైందవ దర్మ పరిరక్షణ వేదిక ఆద్వర్యంలో జరిగిన ఈ శంఖారావంలో సుమారు 20 వేల మంది జనం హాజరుకాగా ఎమ్మెల్యే కల్వకుం ట్ల విద్యాసాగర్‌రావు దంపతులతో పాటు బీజేపీ నేత సురభి భూమ్‌రావు, బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, విశ్వహిందూ పరిష త్, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్, ఏబీవీపీ, యు వజన సంఘాలు, టీటీడీ ధర్మ ప్రచార సమితి, హిందూ ధర్మ ప్రచార సమితి, ఆహ్వాన కమిటీ నాయకులు మంచాల జగన్, ఇందూరి స త్యం, తిరుమల వాసు, తోకల రమేశ్, పెం డం గణేశ్, తనగుల రాజశేఖర్, కొత్త సురే శ్, గడ్డం మధు, రేగుల భూమానందం, గిన్నెల శ్రీకాంత్, శివకుమార్, రాజ్ గంగారాం పాల్గొన్నారు.

- Source: http://www.andhrajyothy.com/

విశ్వ హిందు - Oct - 2013

(or)
Download as pdf format



About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style