| కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తున్న శ్రీ శ్యాం సుందర్ గారు |
అనంతపురం, 20/03/2013 : అనంతపురం నగరంలోని శారద నగర్ కళారామం ప్రక్కన విశ్వ హిందు పరిషద్ అనంతపురం నగర శాఖా ఆధ్వర్యంలో చలివేద్రం ఏర్పాటు చేయడం జరిగింది , దీనిని ఒకటవ పట్ట్తన సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు లాంచనంగా ప్రారంభించారు .
ఈ సందర్భంగా విశ్వ హిందు పరిషద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ యర్రగుంట్ల శ్యాం సుందర్ గారు మార్గదర్శనం చేస్తూ దారిద్ర నారాయణుడిని కొలవడమే తమ జీవిత ఆశయంగా జీవించిన స్వామీ వివేకానందుని స్పూర్తితో సేవా ప్రకల్పాలు విస్తరించాల్సిన అవసరం ఉందని , ఆన్నపూర్ణ అయిన భారత మాత సంతానం ఆకలి తో అలమటించడం జరగరాదని స్వామిజి వారసత్వంగా విశ్వ హిందు పరిషద్ దేశ వ్యాప్తంగా లక్షలాది సేవా ప్రకల్పాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు , విహిప అంటే కేవలం ఉద్యమాలు మాత్రమే కాదని దేశ పునర్వైభవ నిర్మాణంలో క్రియాశీలక పాత్రను నిర్వహిస్తున్నది అని అన్నారు .
ఈ కార్యక్రమంలో నగర గౌరవ అధ్యక్షులు రుద్రముని , నగర అధ్యక్షులు శ్రీ అక్కిశెట్టి జయరాం గారు , ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ కుమార్ గారు , నగర కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ గారు , భజరంగ్ దళ్ ప్రాముఖ్ అమర్ బాబు , తదితరులు పాల్గొన్నారు .

No comments:
Post a Comment