Click Hereఉత్తిష్ఠత భరతసుతా ఉత్తిష్ఠత కార్యరతా
నవ భారత భూఖండము నాకముగా నొనరింపగ
గుండె తెరచి కండ కోసి వెన్నెముకల ధారవోసి
జపము చేసి జబ్బ చరిచి జాతి కొరకు జీవించుచు
విజయము సాధించినారు వీరులైన మన పూర్వులు
నీ శక్తికి శతృసేన నికరము భీతిల్లవలెను
నీ శీలము గని జగంబు నీ పదముల మ్రొక్కవలెను
నీ దీక్షతొ ఈ భారతి నిలుపవలెను నీతి పథము
నిదుర విడిచి ఉద్యమించు సుఖ లాలస తగదు వలదు
నింగి క్రుంగి పైబడినా నీరధి నీ పై పొంగిన
నీ ధైర్యము చెరుపలేవు నీ ప్రగతిని నిలుపలేవు