Our amazing new site will launch in

Saturday, 7 January 2012

హిందూ రోటీ, ఔర్ శిక్షా బచావో ఆందోళన్-మైనారిటీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం : తొగాడియా


విలేకరుల సమావేశం లో మాట్లాడుతున్న ప్రవీణ్ భాయి తొగాడియ
 హైదరాబాద్, జనవరి 7: ముస్లింలకు విద్య, ఉద్యోగాలు, ఆర్థికాంశాల్లో కేంద్రప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘హిందూ రోటీ,ఔర్ శిక్షా బచావో ఆందోళన్’ పేరుతో విశ్వహిందూపరిషత్ (విహెచ్‌పి) భారీ
ఎత్తున ఉద్యమం చేపడుతోంది. విహెచ్‌పి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ బాయి తొగాడియా శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఓబిసిలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్ల కోటా నుండి ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కేవలం రాజకీయ లబ్ధికోసమేనని పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశం కేవలం ఓబిసిలకే పరిమితం కాదని, ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు ఓపెన్ క్యాటగిరీ నుండి కూడా వాటా ఇస్తూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఎస్‌టి రిజర్వేషన్ల కోటా నుండి గిరిజనుల పేరుతో క్రైస్తవుల్లో ఒక వర్గానికి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, విద్య ఉద్యోగాల్లో మైనారిటీలకు 2/3వ వంతు రిజర్వేషన్లు అమలు అవుతాయని హెచ్చరించారు.
భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లకు అనుమతించడం లేదని, కేవలం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిగా గుర్తిస్తూ ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు భారత రాజ్యాంగంలోని 16 (4) ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ముస్లిం, క్రిస్టియన్లలో కులాలు లేవని అందువల్ల భారత రాజ్యాంగం ప్రకారం ఈ మతాలకు చెందిన వారికి విద్య, ఉద్యోగాలు, ఆర్థికాంశాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలులేదని గుర్తు చేశారు. ముస్లింలు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అమలు చేస్తే అంబేద్కర్‌ను అవమానించినట్టవుతుందని పేర్కొన్నారు.
మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం రంగనాథ్ మిశ్రా కమిషన్‌ను, రాజేంద్ర సచ్చార్ కమిటీలను ఏర్పాటు చేసిందని తొగాడియా తెలిపారు. ఈ రెండు కమిషన్లు వాస్తవాలకు విరుద్ధంగా మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని తమ నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేశాయని తెలిపారు. ముస్లింలు తమ జనాభాను పెంచుకునేందుకు భారత జాతి భద్రతను కూడా పట్టించుకోవడం లేదని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోకుండా పెద్ద ఎత్తున సంతానాన్ని కంటున్నారని తొగాడియా తెలిపారు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం, లెక్కకు మించిన సంతానాన్ని కనడం వల్ల వారిలో బీదరికం పెరిగిందన్నారు. దేశంలో 1947 లో కేవలం మూడు కోట్లు ఉన్న ముస్లింల జనాభా నేడు 15 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి వల్ల దేశం కూడా పేదరికానికి గురవుతోందన్నారు. ఈ పరిస్థితిలో దేశం మినీ పాకిస్తాన్‌గా కాకుండా పూర్తిగా పాకిస్తాన్‌గా మారిపోతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో విహెచ్‌పి ఏడు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిందని తెలిపారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికతో పాటు రాజేంద్ర సచార్ కమిటీ నివేదికలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఓబిసిలకు కల్పించిన రిజర్వేషన్ల నుండి ముస్లింలకు కేటాయించిన 4.5 శాతం రిజర్వేషన్లను ఉపసంహరించుకోవాలని, ఎస్‌సి, ఎస్‌టిలకు కల్పించిన రిజర్వేషన్లలో ముస్లింలకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించబోమంటూ ప్రజలకు హామీ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ముస్లింలలో ఉన్న కొన్ని కులాలకు బిసి జాబితా కింద రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఈ పరిస్థితిలో కొత్తగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించవద్దని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి మతపరమైన రిజర్వేషన్లను కల్పించాలన్న ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, క్రైస్తవులకు కల్పించిన రిజర్వేషన్లను ఉపసంహరించుకునేంత వరకు దేశవ్యాప్తంగా ‘హిందూ రోటి, ఔర్ శిక్షా బచావో ఆందోళన్’ను కొనసాగిస్తామని ప్రవీణ భాయ్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో విద్యార్థులు కూడా ఆందోళనలో భాగస్వాములు అవుతారని తెలిపారు. ఈ సమావేశంలో విహెచ్‌పి రాష్ట్ర నాయకుడు రామరాజు, విహెచ్‌పి నేత కైలాస్‌నాథ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style