Our amazing new site will launch in

Sunday, 13 November 2011

మత హింస నిరోధక బిల్లు 2011 భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనది హిందువులను అణచివేసే బిల్లు

హిందువులకు కనిపించే రేపటి దృశ్యం ఇలా ..
దేశంలో మత ఘర్షణలను నివారించాలన్న కుంటిసాకుతో శ్రీ మతి సోనియాగాంధీ అధ్యక్షతన గల జాతీయ సలహా మండలి మతపరమైనలక్ష్యిత  హింస నిరోధక బిల్లు 2011ను ప్రతిపాదించింది. ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది .

 
బిల్లు పై నిరసనలు :- 10 సెప్టెంబర్ 2011న  జాతీయ సమైక్యతా మండలి  సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ముక్యమంత్రులు ఈ బిల్లు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రముఖ దినపత్రికలు, రాజకీయ విశ్లేషకులు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు.

బిల్లులో ఏముంది? :-  
1)  మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు- అంటే ముస్లింలు,క్రైస్తవులు 
2) బాషపరంగా అల్ప సంఖ్యాక వర్గాలు 
3) షెడ్యుల్డ్ కులాలు, తెగలు- 
ఈ మూడువర్గాల ప్రజలపై దాడులు జరిగినట్లయితే వారికి సహాయక పూనరవాస కార్యక్రమాలు చేపట్టి దాడులు చేసిన వారికీ కటిన  శిక్షలు  సత్వరంగా పడేటట్లు చేయడం. హిందువుల పై ఈ తరహా దాడులు జరిగితే ఈ చట్టం వర్తించదు.

భారత రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమైన బిల్లు :- 
భారత రాజ్యాంగం ప్రకారం మతము, కులము, బాష లింగ వివక్షలకు అతీతంగా చట్టం ముందు అందరు సమానమే. అందరికి సమాన అవకాశాలు సమన హక్కులు సమన రక్షణ రాజ్యాంగం ప్రజలందరికి ప్రసాదించింది. ఒక వర్గపు ప్రజలు వేరొక వర్గపు ప్రజలపై చేసే దాడిని మత ఘర్షణగా పేర్కొనడానికి బదులు మైనారిటీలపై జరిగే దాడులనే మత ఘర్షణగా ఈ బిల్లు పేర్కొనడం భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. 

 హిందు వ్యతిరేక బిల్లు :- 
దేశంలో మత ఘర్షణలకు ఎల్లపుడు హిందువులే అనే భావన కలిగించడం అంటే హిందుత్వాన్ని అవమానిచడం. ఈ బిల్లు ద్వారా చట్టపరంగా హిందువులను గురిపెట్టడం అంటే హిందువులని అనచివేయడమే.

మహిళలందారు సమానం కాదా? 
ఎ మతానికి చెందిన మహిళ అవమానానికి గురైన నిందితుడిని శిక్షించాలి. ఈ బిల్లు ప్రకారం ఒక ముస్లిం హిందు స్త్రీని అవమానిస్తే అ హిందువు శిక్షార్హుడవుతాడు. అదే ఒక ముస్లిం హిందూ స్త్రీని అవమానిస్తే మాత్రం ఈ చట్టం ప్రకారం అ ముస్లిం శిక్షార్హుడు కాడు. ఇంతవరకు క్రిమినల్ చట్టాలు మతఃలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమానంగా వర్తించబడేవి. ఈ బిల్లు అమలులోకి వస్తే హిందువులకి ఓ క్రిమినల్ చట్టం,ముస్లింలకి మరొక క్రిమినల్ చట్టం అమలులోకి వస్తాయి. ఇదేమి న్యాయం? 

Thursday, 10 November 2011

అఖిలభారత ధర్మప్రసార్ సమ్మేళనం - రాష్ట్రము నుండి 105 మంది ప్రతినిధుల హాజరు


సభావేదిక 
Nov 5,6,7 అహమ్మదాబాద్ : విశ్వ హిందూ పరిషద్ అఖిల భారతీయ ధర్మ ప్రసార్ కార్యకర్తల సమ్మేళనం తేది : నవంబర్ 5,6&7 లలో  అహమ్మదాబాద్ దగ్గరలోని  ప్రేరణాపీఠ్ ఆశ్రమము గురుకుల పాఠశాల లో
జరిగింది , ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుండి సుమారు 1500 మంది ధర్మ ప్రసార్ అయాం (విభాగం) కు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు . తమ తమ ప్రాంతాలలో జరిగుతున్న  పరావర్తన కార్యక్రమాల నివేదిక మరియు క్రైస్తవ మత మార్పిడ్లను అరికట్టడానికి చేసిన కార్యక్రమాల వివరాలుఅందిచారు .

ఈ కార్యక్రమానికి అనేక విశిష్ట  పీఠాల పీఠాధిపతులు , పూజ్య సాదు-సంతులు హాజరై తమ ఆశిర్వచానాలను మరియు హిందూ ధర్మోన్నతికి  తమ ఆలోచనలను అందించారు. వీరితో పాటుగా విశ్వ హిందూ పరిషద్ నాయకులు శ్రీ dr ప్రవీణ్ భాయి తొగాడియ ( అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ), శ్రీ దినేష్ చంద్ర , శ్రీ బాల కృష్ణ నాయక్ , పూజ్య స్వామి విజ్ఞానంద , శ్రీ శ్యాంజి గుప్త , శ్రీ మోహన్ జోషి మొదలయిన పెద్దలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో  మార్గదర్శనం - శ్రీ జుగల్ కిశోర్ గారు
శ్రీ జుగల్ కిశోర్ కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్నా పరావర్తన కార్యక్రమాల సరళి - సమష్యలు - పరిష్కారం పై సుదీర్ఘ సమీక్షా జరగాలని , మరింత వేగంగా దూరమైన మన సోదరులను విశాల స్రవంతిలోకి ఆహ్వానించాలని తెలిపారు , క్రైస్తవ మత మార్పిడ్ల పెడ ధోరణులను ఎండగట్టాలని , తద్వారా హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని తెలిపారు , రాబోయే రోజులలో జరుగబోయే అనేక పరావర్తన కార్యక్రమాల మరియు జన జాగృత కార్యక్రమాల  పరియోజన ఈ సమ్మేళనంలో  జరిగింది. సమ్మేళనం పూర్తీ స్థాయి విచార దారా , ఆలోచనాత్మక చర్చలలో సమయం కూడా తెలియనంత విశాలాత్మకంగా జరిగింది .
సమ్మెలన దృశ్యం
మన రాష్ట్రము నుండి 105 మంది ధర్మ ప్రసార్ కార్యకర్తలు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు వీరికి శ్రీ గుమ్మల సత్యం ( వి హి ప జాతీయ సహా కార్యదర్శి ) నాయకత్వం వహించారు . 
రాష్ట్రం నుండి హాజరైన ప్రతినిధుల బృందం

Tuesday, 8 November 2011

జయ జనార్థనా కృష్ణా రాథికాపతే


జయ జనార్థనా కృష్ణా రాథికాపతే
జన విమోచనా కృష్ణా జన్మ మోచన


గరుడ వాహనా కృష్ణా గోపికాపతే
నయన మోహనా కృష్ణా నీరజేక్షణ 
సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే
మదన కామనా కృష్ణా మాథవా హరే   || జయ ||

మథుర ధీపతే కృష్ణా వాసవానుజ
వరగుణాంతకా కృష్ణా వైష్ణావాకృతే
సురచిరాననా కృష్ణా శౌర్య  వారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా   || జయ ||

విమల బాలకా కృష్ణా వల్లభీపతే
కరుణ లోచనా కృష్ణా కామదాయకా
కువల యేక్షణా కృష్ణా కామనాచ్యుతే
చరణ వల్లభం కృష్ణా శరణు ముకుందా   || జయ ||

విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్


విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్
వీర హైందవ సింహనాదం నాంది పలికే మహానాదం  
||మహానాదం||


విజయమే అను వీర శంఖపు గగన ఘోషను వినగ రండోయ్
రసమయ్యమగు వంశి రవముల రుచులనెన్నో చూడరండోయ్
ధ్వం ధ్వమ్మను పణవ ధ్వనితో పదం పాడగ పదండోయ్
ఝణణ  ఝణణను ఝల్లరులతో కదన మాడగ కదలిరండోయ్  
||మహానాదం||

అసుర బలమును మట్టుబెట్టిన ఉగ్ర నరసింహుని నినాదం
రావణుని సంహర మొనర్చిన రామబాణపు హూంకారం
శత్రు శిర విచ్చేద  శస్త్రం సుదర్శన రణ ఘీంకారం
అరి భయంకర భరత సైనిక వీర వర విజ్రుమ్భణం 
||మహానాదం||

దేశ ధర్మోద్ధరణ చేద్దాం శత్రు శేషం త్రుంచి వేద్దాం
వ్యక్తి వ్యక్తిని సంస్కరించి జాతి శక్తిగ మలచి వేద్దాం
నిత్య సాధన తంత్ర పథమున సంఘటితముగ సాగుదాం
పరమవైభవ దివ్య మంత్రం నరనరమ్మున నింపుదాం  
||మహానాదం||

Saturday, 5 November 2011

గో సంరక్షణ చట్టాలు

Click on Image to Enlarge Then Right Click > Save as 

గో సంరక్షణ చట్టాలు


ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గారికి వినతి


About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style