 |
| సభావేదిక |
Nov 5,6,7 అహమ్మదాబాద్ : విశ్వ హిందూ పరిషద్ అఖిల భారతీయ ధర్మ ప్రసార్ కార్యకర్తల సమ్మేళనం తేది : నవంబర్ 5,6&7 లలో అహమ్మదాబాద్ దగ్గరలోని ప్రేరణాపీఠ్ ఆశ్రమము గురుకుల పాఠశాల లో జరిగింది , ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుండి సుమారు 1500 మంది ధర్మ ప్రసార్ అయాం (విభాగం) కు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు . తమ తమ ప్రాంతాలలో జరిగుతున్న పరావర్తన కార్యక్రమాల నివేదిక మరియు క్రైస్తవ మత మార్పిడ్లను అరికట్టడానికి చేసిన కార్యక్రమాల వివరాలుఅందిచారు .
ఈ కార్యక్రమానికి అనేక విశిష్ట పీఠాల పీఠాధిపతులు , పూజ్య సాదు-సంతులు హాజరై తమ ఆశిర్వచానాలను మరియు హిందూ ధర్మోన్నతికి తమ ఆలోచనలను అందించారు. వీరితో పాటుగా విశ్వ హిందూ పరిషద్ నాయకులు శ్రీ dr ప్రవీణ్ భాయి తొగాడియ ( అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ), శ్రీ దినేష్ చంద్ర , శ్రీ బాల కృష్ణ నాయక్ , పూజ్య స్వామి విజ్ఞానంద , శ్రీ శ్యాంజి గుప్త , శ్రీ మోహన్ జోషి మొదలయిన పెద్దలు పాల్గొన్నారు.
 |
| కార్యక్రమంలో మార్గదర్శనం - శ్రీ జుగల్ కిశోర్ గారు |
శ్రీ జుగల్ కిశోర్ కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్నా పరావర్తన కార్యక్రమాల సరళి - సమష్యలు - పరిష్కారం పై సుదీర్ఘ సమీక్షా జరగాలని , మరింత వేగంగా దూరమైన మన సోదరులను విశాల స్రవంతిలోకి ఆహ్వానించాలని తెలిపారు , క్రైస్తవ మత మార్పిడ్ల పెడ ధోరణులను ఎండగట్టాలని , తద్వారా హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని తెలిపారు , రాబోయే రోజులలో జరుగబోయే అనేక పరావర్తన కార్యక్రమాల మరియు జన జాగృత కార్యక్రమాల పరియోజన ఈ సమ్మేళనంలో జరిగింది. సమ్మేళనం పూర్తీ స్థాయి విచార దారా , ఆలోచనాత్మక చర్చలలో సమయం కూడా తెలియనంత విశాలాత్మకంగా జరిగింది . |
| సమ్మెలన దృశ్యం |
మన రాష్ట్రము నుండి 105 మంది ధర్మ ప్రసార్ కార్యకర్తలు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు వీరికి శ్రీ గుమ్మల సత్యం ( వి హి ప జాతీయ సహా కార్యదర్శి ) నాయకత్వం వహించారు .  |
| రాష్ట్రం నుండి హాజరైన ప్రతినిధుల బృందం |
No comments:
Post a Comment