Our amazing new site will launch in

Sunday, 28 December 2014

నిజాం పాలన తేవాలని చూస్తే... ప్రతి పౌరుడూ పటేలే - ప్రవీణ్ భాయి తొగాడియా

దేశంలో తిరిగి ఎవరైనా నిజాం పాలనా తెద్దామనుకుంటే ప్రతి పౌరుడు సర్దార్ వల్లభాయి పటేల్ అవుతారు, లాహోర్ రావల్పిండి లపై ధర్మ ధ్వజం ఎగిరిననాడే మన అసలైన ఉత్సవాలు జరుగుపుకోవాలి, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగితీరుతుంది, మన దేశంలో ఏ హిందువు భోజనానికి, విద్యకు, వైద్యానికి దూరం కాకూడదు ఈ దిశలో విహెచ్పి పని చేస్తున్నది - ప్రవీణ్ భాయి తొగాడియా  

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల్లో నిజాం పాలన తేవాలని చూస్తే ప్రతి పౌరుడూ సర్దార్ పటేల్ అవుతాడని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగాడియా హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంత్యుత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ శక్తి సంగమ కార్యక్రమంలో ప్రవీణ్ భాయ్ తొగాడియా దేశ, రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. లాహోర్ రావల్పిండిపై జాతీయ పతాక ఎగురవేసి అఖండ భారతావనిని నిర్మించిననాడే విహెచ్‌పికి అసలైన ఉత్సవాలన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని, దేశంలో ప్రతి హిందువు హృదయం అదే చెబుతోందన్నారు. ముస్లింల తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, నలుగురు భార్యల పద్ధతి పోవాలి, కామన్ సివిల్ కోడ్ రావాలని చెప్పారు. మక్కాకు, లేదా జెరూసలేంకి వెళ్తామంటే రాయితీలా? తిరుపతికి మాత్రం ఇవ్వరా? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఉర్దూ అకాడమికి మూడు కోట్లు ఇచ్చే ప్రభుత్వం తెలుగు అకాడమికి 30 లక్షలు ఇస్తుంది. వారికి నౌకరీలు, వీరికి అక్కర్లేదా? అని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హిందువూ జాగృతి కావల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతం హిందువులు ఉండేవారని, అదిప్పుడు 8 శాతానికి తగ్గిందన్నారు. పాకిస్తాన్‌లో పది శాతం హిందువులు ఉండగా అది కేవలం ఒక శాతానికి పడిపోయిందని, ప్రపంచమంతా తొలుత హిందువులతోనే ఉండేదని, భారత్ వంద శాతం హిందువులతో ఉండేదన్నారు. నేడు పరిస్థితి దారుణంగా ఉందని, రెండు వేల సంవత్సరాలున్న హిందూ సమాజంలో ఒక్క హిందువు కూడా విద్యలేకుండా అనారోగ్యంగా ఉండరాదని, సురక్షకు మరో అర్థం హిందువుల సంఖ్య తగ్గరాదని అన్నారు. హిందువుల ఐక్యత చాలా ముఖ్యమని, కోట్లాది హిందువులు పునఃసమృద్ధి సంకల్పం తీసుకోవాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏకైక ధర్మం హిందూత్వమని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ప్రాధమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతే అయినా తాము సైతం చేయూతనిస్తున్నామన్నారు. పూర్వీకులు హిందువులైన వారంతా తిరిగి తమ సొంత మతంలోకి రావాలని, వారందర్నీ హత్తుకుంటామని ప్రవీణ్‌భాయ్ తొగాడియా చెప్పారు.

Thursday, 25 December 2014

భాగ్యనగర్: 28న VHP హిందూ మహా సమ్మేళనం- అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా హాజరు


విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 28న ఆదివారం హైదరాబాద్‌లో హిందూ మహా సమ్మేళనం జరుగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటల నుంచి జరిగే సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంరక్షకులు అశోక్ సింఘాల్, కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, అంతర్జాతీయ అధ్యక్షుడు జి రాఘవరెడ్డి హాజరవుతారని విహెచ్‌పి మీడియా సెల్ ఇన్‌చార్జీ భరత్ వంశీ తెలిపారు. అలాగే స్వామీజీలు పరిపూర్ణానంద, చిన్న జియర్, కమలానంద భారతిలతోపాటు మరికొంత మంది స్వామీజీలు పాల్గొని హిందూ సమాజానికి మార్గదర్శనం చేస్తారని చెప్పారు. సమ్మేళనంలో హనుమాన్ చాలీసా పారాయణం కోసం భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో 51 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామన్నారు. తయారీ పూర్తయిన అనంతరం ఈనెల 26న ఎన్టీఆర్ స్టేడియంలో విగ్రహాన్ని నెలకొల్పుతామని భరత్ వంశీ పేర్కొన్నారు. హిందూ మహా సమ్మేళనంలో హిందూ బాంధవులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tuesday, 23 December 2014

'మతమర్పిడ్ల నిరోద చట్టం తీసుకురండి' : RSS చీఫ్ మోహన్ జి భాగవత్


'మత మర్పిడ్ల పట్ల ఇన్ని సంవత్సారాలుగా మౌనంగా ఉన్న పార్టీలకు, వ్యక్తులకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు, అమాయకత్వంలో ప్రలోభాలకు, భయానికి లోనై దారి తప్పిన మా సోదరులు తిరిగి హిందుత్వంలోనికి వస్తే తప్పా ?, ఇది దొంగే "దొంగా-దొంగా" అని అరచిన వైనాన్ని తలపిస్తుంది. - మోహన్ జి భాగవత్       
22/12/2014, కోల్ కత్తా : " ఘర్ వాపసి " లేదా " పునరాగమన కార్యక్రమం ద్వారా మతం మారిన హిందువులను తిరిగి హిందుత్వం లోనికి తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగితీరుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ రావ్ జి భాగవత్ పుణరుద్గాటించారు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా లో విశ్వ హిందు పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా జరిగిన ర్యాలి లో ఆయన ప్రసంగించారు.ఎవరైతే " ఘర్ వాపసి " కార్యక్రమం జరగొద్దు అని భావిస్తున్నారో అలాంటి వ్యక్తులు పార్టీలు మత మర్పిడ్ల నిరోధ చట్టం కోసం పోరాడాలని ఆయన సూచించారు.
విహెచ్పి ర్యాలిలో ప్రసంగిస్తున్న రా.స్వ.స చీఫ్ మోహన్ భాగవత్  

మత మార్పిడ్ల నిరోధ చట్టానికి మద్దతు తెలుపుతున్నాం : ప్రవీణ్ భాయి తొగాడియా 

విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా మాన్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి తో ఏకీభవిస్తూ " ప్రియ సహోదర (ములాయం సింగ్ యాదవ్) "ఘర్ వాపసి" ని దొంగతనంతో పోల్చావు కదా , దొంగకు చట్ట పరమైన శిక్షలు ఉన్నపుడు, కేంద్రం మత మర్పిడ్లను నిరోదించే చట్టం తెద్దామంటే ఎందుకు మద్దత్తు పలకట్లేదో ప్రజలకు సమాదానం ఇవ్వాల్సి ఉంటుంది జాగ్రత్తా ! " అని అన్నారు.    

Monday, 15 December 2014

కడప: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి తీరుతాం : విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి


ప్రతి ఏడూ దాదాపు 40 వేల మందిని మతమార్పిడి చేస్తూ ఉన్నారు, దీన్ని నివారించడానికి ప్రతి హిందువు ప్రతి నెల రూ 100 /- ధర్మ సేవలో అర్పించాలి. అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరం హిందుదేశ స్వాభిమాన చిహ్నం, దానిని ఎట్టి పరిస్థితిలో నిర్మించి తీరుతాం - శ్రీ రాఘవరెడ్డి విహిప అంతర్జాతీయ అధ్యక్షులు  
తిరుపతి, డిసెంబర్ 14: అయోధ్యలో రామాలయం నిర్మాణంపై దృష్టి పెడతామని, ఇందుకు సంబంధించి కేంద్ర కమిటీతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి అన్నారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతిని పురస్కరించుకుని తిరుపతి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర పుష్కరిణి వద్ద విరాట్ హిందూ సమ్మేళనంలో భాగంగా శ్రీరామ మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవరెడ్డి మాట్లాడుతూ గోవధ నిషేధం, 370 ఆర్టికల్‌కు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో త్వరలోనే చర్చకు తీసుకువస్తారని అన్నారు. దేశ వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఆదాయం లేని, దూప దీప నైవేద్యాలకు నోచుకోని వంద ఆలయాలను విహెచ్‌పి దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఆదాయం వచ్చే ఆలయాలను దేవాదాయ శాఖ ఉంచుకుని నిరాదరణకు గురైన ఆలయాలను తమకు అప్పగిస్తే, ఆలయాలు ఎలా ఉండాలో తాము నిర్వహించి చూపిస్తామన్నారు. హిందూ మత పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని దీనిని వారు గ్రహించాలన్నారు. మత మార్పిడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి దృష్టి సారించాలన్నారు. ఏడాదికి 40 వేల మంది మత మార్పిడులు చేసుకుంటున్నట్లు విహెచ్‌పి గుర్తించిందన్నారు. ఈనేపథ్యంలో విహెచ్‌పిలో పూర్తికాలం పనిచేస్తే కార్యకర్తలతో ఈ మత మార్పిడిలను అరికట్టడానికి నడుం బిగిస్తుందన్నారు. వీరికి అవసరమైన జీతాలు ఇవ్వడానికి ప్రతి హిందువు వంద రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిని చేశారని, ఆయన వారి ఆకాంక్షను నెరవేరుస్తారనే విశ్వాసం తమకు ఉందని రాఘవరెడ్డి తెలిపారు.

Sunday, 14 December 2014

సంగారెడ్డి: జీహాద్, లవ్ జిహాద్, మతమార్పిడ్లకు సరైన సమాదానం చెపుదాం - ప్రవీణ్ భాయి తొగాడియా

సంగారెడ్డి, 14/12/2014 : విశ్వ హిందు పరిషద్ స్వర్ణోత్సవాల కార్యక్రమాలలో భాగంగా స్థానిక విశ్వ హిందూ శంఖారావం కార్యక్రమం జరిగింది, స్థానిక కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాననీయ శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ముఖ్య అధితిగా హాజరయ్యారు.
జిహాద్, లవ్ జిహాద్, బలవంతపు క్రైస్తవ మత మర్పిడ్లకు సరైన సమాదానం చెప్పాల్సి ఉంది, నేడు మన దేశం, మందిరం, గోవు, మహిళా, బడి మన మాన బిందువులు ఏమి సురక్షితంగా లేవు, ఈ పరిస్థితికి సంఘటనాత్మక హిందు శక్తితో సమాదానం ఇస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ  
ఈ సందర్భంగా హాజరయిన ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ ' ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల సేవ, సురక్షా, సౌభాగ్యాల గురించి ఆలోచించే

సంస్థ విశ్వ హిందు పరిషద్, ప్రపంచం మొత్తం హిందుత్వమే ఉండేది, భారత్ లో, అరబ్ లో, ఆఫ్రికాలో, యూరప్ లో,  అమెరికాలో  నేడు క్రైస్తవుల పవిత్ర రోమ్ లో కూడా హిందుత్వమే ఉండేది, వేదం కాలం నుండి గత 3,000 సంవత్సరాల క్రితం వరకు విశ్వమంతా హిందుత్వమే నిండి ఉండేది, హిందువులే ఉండేవారు. ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా హిందువుల దగ్గరే ఉండేది, ఆ ఐశ్వర్యం కోసమే విధర్మియ దోపిడీ దారులు, దురాక్రమణ దారులు ఈ దేశం పైన దండయాత్రలు చేసారు, ఇక్కడ ఉన్న నిజాం ఆలా వచ్చిన దోపిడీ దారుడే, బాబర్ దోపిడీ దారుడే, ఆఫ్హానీ దోపిడీ దారుడే, మీరే చెప్పండి ఎవరైనా దరిద్రుడి ఇంటిని దోచుకోవడానికి వస్తాడా ?, ప్రపంచ వ్యాపార సామ్రాజ్యం హిందువుల చేతులలో ఉండేది, మన పూర్వీకులు కస్టపడి సంపదను సృష్టించేవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుత్వం నేడు ఎక్కడ ఉంది, రోమ్ లో లేదు, ఆఫ్రికా, యూరోప్, అమెరికా లో లేదు, అతిపెద్ద సైన్యం ఉండికూడా నేడు కాశ్మీర్ లోయలో కూడా హిందువు సురక్షితంగా లేడు, పరిస్తితి ఇలాగే కొనసాగితే మన కుటుంబాలు సురక్షితంగా ఉండవు, మన ఇళ్ళు మన మహిళలు, మన మందిరాలు ఇలా ఏమి సురక్షితంగా ఉండవు, విశ్వమంతా ఉన్న హిందుత్వం నేడు కేవలం 40% మాత్రమే అయ్యింది, ఈ పరిస్తితి మారాల్సి ఉంది, ఒక హిందువుకు అన్యాయం జరిగితే 200 కోట్ల చేతులు స్పందించినప్పుడు ఎవరైనా హిందువుల పై చెయ్యేత్తే సాహసం చేయగలరా ? ఆలోచించండి. హిందుత్వం ప్రేమకు వ్యతిరేకం కాదు ఆమాటకొస్తే ప్రేమకు అతున్నత స్థానం కల్పించిది హిందుత్వం మాత్రమె కాని లవ్ జిహాద్ పేరుతొ హిందు అమ్మాయిలను ఏమార్చే ప్రయత్నం జరుగుతుంది, జిహాద్ కు, లవ్ జిహాద్ కు, క్రైస్తవ బలవంతతపు మాట మార్పిడ్లకు సరైన సమాదానం చెబుదాం" అని అన్నారు.  

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style