Our amazing new site will launch in

Monday, 28 April 2014

కడప: తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 225 మంది మతం మారిన హిందువులు - సత్యం జి మార్గదర్శనం

కడప , 27/04/2014 : విశ్వ హిందూ పరిషద్ ధర్మ ప్రసార సమితి అధ్వర్యంలో తేది 24/04/2014 నాడు కడప జిల్లా, మైదుకూరు మండలం, ఉత్సలవరం గ్రామం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో భాగంగా 64 కుటుంబాలకు చెందిన 225 మంది గతంలో క్రైస్తవంలోకి మతం మారిన హిందువులు తిరిగి తమ మాతృదర్మం హిందుత్వంలోకి తిరిగి వచ్చారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేస్తూ శ్రీ గుమ్ముల సత్యం (విశ్వ హిందూ పరిషద్ జాతీయ సహా కార్యదర్శి) హిందుత్వం యొక్క సమగ్ర స్వరూపాన్ని వారి ముందు ఉంచడం జరిగింది, ఏ రూపంలో దేవుణ్ణి కొలిచిన ఇబ్బంది లేని స్వేచ్చాయుత ఆరాధనా విధానం హిందుత్వంలో తప్ప ప్రపంచంలోని మరే మతంలో లేదని, నదులు ఎన్ని మార్గాలలో ప్రవహించినా చేరుకునేది ఆ సముద్రంలోకే అనే జగద్వితిత సత్యాన్ని మనం మరువకూడదని అన్నారు, కేవలం నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప అనే సంకుతత్వం హిందుత్వంలేదని ముప్పై ముడు కోట్ల దేవతలను ఆరాధించే హిందువులకు, మంచి పని చేసే ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసే హిందుత్వాన్ని నాశనం చేయాలనుకోవడం కేవలం కలగా మిగిలిపోయే వాస్తవం అని అయన అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారికి భగవద్గీత పుస్తకాలు అందించడం జరిగింది.





Monday, 21 April 2014

అనంతపురం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 8 కుటుంబాలు - శ్రీ సత్యం జి మార్గదర్శనం

అనంతపురం : హనుమాన్ జయంతి రోజున అనంతపురం జిల్లాలోని తానకల్లు మండలం తవలం గ్రామంలోని హనుమాన్ మందిరంలో జరిగిన పునరాగమనం కార్యక్రమంలో గతంలో క్రైస్తవులుగా మారిన ఎనిమిది కుటుంబాల నుండి 15 మంది సభ్యులు తిరిగి తమ మాతృధర్మమయిన హిందుత్వాన్ని తిరిగి స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరయిన శ్రీ గుమ్మాల సత్యం విశ్వ హిందూ పరిషద్ జాతీయ సహా కార్యదర్శి గారు మార్గదర్శనం చేస్తూ " అమ్మవోడిని విడిచి వెళ్ళిన పిల్లలు తిరిగి అమ్మ ఒడిలో స్వాంతన పొందుతున్న దృశ్యం నా కన్నల ముందు కదలాడుతూ ఉంది, నా హృదయం ఆనంద స్పందనలు కలిగిస్తున్నది, హిందుత్వాన్ని విడిచి వెళ్ళిన మీరు తిరిగి మీ స్వంత ఇంటికి రావడం చాలా ఆనందదాయకం, ప్రపంచంలో ఉన్న మంచి అంతా హిందుత్వంలోనే ఉంది, హిందుత్వంలో ఉన్న మంచి ప్రపంచమంతా ఉంది, ఈ సత్యాన్ని గ్రహించక మీ ఎక్కడికేక్కడికో వెళ్లారు, మీ హృదయాలను అడిగి చూడండి, హిందుత్వాని వీడి పొందిది ఏమి లేదు అని చెబుతుంది, ' స్వధర్మే నిధనం శ్రేహః పర ధర్మో భయావహ ' అన్న గీతాచార్యుడి బోదన గుర్తు పెట్టుకోండి, మీ అనుభవం మరికొందరికి మార్గదర్శనం అవుతుంది, ఆ దిశలో మనమందరం కలిసి పనిచేద్దామని ఆశిస్తున్నాను ' అని అన్నారు.   

మందిర పూజారి శ్రీ రమణ గారి పూజా కార్యక్రమం అనంతరం స్వధర్మం స్వీకరించిన కుటుంబ సభ్యులకు భగవాన్ శ్రీ రాముడి ఫోటో, భగవద్గీత పుస్తకం, క్రొత్త వస్త్రాలతో సత్కరించడం జరిగింది, తర్వాత సాముహిక భోజనాలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల సుమారు 16 గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు. 

Saturday, 19 April 2014

రాముడు ఈ దేశపు ఆత్మ - అయోధ్యలో భవ్య మందిరం నిర్మించి తీరుతాం : విహెచ్పి నేత చంపత్ రాయ్


శ్రీ రాముడు ఈ దేశపు ఆత్మ, జాతీ గౌరవ చిహ్నం, అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరం నిర్మాణం అంటే అది భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక, ఇస్లాం దురాక్రమణ దారుల చిహ్నాలు హిందూ దేశంలో ఉండడానికి వీల్లేదు, శ్రీ రామజన్మ భూమి లో భవ్య రామ మందిరం నిర్మించి తీరుతాం - 
శ్రీ చంపాథ్ రాయ్ విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి    
17/04/2014, భాగ్యనగర్ : హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ దళ్ నిర్వహించిన శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర ముంగిపు సభ 15/04/2014 రోజు సాయత్రం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ మైదానం లో జరిగింది. దాదపు 70,000 మంది యువ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ సభ కు హాజరయ్యారు. మాన్య శ్రీ చంపాథ్ రాయ్ విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్య వక్తగా హాజరయ్యరు.

భజరంగ్ దళ్ కార్యకర్తలకు మాన్య శ్రీ చంపత్ రాయ్ మార్గదర్శనం చేస్తూ " పిరికివాళ్ళ దేవుళ్ళు కూడా పిరికివాళ్ళే అయి ఉంటారన్న వీర సావర్కర్ సూక్తిని గుర్తుచేసుకోవాలి, హిందూ సమాజం పిరికి అయ్యిన కారణంగా మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామున్ని పిరికివాణ్ణి చేసింది, అప్పుడే శ్రీ రామ మందిరం ద్వంసం అయి ' బాబ్రీ మస్జిద్ ' అయ్యింది, 1992 డిసెంబర్ 6 న హిందూ సమాజం లో శక్తి జాగృతం అయ్యింది తిరిగి శ్రీ రాముడు శక్తి శక్తివంతం అయ్యాడు తన పై ఉన్న దురాక్రమణ చిహ్నాన్ని తునాతుకలు హిందూ సమాజ సంఘటిత శక్తి ద్వారా చేయించాడు, దేశ ఉన్నతికి పనిచేస్తున్న ఈ యువ భజరంగిలలో నాకు ఆ రాముని ధీరోదాత్తరూపం కనిపిస్తుంది, శ్రీ రాముడు ఈ దేశపు ఆత్మ, భారత జాతి ఆత్మ గౌరవ చిహ్నం, శ్రీ రామ జన్మభూమి పవిత్ర నగరం అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరాన్ని నిర్మించడం అంటే అట్టడుగున ఉన్న దేశ స్వాభిమానాన్ని తిరిగి నిలబెట్టడమే, భారత మాతన తిరిగి విశ్వ గురువు స్థానం లో నిలపడమే అవుతుంది, ఆంగ్లేయులు ఈ దేశాన్ని వదలి పోయిన తర్వాత వారి చిహ్నాలను ఈ దేశం నుండి తొలగించాం, మౌంట్ బాటన్ రోడ్డు రాష్ట్ర పాటి రోడ్డు అయ్యింది, మరి వారి కంటే ముందు మన దేశం పై దురాక్రమణ చేసిన మొఘల్ పాలకుల బానిస చిహ్నాలను మనం ఇంకా మన మాతృభూమి పై ఉండనిద్దమా ? ఇదీ మన ఆత్మ గౌరవాన్ని కించపరిచే అంశం కాదా ? ఇస్లాం దురాక్రమణ దారుల బానిస చిహ్నాలు హిందూ దేశంలో ఉండనికి వీల్లేదు, అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య శ్రీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతాం, ప్రజాస్వామ్య భారత దేశంలో మన చేతిలో ఉన్న పాశుపతాస్త్రం ' ఓటు ' ఆ హక్కు ద్వారా ఈ దేశ పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ద్వారా శ్రీ రామ మందిరాన్ని నిర్మించడానికి వీలుగా 300 పైగా రామ భక్తులను పార్లమెంట్ కు పంపాల్సిన ఆవశ్యకత ఉంది, ఆ దిశలో ఈ కొన్ని రోజులు మన సర్వ శక్తులు కేంద్రీకరించి పని చేస్తారని ఆశిస్తున్నాను"  అని అన్నారు.

మాన్య శ్రీ చంపాథ్ రాయ్ గారి ప్రసంగం సభికులలో నూతన ఉత్సహాన్ని నింపింది, మండుటెండలో దాదాపు 6 గంటల పాటు 15 కిమీ యాత్ర చేసి అలసిపోయిన శరీరాలుతిరిగి శ్రీ రాముని కార్యంలో అంకితమయ్యి నూతనత్వాన్ని కనబరిచాయి.
ఈ కార్యక్రమంలో వేదిక పై మాన్య శ్రీ రాఘవులు గారు విహెచ్పి అంతర్జాతీయ కార్యదర్శి, శ్రీ రామ రాజు గారు, ప్రాంత అధ్యక్షులు, శ్రీ గాళ్ రెడ్డి గారు, ప్రాంత కార్యదర్శి తదితరులు ఉన్నారు.   

Wednesday, 16 April 2014

భాగ్యనగర్ : 3.5 లక్షల మంది యువకులతో విజయవంతంగా భజరంగ్ దళ్ శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర

  • 70 వేల బైక్ లతో దాదాపు 3.5 లక్షల మంది తో వియవంతం అయిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర 
  • గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు సాగిన బైక్ ర్యాలి
  • కాషాయ మాయం అయిన భాగ్యనగరం, పూల జల్లులతో యాత్రకు ఆహ్వానం పలికిన ప్రజలు
  • స్వచ్చందంగా ఆహరం, త్రాగు నీరు, మజ్జిగ అందించిన హనుమత్ భక్తులు
  • యాత్ర కు మార్గదర్శనం చేసిన విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపట్ రాయ్ 

భాగ్యనగర్ , 16/04/2014 : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలి విజయవంతం అయ్యింది, దాదాపు 75 వేల ద్విచక్ర వాహనాలతో దాదాపు మూడు లక్షల మంది యువకుల జై శ్రీరాం , వందే మాతరం, భారత్ మాతా కి కై నినాదాల మధ్య కోలాహలంగా సాగింది.

యాత్ర దారి పొడవున ప్రజలు కొన్ని వందల చోట్ల పూజ జల్లులతో స్వాగతం పలికారు, ఎండ వేడిమికి అనేక చోట్ల శ్రీ రామ భక్తులు యువకులకు మజ్జిగా, చల్లని త్రాగు నీరు, బోజన వసతి ఏర్పాట్లు చేసారు. 

శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా నగరం మొత్తం భగవత్ ధ్వజాలతో కాషాయ మయం అయ్యింది, గౌలీగూడ శ్రీ రామ మందిరం నుండి ప్రారంభం అయిన యాత్ర దాదాపు 15 కిలోమీటర్లు సాగి ప్రఖ్యాత తాడ్ బండ్ హనుమాన్  మందిరం వరకు చేరిన తర్వాత యువకులు భక్తీ శ్రద్ధలతో హనుమాన్ ను దర్శిచుకున్నారు.తర్వాత ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగిన భహిరంగ సభలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ గారు పాల్గొని యువతకు మార్గదర్శనం చేసారు.
ఈ కార్యక్రమం లో శ్రీ రామ రాజు గారు , రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ గాళ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి, శ్రీ కేశవరాజు గారు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి, శ్రీ సుబాష్ చందర్ గారు భజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజకులు, విహిప, భజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.





Monday, 14 April 2014

భాగ్యనగర్ : నేడు 3 లక్షల మందితో యువకులతో భజరంగ్ దళ్ " శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర " - బైక్ ర్యాలి

భాగ్యనగర్, 15/04/2014 : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేడు భాగ్యనగర్(హైదరాబాద్) లో"శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర" జరుగనుంది, ప్రధాన ర్యాలి గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి ప్రారంభమై తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు దాదాపు 20 కిలో మీటర్ల వరకు సాగనుంది.

ఈ శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర లో దాదాపుగా 3 లక్షల మంది యువకులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొనన్నున్నారు, ఈ యాత్ర కు విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపాథ్ రాయ్ గారు హాజరై తమ మార్గ దర్శనం చేయనున్నారు.
ప్రధాన ర్యాలికి అనుబందంగా నగరములోని నలుమూలల నుండి బైక్ ర్యాలీలు ప్రారంభమయి ప్రధాన ర్యాలిలో చేరడం విశేషంగా జరుగుతుంది, ఈ యాత్ర లో పాల్గొనడానికి నగర యువత ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.   

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style