Our amazing new site will launch in

Sunday, 29 September 2013

విజయశ్రీ భవన్,కోఠి లో విహిప అర్చక పురోహిత సమ్మేళనం , పాల్గొన్న హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు

భాగ్యనగర్ , కోఠి  29/09/2013 : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం , కోఠి , భాగ్యనగర్ ( హైదరాబాద్ ) లో విహిప అర్చక పురోహిత విభాగం ప్రాంత స్థాయి కార్యకర్తల సమావేశం 29/09/2013 నాడు జరిగింది , ఈ సమావేశానికి మాన్య శ్రీ రామరాజు గారు విహిప ప్రాంత అధ్యక్షులు అధ్యక్షత వహించగా ,విహిప ప్రాంత ప్రచార ప్రాముఖ్ తుంగేడుగుంట హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు .
రామరాజు గారు మార్గదర్శనం చేస్తూ ' వచ్చే సంవత్సరం విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి సందర్భంగా మనం ప్రతి ఇంటిని చేరగలగాలి , ప్రతి హిందువు మదిలో రాష్ట్ర భక్తీ , రామ భక్తీ నింపాల్సిఉంది , కేవలం హిందూ సంఘటన కార్యం మాత్రమె ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలపగల్గుతుంది, హిందువుల శ్ర్తద్డ కేంద్రాల ద్వారా సంస్కారం నిర్మాణం జరుగుతుంది , ఆ శ్రద్ద కేంద్రాల ప్రత్యక్ష నిర్వాహకులుగా ఈ దిశలో మనం చేయాల్సిన పని ఎంతో ఉంది , ఆ కార్యానికై మనం ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాల్సి ఉంది ' అని అన్నారు .

హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు దిశానిర్దేశం చేస్తూ ' నేడు హిందుత్వం మందిరాల మాధ్యమం గానే నిలబడి ఉంది , అలాంటి మందిర నిర్వాహకులుగా అర్చకులు , పురోహితులు తరతరాలుగా హిందూ సమాజానికి ధర్మసంబంద విషయాలలో మార్గదర్శకులుగా ఉంటూ వస్తున్నారు , పురోహితుని కేంద్రంగా గుడి , ఆ గుడి కేంద్రంగా ఒక బడి , ఈ రెండింటి ఆధారంగా ఆదర్శ సమాజ నిర్మాణం ఇది హిందూ ఆరాధనా కేంద్రాల లక్షణం, లక్ష్యం . హిందూ కుటుంబ వ్యవస్థలో , హిందువుల వ్యక్తిత్వ వికాసం లో , ప్రపంచంలో లోని అన్ని మతాల లోకెల్లా హిందూ ధర్మాన్ని సర్వ శ్రేష్టంగా నిలపడం లో ఆలయాలు విశిష్ట పాత్రను నిర్వహించాయి , భారత స్వరాజ్య సంగ్రామం లో దేవాలయాలు యుద్ధ వీరుల శిక్షణ కెంద్రాలయ్యాయి , దేశ భక్తుల ఆవాసలయ్యాయి, ఆలాంటి మందిరం ద్వార తిరిగి ఒక సారి హిందూ ధర్మ జాగరణ , సంఘటన జరగాలి ' అని అన్నారు .
ఈ కార్యక్రమం లో విహిప ప్రాంత కార్యదర్శి మాధవరెడ్డి గారి గాల్ రెడ్డి గారు ప్రాంత కార్యదర్శి , ఆకారపు కేశవా రాజు గారు ప్రాంత సంఘటన కార్యదర్శి , యాదగిరి రావ్ గారు క్షేత్ర గో - రక్షా ప్రాముఖ్ తదితరులు పాల్గొన్నారు .          

Saturday, 14 September 2013

తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయం - దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు !

  • చంద్ర గిరి సమీపంలో నిర్మాణ పనులు
  • దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు
  • హిందూ ధార్మిక ప్రాంతంలో అన్యమతానికి చోటా?
  • నిధుల సేకరణకు విదేశాల్లో ప్రచారం
  • ఇది అంతర్జాతీయ కుట్ర,ప్రభుత్వ పాత్రా ఉంది
హైదరాబాద్, తిరుపతి, సెప్టెంబర్ 13 : ఏడుకొండల వాడి నిలయమైన తిరుపతి కొండల్లో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ కుట్రేనని బీజేపీ ఆరోపించింది. నౌహెరా షేక్ అనే మహిళ పేరిట గుట్టు చప్పుడు కాకుండా విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు సాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థలంలోనే దీన్ని నిర్మిస్తున్నారని, ప్రభుత్వానికి ఇదంతా తెలియకుండా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే చంద్రగిరి శ్రీవారి మెట్టు సమీపంలో "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజీ'' పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఉర్దూ అరబిక్ పాఠశాల, మదర్సా అని ప్రచారం చేస్తూ దీని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నౌహెరా షేక్ చైర్మన్‌గా గల హీరా ఉర్దూ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవాదాయ శాఖ స్థలంలో 2011 నుంచి దీని పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. ఇదే సొసైటీ పేరిట విశ్వ విద్యాలయ స్థలంలో కాలేజీని, మదర్సాను, అరబిక్ ఉర్దూ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ వెబ్‌సైట్‌లో ఘనా, చైనా, కెనడా వంటి దేశాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తిరుపతిలో పెట్టామని చెబుతూ విదేశాల నుంచి నిధులు, వనరులు రాబడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతిలో పుట్టిన నౌహెరా షేక్ పేరును ఈ కార్యకలాపాలకు పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అవగతమవుతుంది'' అని ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి, నేతలు సామంచి శ్రీనివాస్, మధుసూదన్, నాగేశ్వర్‌రావు తిరుపతిలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల ముసుగులో తిరుమల-తిరుపతిలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి విధ్వంసం చేసే అవకాశం ఉందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు.


ఇంతకీ ఏం జరుగుతోంది?
తిరుపతికి పది కిలోమీటర్ల సమీపంలో చంద్రగిరి మండలం, తొండవాడ వద్ద హీరా అంతర్జాతీయ ఇస్లామిక్ కాలేజీ పేరుతో 1.09 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించారు. చుట్టూ 12 అడుగలు ఎతైన ప్రహరీ గోడ నిర్మించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. భవన నిర్మాణానికి తుడ అనుమతి కూడా తీసుకున్నారు. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు, ఇస్లాం మత బోధనల కోసమే ఈ కళాశాలను స్థాపిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

దీని వ్యవస్థాపకురాలు నౌహీర్ చాలా ఏళ్లుగా రేణిగుంట సమీపంలో మదర్సాను నడుపుతున్నారు. గతంలో ఆమె ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అక్కడి పరిచయాలతోనే ఇస్లామిక్ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సంస్థ పేరుతో ఉన్న హీరాఐబీజీ.కామ్‌లోని వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చైనా సహా ఐదు దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వీటి వార్షికోత్సవాలు, షేర్ హోల్డర్ల సమావేశాలన్నీ ముంబై కేంద్రంగా జరుగుతున్నట్లు వైబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Heera Business Gruops Web Site : http://heeraibg.com/heeraibg/
Heera International Islamic School Web Site : http://heeraiisg.com/index.php
Heera International islamic Collage Web Site : http://heerauniversity.com/

VHP Remembers legacy of KS Sudarshan on the First Death Anniversary

VHP, RSS Swayamsevaks, well wishers, thinkers of different spectrum remembering KS Sudarshan, former RSS Sarasanghachalak on his first death anniversary.
KS Sudarshan, RSS foermer Sarasanghachalak
KS Sudarshan, RSS foermer Sarasanghachalak
Born on June 18th 1931,  Kuppalli Sitaramayya Sudarshan, became 5th RSS Sarasanghachalak of RSS, served from 2000 to 2009. Sudarshan was considered to be one of greatest known Hindutva ideologue in India , passed away on September 15, 2012 at Raipur last year.
Here are some compilation of articles on Sudarshan:

KS Sudarshan- A leader who broke barriers : writes TARUN VIJAY

Vajapeyi and Others national leaders on Sudarshanji

My uncle Sudarshanji, a person of deep and rock-solid conviction; writes Sameer Kuppahalli

Ex-RSS chief Sudarshan reached out to Muslims: Khaleej Times


Church’s Arch Bishop praises Sudarsanji’s effort on Social Harmony

NAGPUR: With heavy waves of emotions, Funeral of Sudarshanji held, brother performs last rites


Thursday, 12 September 2013

' ముజఫర్ నగర్ అల్లర్ల వెనుక వరుస హత్యాచారాలు ' : ఇండియా వైర్ విశ్లేషనాత్మక కథనం


ముజఫర్ నగర్ , ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన మత ఘర్షణల నేపథ్యాన్ని చూస్తే గత కొన్ని రోజులగా పట్టణం లో జరిగిన సంఘటనలు , ఒక ఈవ్ టీసింగ్ ఘటన మరియు ఒక యుటుబ్ వీడియో మాత్రమే కారణం కాగలవ ? అన్న సంశయం అందరికి వస్తుంది , దానికి సమాధానం కోసం  గత సంవత్సర కాలంగా ముజఫర్ నగర్ పట్టణం లో జరిగిన వరుస అత్యాచారాలు వాటిని సమర్థిస్తూ చేసిన రాజకీయం లాంటి అంశాలను చూడాల్సిఉంది 
.
   
 
వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల క్రమం   : 
  • 21-Dec-2012 : ఒక హత్యాచార బాదితురాలికి ఈ విషయాన్ని దాచడం కోసం రూ 1.5 లక్షలు ఆశచూపింది ముజఫర్ నగర్ పంచాయితీ ( పూర్తీ వివరాలకు )
  • 24-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఒక మైనరు బాలిక ముగ్గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది  పూర్తీ వివరాలకు )
  • 26-Dec-2012 : పాఠశాలలో చదివే అమ్మాయి పై ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేసాడు . ( పూర్తీ వివరాలకు ) 
  • 30-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఆగంతకులు చేసిన యాసిడ్ దాడిలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు ( పూర్తీ వివరాలకు ) 
  • 18-Feb-2013 : ముజఫర్ నగర్ లో ఒక మహిళ నలుగురు వ్యక్తుల చేటిలో సాముహిక అత్యాచారానికి గురైంది , ఆ అత్యాచారాన్ని విడియో తీసారు ( పూర్తీ వివరాలకు)
  • 03-Apr-2013 : ముజఫర్ నగర్ లో ముగ్గురు ఉపాధ్యాయినిలు , ఒక విద్యార్తి పై యాసిడ్ దాడి జరిగింది ( పూర్తీ వివరాలకు )
  • 03-Jun-2013 : ఒక మైనరు బాలిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు )
  • 05-Jul-2013 : సాముహిక అత్యాచార నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తీ ఆత్మాహుతికి పాల్పడ్డారు ( పూర్తీ వివరాలకు  )
  • 29-Jul-2013 : మహిళ బలవంతంగా పెళ్లిచేసుకోబడి తర్వాత సాముహిక అత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు ) 
  • 23-Aug-2013 : ఒక పాఠశాల విద్యార్థిని 5 గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు ) 
  • 24-Aug-2013 : 9 వ తరగతి చదివే అమ్మాయి యువకుని చేతిలో హత్యాచారం చేయబడింది ( పూర్తీ వివరాలకు ) 
  • 27-Aug-2013 : కావాల్ గ్రామంలో జరిగిన ఒక ఈవ్ టీసింగ్ ఘటన మూడు బైక్ ల దగ్దానికి , ఘర్షణకు దారి తీసింది . 
  • 30-Aug-2013 : 11 సంవత్సరాల అమ్మాయి పై లైంగిక దాడి చేసిన ఘటనలో ఒక ముస్లీం మత పెద్ద అరెస్టు అయ్యారు ( పూర్తీ వివరాలకు )
  • 30-Aug-2013 : శుక్రవార ప్రార్థన ల అనతరం అల్లరిముక ల భారి సమూహం షహీద్ చౌక్ లో సమావేశమయి అటుగా వెళ్తున్న మహిళా భక్తుల పై దాడి చేయడం జరిగింది .
  • 31-Aug-2013 : నంగల మందౌద్ పంచాయితీలో దాదాపు 40,000 మంది సమావేశమయ్యారు , ఖతిమ రోడు లో కారులో వెళ్తున్న ఒక కుటుంబం పై దాడి జరిగింది , కారు దగ్దం చేయబడింది .
  • 01-Sep-2013 : దాడికి గురైన కుటుంబం ఆత్మాహుతి హెచ్చరికలతో , షహీద్ చౌక్ సమావేశంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన ఇద్దరు నాయకులో FIR నమోదు చేయడం జరిగింది .
  • 02-Sep-2013 : సంఝాక్ మరియు తివ్తి లలో దేవాలయాల గోడలు ద్వంసం చేయబడ్డాయి , BJP ముజఫర్ నగర్ బందు కు పిలుపునిచ్చింది .
  • 03-Sep-2013 : కావాల్ లో జరిగింది అంటూ చేసిన అసత్యపు విడియో ప్రచారామ్ పై పొలిసు కేసు నమోదు చేయబడింది , శామ్లి నగరం లో హింస చేల రేగింది .
  • 04-Sep-2013 : ముజఫర్ నగర్ లో చెదురు-మదురు హింసాత్మక సంఘటనలు జరిగాయి .
  • 05-Sep-2013 : ముజఫర్ నగర్ జిల్లా మహా బందుకు ఖప్ పంచాయితీ (అక్కడి జాట్ తెగకు సంబందిచి అత్యన్నత నిర్ణాయక మండలి ) పిలుపు నివ్వడం జరిగింది , తేది 07-Sep-2013 న నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించ నోతున్నట్లు ప్రకటించడం జరిగింది .
  • 07-Sep-2013 : ముందుగా ప్రకటించిన విధంగానే నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించబడినది , దాదాపు లక్షా ఇరవై వేల మంది దీనిలో పాల్గొన్నారు , పాల్గొని తిరిగి వెళ్తున్న వారి పై దాడులు జరిగాయి .
  • ముజఫర్ నగర్ లో కాల్పులు జరిగాయి , హింసాయుత వాతావరణం నెలకొని ఉండటంతో సైన్యం కర్ప్యు విధించింది , ఇప్పటి వరకు జరిగిన ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు .
Source: www.samvada.org   

Wednesday, 11 September 2013

సెప్టెంబర్ 11, 1893: విశ్వ మత మహాసభలలో స్వామి వివేకానంద అద్భుత ప్రసంగం ( పూర్తీ పాఠం తెలుగు లో)

సెప్టెంబర్ 11 , 1893 : సర్వ మత మాహాసభలు చికాగో లో స్వామి వివేకుడు  పాల్గొన్నపటి దృశ్యం  

అమెరికన్ సోదర సోదరీ మణులారా , ( 7000 మంది ఉపస్థితుల నుండి 3 నిమిషాల పాటు ఆగకుండా కర తాళ ధ్వనులు మ్రోగాయి )
నాకు మీరిచ్చిన మనోపుర్వక స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు మహానందదాయకం ప్రపంచం లోకెల్లా అత్యంత పురాతన మైన సనాతన ధర్మం తరపున మీకు నా అభివాదాలు , సమస్త మతాలకు , సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన దర్మం పేర మీకు నా అభివాదాలు , అనేక జాతులతో , అనేక సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు .
సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనతా గౌరవమూ సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందడం ఏంటో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభా వేదిక నుండి  మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు , సహనాన్ని , సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను . సర్వమత సహనాన్నే కాక , సర్వ మతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త మత సమస్త దేశాల నించీ పరపీడితులై , శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి వచ్చి శరణు పొందిన యూదులను - నిజమైన యుడులనదగ్గవారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకోన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను .
సోదరులారా ప్రతీ రోజు కోట్లాది మానవులచే పారాయణ గావించబడే స్తోత్రం నుండి , అతి బాల్యం నుండి నేను పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలు ఉదహరిస్తాను: " వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించినంట్లే , వివిధ భావాలచే  మనుషులు  అవలంభించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై కనబడిన , అవక్రాలై కనబడిన , సర్వేశ్వరా , నిన్నే చేరుతున్నవి ."
" ఎవరు ఎ రూపంలో నన్ను గ్రహిస్తారో , నేను వారి నాలాగే అనుగ్రహిస్తూన్నాను. ఎల్లరూ సమస్త మార్గాలచేతను తుదకు నన్నే చేరుతున్నారు " అని గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్ధాంతాన్ని ప్రపంచములో మహోన్నత సమావేశాలలో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ , ముక్త కంఠమతో లోకానికి చాటుతుందని చెప్పనొప్పుతుంది, శాఖాభిమానం, స్వ మత దురభిమానం, దాని వాళ్ళ జనించిన మూర్ఖాభావేషము  సుందరమైన యీ  జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నది . భూమిని అవి దౌర్జన్యమయం గావించి, అనేక పర్యాయాలు మనవ రక్తసిక్తం చేసాయి . ఈ ఘోర రాక్షసులు చేలరేగి వుండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేశాభివృద్ది పొంది ఉండేది . కాని వాటి అవసాన సమయం ఆసన్నమైనది, ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ విధాలైన స్వ మత దురభిమాననికి పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి , కలంతో గానివ్వండి, సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమెకాక, ఒక్క గమ్యన్నే ప్రా పెంచబోయే జనం కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను .

Monday, 2 September 2013

భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు హిందూ సంఘటితాత్మక శక్తికి ప్రతీక నిలుస్తున్నాయి : మాన్య శ్రీ అశోక్ సింఘాల్ (అంతర్జాతీయ సంరక్షకులు )

భాగ్యనగర్ 02/09/2013  : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక నిజాం కళాశాల  మైదానం జరిగిన బహిరంగ సభకు భారి ఎత్తున గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ సంరక్షకులు మాన్య శ్రీ అశోక్ సింఘాల్ గారు హాజరయ్యారు , ఈ సభకు అతిథులుగా కమలానంద భారతి, పరిపుర్ణానంద స్వామి, గో సంరక్షణ సమితి నుంచి నిర్వలా యోగానంద భారతి, దత్తాత్రేయ పీఠాధిపతి అవదూత రామకృష్ణానంద స్వామి తదితరులు హాజరయ్యారు. సమితి అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ్ రెడ్డి గారు (విహిప అంతర్జాతీయ అధ్యక్షులు ) సభకు అధ్యక్షత వహించారు . 
భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు - హిందూ సంఘటనాత్మక శక్తికి నిదర్శనం : మాన్య శ్రీ అశోక్ సింఘాల్ 
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన మాన్య శ్రీ అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషద్ సంరక్షకులు మార్గదర్శం చేస్తూ " భాగ్యనగర్ లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ ఉత్సవాలు హిందూ సంఘటనత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి , ఈ ఉత్సవాలు ఇంత భారిగా జరుగడానికి ముందు భాగ్యనగర్ లో చీటికి మాటికి హిందువుల పై దాడులు జరుగుతూఉండేవి, నిర్భందాలు ఉండేవి కాని ఒక్కసారి సంఘటిత హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసిన తర్వాత ఈ పరిస్థితి మారింది , ఇది చాల శుభసూచకం , లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సాముహిక గణేష్ ఉత్సవాల ద్వార సమాజం నుండి ఆశించిన మార్పు ఇదే" అని అన్నారు    
హిందూ శ్రద్ద కేంద్రాల పై వ్యూహాత్మక దాడి జరుగుతుంది : స్వామి పరిపూర్ణా నంద 
తదుపరి శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణ నంద సరస్వతి మాట్లాడుతూ "  హిందూ మతంపై, సంస్కృతిపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి , మత మార్పిడీల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది , వాటిని అరికట్టడానికి హిందూ జాతి సదా జాగృతంగా ఉండాలి , ప్రభుత్వాలు వ్యూహాత్మకంగానే హిందూ శ్రద్ద కేంద్రాలపై దాడులు చేస్తూ అశేష హిందూ సమాజ మనో భావాలతో ఆడుకుంటున్నాయి , ఇది చాల దురదృష్టకరం దానిలో భాగంగానే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని చేత నిర్మిత శ్రీరామ సేతు ను కూల్చడం , పవిత్ర గంగానది ని ప్రక్షలనలో నిర్లక్షం వహించడం , సామూహికంగా జరుపుకునే హిందూ ఉత్సవాల పై అక్రమ నిబందనలు విధించడం లాంటి పనులు చేస్తున్నాయి , వీటన్నిటి నుండి హిందూ సమాజన్ని , హిందూ దేశాన్ని రక్షిచుకోవడానికి కేవలం హిందూ ఓటు బ్యాంకును నిర్మాణం చేయడమే పరిష్కారం " అంటూ స్వామీజీ చేసిన ఉపన్యాసం ప్రతి ఒక్కరిని హిందూ ఓటు బ్యాంకు దిశగా ఆలోచించేల స్పూర్తి నిచ్చింది .  
అంగరంగ వైభవంగా హిందూ గణేష్ ఉత్సవాలు జరగాలి : స్వామి కమలానంద భారతి 
శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ ' హిందూ సామజిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలి , సమాజం లోని క్రింది స్థాయి కి ఈ ఉత్సవాలు చేరాలి , హిందూ సమాజం నుండి అస్పృశ్యత పూర్తిగా తొలగిపోవాలి ,  సమాజం లో ఉన్న కొన్ని రుగ్మతలు ఈ ఉత్సవాల మాధ్యమంగా తొలగిపోవాలి ,  హిందువులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి , అలాగే హిందువులకు శ్మశాన వాటికల కోసం ప్రతీ గ్రామంలో ప్రభుత్వం భూమినివ్వాలి,  గత కొన్ని సంవత్సరాల క్రితం గణేష్ ఉత్సవాలు అంటే కేవలం జల్సాకు వేదికగా ఉండేది , కాని ఇప్పుడు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో జాతీయ వాద ఉత్సవం గా మారింది , సినిమా పాటల స్థానే దేశ భక్తీ పాటలు వినిపిస్తున్నాయి , పిచ్చి నృత్యాల స్థానే భజన కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి . ఈ ఉత్సవాలు ఇలాగే కొనసాగి భాగ్యనగరం - నిజంగా భాగ్యవంతం కావాలని ఆ వాక్రతుండుని పార్తిస్తున్నాను " అని అన్నారు.
గణేష్ మండపాల నిర్వహణకు  పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి : మాన్య రాఘవ రెడ్డి 
తదుపతి మాన్య రాఘవరెడ్డి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ' భాగ్యనగర్ గణేష్ ఉత్సవం ఒక ట్రెండ్ సెట్టర్ అయింది ఒక చరిత్రను నిర్మించింది , ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాయి , హైదరాబాద్ కు ఇంతటి కీర్తిని ఆపాదించిన గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వాం తన నిర్లక్ష్య పురిత వైఖరిని విడనాడాలి , నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నాను , 

  • గణేష్ మందప నిర్వకులపై పోలిసుల వేదింపులు వెంటనే ఆపాలి .
  • గణేష్ మండపాలకు పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి . 
  • గణేష్ మండపాలకు వెంటనే ప్రభుత్వ పర అనుమతులు ఇవ్వాలి .
  • విగ్రహాల పై దాడులు చేసే ముష్కర ముకలపై వెంటనే చట్టబద్ద చర్యలకు పూనుకోవాలి 
గణేష్ మందప నిర్వాహకులకు కూడా కొన్ని సూచనలు ఇస్తాను దయచేసి వాటిని తు చ తప్పక పాటించాలి .

  • ప్రతి గణేష్ మండపం పై భగవత్వజం ఎరుగావేయాలి .
  • స్వామి వివేకానంద 150 జయంతి సంవత్సరం అయినందున ప్రతి మండపం దగ్గర పెద్ద స్వామీజీ పోటోను పెట్టాలి .
  • జాతీయవాదాన్ని మేల్కొల్పే కార్యక్రమాలను రూపొందించాలి .
ఈ ఉత్సవాల మాధ్యమంగా భాగ్యనగర్ లో ప్రతి డివిజన్ నుండి హిందూ జాతి గర్వ పడే నాయకులు నిర్మాణం కావాలి , ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను మరింత స్పూరివంతంగా నిర్వహించేందుకు సహకరించాలి " అని అన్నారు 

దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే భజరంగ్ దళ్ ను పంపుతాం : స్వామి చిన్మయానంద 
ఈ సందర్భంగా చిన్మయానంద మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా రామ జన్మభూమి అయోధ్యలో ర్యాలీలు నిర్వహించుకోవడానికి కూడా హిందువులకు హక్కు లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా దేశం ఇంకా ఆంగ్లేయుల పాలనలోనే ఉందని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style