Our amazing new site will launch in

Wednesday, 11 September 2013

సెప్టెంబర్ 11, 1893: విశ్వ మత మహాసభలలో స్వామి వివేకానంద అద్భుత ప్రసంగం ( పూర్తీ పాఠం తెలుగు లో)

సెప్టెంబర్ 11 , 1893 : సర్వ మత మాహాసభలు చికాగో లో స్వామి వివేకుడు  పాల్గొన్నపటి దృశ్యం  

అమెరికన్ సోదర సోదరీ మణులారా , ( 7000 మంది ఉపస్థితుల నుండి 3 నిమిషాల పాటు ఆగకుండా కర తాళ ధ్వనులు మ్రోగాయి )
నాకు మీరిచ్చిన మనోపుర్వక స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు మహానందదాయకం ప్రపంచం లోకెల్లా అత్యంత పురాతన మైన సనాతన ధర్మం తరపున మీకు నా అభివాదాలు , సమస్త మతాలకు , సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన దర్మం పేర మీకు నా అభివాదాలు , అనేక జాతులతో , అనేక సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు .
సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనతా గౌరవమూ సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందడం ఏంటో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభా వేదిక నుండి  మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు , సహనాన్ని , సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను . సర్వమత సహనాన్నే కాక , సర్వ మతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త మత సమస్త దేశాల నించీ పరపీడితులై , శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారత దేశానికి వచ్చి శరణు పొందిన యూదులను - నిజమైన యుడులనదగ్గవారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకోన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను .
సోదరులారా ప్రతీ రోజు కోట్లాది మానవులచే పారాయణ గావించబడే స్తోత్రం నుండి , అతి బాల్యం నుండి నేను పారాయణ చేస్తున్న ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలు ఉదహరిస్తాను: " వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించినంట్లే , వివిధ భావాలచే  మనుషులు  అవలంభించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై కనబడిన , అవక్రాలై కనబడిన , సర్వేశ్వరా , నిన్నే చేరుతున్నవి ."
" ఎవరు ఎ రూపంలో నన్ను గ్రహిస్తారో , నేను వారి నాలాగే అనుగ్రహిస్తూన్నాను. ఎల్లరూ సమస్త మార్గాలచేతను తుదకు నన్నే చేరుతున్నారు " అని గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్ధాంతాన్ని ప్రపంచములో మహోన్నత సమావేశాలలో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ , ముక్త కంఠమతో లోకానికి చాటుతుందని చెప్పనొప్పుతుంది, శాఖాభిమానం, స్వ మత దురభిమానం, దాని వాళ్ళ జనించిన మూర్ఖాభావేషము  సుందరమైన యీ  జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నది . భూమిని అవి దౌర్జన్యమయం గావించి, అనేక పర్యాయాలు మనవ రక్తసిక్తం చేసాయి . ఈ ఘోర రాక్షసులు చేలరేగి వుండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేశాభివృద్ది పొంది ఉండేది . కాని వాటి అవసాన సమయం ఆసన్నమైనది, ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వ విధాలైన స్వ మత దురభిమాననికి పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి , కలంతో గానివ్వండి, సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమెకాక, ఒక్క గమ్యన్నే ప్రా పెంచబోయే జనం కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను .

Monday, 2 September 2013

భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు హిందూ సంఘటితాత్మక శక్తికి ప్రతీక నిలుస్తున్నాయి : మాన్య శ్రీ అశోక్ సింఘాల్ (అంతర్జాతీయ సంరక్షకులు )

భాగ్యనగర్ 02/09/2013  : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక నిజాం కళాశాల  మైదానం జరిగిన బహిరంగ సభకు భారి ఎత్తున గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ సంరక్షకులు మాన్య శ్రీ అశోక్ సింఘాల్ గారు హాజరయ్యారు , ఈ సభకు అతిథులుగా కమలానంద భారతి, పరిపుర్ణానంద స్వామి, గో సంరక్షణ సమితి నుంచి నిర్వలా యోగానంద భారతి, దత్తాత్రేయ పీఠాధిపతి అవదూత రామకృష్ణానంద స్వామి తదితరులు హాజరయ్యారు. సమితి అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ్ రెడ్డి గారు (విహిప అంతర్జాతీయ అధ్యక్షులు ) సభకు అధ్యక్షత వహించారు . 
భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు - హిందూ సంఘటనాత్మక శక్తికి నిదర్శనం : మాన్య శ్రీ అశోక్ సింఘాల్ 
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన మాన్య శ్రీ అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషద్ సంరక్షకులు మార్గదర్శం చేస్తూ " భాగ్యనగర్ లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ ఉత్సవాలు హిందూ సంఘటనత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి , ఈ ఉత్సవాలు ఇంత భారిగా జరుగడానికి ముందు భాగ్యనగర్ లో చీటికి మాటికి హిందువుల పై దాడులు జరుగుతూఉండేవి, నిర్భందాలు ఉండేవి కాని ఒక్కసారి సంఘటిత హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసిన తర్వాత ఈ పరిస్థితి మారింది , ఇది చాల శుభసూచకం , లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సాముహిక గణేష్ ఉత్సవాల ద్వార సమాజం నుండి ఆశించిన మార్పు ఇదే" అని అన్నారు    
హిందూ శ్రద్ద కేంద్రాల పై వ్యూహాత్మక దాడి జరుగుతుంది : స్వామి పరిపూర్ణా నంద 
తదుపరి శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణ నంద సరస్వతి మాట్లాడుతూ "  హిందూ మతంపై, సంస్కృతిపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి , మత మార్పిడీల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది , వాటిని అరికట్టడానికి హిందూ జాతి సదా జాగృతంగా ఉండాలి , ప్రభుత్వాలు వ్యూహాత్మకంగానే హిందూ శ్రద్ద కేంద్రాలపై దాడులు చేస్తూ అశేష హిందూ సమాజ మనో భావాలతో ఆడుకుంటున్నాయి , ఇది చాల దురదృష్టకరం దానిలో భాగంగానే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని చేత నిర్మిత శ్రీరామ సేతు ను కూల్చడం , పవిత్ర గంగానది ని ప్రక్షలనలో నిర్లక్షం వహించడం , సామూహికంగా జరుపుకునే హిందూ ఉత్సవాల పై అక్రమ నిబందనలు విధించడం లాంటి పనులు చేస్తున్నాయి , వీటన్నిటి నుండి హిందూ సమాజన్ని , హిందూ దేశాన్ని రక్షిచుకోవడానికి కేవలం హిందూ ఓటు బ్యాంకును నిర్మాణం చేయడమే పరిష్కారం " అంటూ స్వామీజీ చేసిన ఉపన్యాసం ప్రతి ఒక్కరిని హిందూ ఓటు బ్యాంకు దిశగా ఆలోచించేల స్పూర్తి నిచ్చింది .  
అంగరంగ వైభవంగా హిందూ గణేష్ ఉత్సవాలు జరగాలి : స్వామి కమలానంద భారతి 
శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ ' హిందూ సామజిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలి , సమాజం లోని క్రింది స్థాయి కి ఈ ఉత్సవాలు చేరాలి , హిందూ సమాజం నుండి అస్పృశ్యత పూర్తిగా తొలగిపోవాలి ,  సమాజం లో ఉన్న కొన్ని రుగ్మతలు ఈ ఉత్సవాల మాధ్యమంగా తొలగిపోవాలి ,  హిందువులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి , అలాగే హిందువులకు శ్మశాన వాటికల కోసం ప్రతీ గ్రామంలో ప్రభుత్వం భూమినివ్వాలి,  గత కొన్ని సంవత్సరాల క్రితం గణేష్ ఉత్సవాలు అంటే కేవలం జల్సాకు వేదికగా ఉండేది , కాని ఇప్పుడు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో జాతీయ వాద ఉత్సవం గా మారింది , సినిమా పాటల స్థానే దేశ భక్తీ పాటలు వినిపిస్తున్నాయి , పిచ్చి నృత్యాల స్థానే భజన కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి . ఈ ఉత్సవాలు ఇలాగే కొనసాగి భాగ్యనగరం - నిజంగా భాగ్యవంతం కావాలని ఆ వాక్రతుండుని పార్తిస్తున్నాను " అని అన్నారు.
గణేష్ మండపాల నిర్వహణకు  పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి : మాన్య రాఘవ రెడ్డి 
తదుపతి మాన్య రాఘవరెడ్డి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ' భాగ్యనగర్ గణేష్ ఉత్సవం ఒక ట్రెండ్ సెట్టర్ అయింది ఒక చరిత్రను నిర్మించింది , ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాయి , హైదరాబాద్ కు ఇంతటి కీర్తిని ఆపాదించిన గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వాం తన నిర్లక్ష్య పురిత వైఖరిని విడనాడాలి , నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నాను , 

  • గణేష్ మందప నిర్వకులపై పోలిసుల వేదింపులు వెంటనే ఆపాలి .
  • గణేష్ మండపాలకు పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి . 
  • గణేష్ మండపాలకు వెంటనే ప్రభుత్వ పర అనుమతులు ఇవ్వాలి .
  • విగ్రహాల పై దాడులు చేసే ముష్కర ముకలపై వెంటనే చట్టబద్ద చర్యలకు పూనుకోవాలి 
గణేష్ మందప నిర్వాహకులకు కూడా కొన్ని సూచనలు ఇస్తాను దయచేసి వాటిని తు చ తప్పక పాటించాలి .

  • ప్రతి గణేష్ మండపం పై భగవత్వజం ఎరుగావేయాలి .
  • స్వామి వివేకానంద 150 జయంతి సంవత్సరం అయినందున ప్రతి మండపం దగ్గర పెద్ద స్వామీజీ పోటోను పెట్టాలి .
  • జాతీయవాదాన్ని మేల్కొల్పే కార్యక్రమాలను రూపొందించాలి .
ఈ ఉత్సవాల మాధ్యమంగా భాగ్యనగర్ లో ప్రతి డివిజన్ నుండి హిందూ జాతి గర్వ పడే నాయకులు నిర్మాణం కావాలి , ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను మరింత స్పూరివంతంగా నిర్వహించేందుకు సహకరించాలి " అని అన్నారు 

దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే భజరంగ్ దళ్ ను పంపుతాం : స్వామి చిన్మయానంద 
ఈ సందర్భంగా చిన్మయానంద మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా రామ జన్మభూమి అయోధ్యలో ర్యాలీలు నిర్వహించుకోవడానికి కూడా హిందువులకు హక్కు లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా దేశం ఇంకా ఆంగ్లేయుల పాలనలోనే ఉందని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు

Monday, 26 August 2013

వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు

  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విహిప నేతృత్వం లో  హిందూ సమాజం, రాష్ట్రం లోని అన్ని జిల్లాల ముఖ్య పరిపాలన కార్యాలయ ముందు ధర్నాలు 
  • 'గత 1000 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుంది , ఎవ్వరు అడ్డుకోలేరు ' రాజ్ భవన్ ముందు ధర్నా లో మాన్య శ్రీ వై రాఘవులు
  • 'హిందూ సమాజ ధార్మిక శక్తి ముందు ప్రభుత్వ నిర్భందం తలవంచక తప్పదు' - సుధాంశు మోహన్ పట్నాయక్    


విజయశ్రీ భవన్, కోటి , భాగ్యనగర్ 26/08/2013 : " అయోధ్యజి హమ్ ఆఎంగ్యే " అని నినదిస్తూ దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల నేతృత్వంలో నిర్వహించతలపెట్టిన 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌళిక మరియు రాజ్యాంగబద్ధ ప్రాథమిక హాక్కులను కాలరాస్తూ విధించిన అక్రమ నిషేదాన్ని వ్యతిరేకిస్తూ , యాత్ర ప్రారంభం సందర్భంగా ధర్మాచార్యుల పై మరియు విశ్వ హిందూ పరిషద్ నాయకులపై జరిపిన దౌర్జన్యపూరిత దాడిని , నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ , మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ఇచ్చిన పిలుపులో భాగంగా హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసింది , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన పరిపాలన కార్యాలయాలు మరియు అన్ని సహా పరిపాలన కార్యాలయాల ముందు జరిగిన ధర్నా, నిరసన కార్యక్రమాలలో హిందూ సమాజం పెద్ద ఎత్తున పాల్గొని ' హిందూ సాధువులపై జరిగే దౌర్జన్యాన్ని సహించేది లేదు ' అని నినదించారు . రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో సుమారు 10000 మంది మంది ధర్నాలలో పాల్గొన్నారు .

రాష్ట్ర స్థాయిలో భాగ్యనగర్ లో రాజ్ భవన్ ముందు జరిగినధర్నా లో సుమారు 3500 మంది రామ భక్తులు పాల్గొన్నారు , గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ వ్తక్తిగత కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందిచడం జరిగింది. ఈ సందర్భంగా మాన్య శ్రీ వై రాఘవులు గారు ( అంతర్జాతీయ సంయుక్త  కార్యదర్శి విశ్వ హిందూ పరిషద్ ) మాట్లాడుతూ " గత 1000 సంవత్సరాలుగా ధార్మిక పరంపరలో భాగంగానే 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నిర్వహించబడుతుంది , ఈ యాత్ర కేవలం ఈ ఏడూ మాత్రమె ఆయోజితం అయినది కాదు , కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమె ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం , ఒక వర్గానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ కర్కశంగా ఈ పరిక్రమ పై నిషేధం విధించింది , ధర్మాచార్యులను నిర్భందించింది , కనీసం భారత రాజ్యాంగం కలిపించిన మౌలిక హాక్కులను కూడా యుపి ప్రభుత్వం  నిలబెట్టలేక పోయింది , దేశ వ్యాప్తంగా ఇంత ప్రతిక్రియ వ్యక్తం అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ ధార్మిక యాత్ర పై నిషేధం ఎత్తివేయకపోతే సాదు సంతుల ధర్మాగ్రనికి గురి కాకతప్పదు" అని అన్నారు ,    
తదననతరం మాన్య శ్రీ సుధాంశు మోహన్ పట్నాయక్ ( దక్షిణ భారత సంఘటన మంత్రి ) మాట్లాడుతూ " కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించడమే లౌకికవాదం గా మారింది , వోటు బ్యాంకు రాజకియలకోసం ప్రభుత్వాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఇక ఇది ఎంత మాత్రము సహన యోగ్యము కాదు , ఈ నిర్భందాలు , ధర్మాచార్యుల పట్ల అగౌరవకరమైన ప్రవర్తన ఎంతమాత్రము సమ్మతముకాదు , హిందూ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఉంది , కేవలం ప్రతి రోజు 150-200 మంది సాధువులు ధార్మిక మార్గంలో పాదయాత్ర చేస్తే ఘర్షణలు ఏర్పడతాయ ? దేశం లోని హిందువులు లౌకికవాదులు , సహనశీరులు కాబట్టే ఈ దేశం లో అత్యదిక ప్రాంతాలలో ఘర్షణవాతావరణం  లేదు హిందువులు అల్పసంఖ్యకులుగా ఉన్న ప్రాంతాలలోనే  ఘర్షణలు అధికంగా జరుగుతున్నాయి ఇది నిజం కాదా ? అని నేను అకిలేష్ యాదవ్ నిన్ను ప్రశ్నిస్తున్నాను " అని అన్నారు ,
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ గోపాల్ జి ( దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి ) మాన్య శ్రీ రామ రాజు గారు ( ప్రాంత అధ్యక్షులు ) , మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత కార్యదక్షులు ) , మాన్య శ్రీ మాధవ్ రెడ్డి గారి గాల్ రెడ్డి ( ప్రాంత కార్యదర్శి)  , అధిక సంఖ్యలో విహిప నాయకులు , కార్యకర్తలు , రామ భక్తులు పాల్గొన్నారు .

Saturday, 24 August 2013

"అయోధ్య పరిక్రమ కేవలం సాధువుల ధార్మిక యాత్ర మాత్రమె ! ఆందోళన కార్యక్రమం కాదు" - శాంతికై విశ్వ హిందు పరిషద్ విజ్ఞప్తి


  • ' అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర కేవలం సాధువుల ధార్మిక పాదయాత్ర మాత్రమె , నిరసన లేదా రాజకీయ కార్యక్రమం కాదు' - స్పష్టం చేసిన విశ్వ హిందూ పరిషద్ 
  • ' అయోధ్య లో శాంతియుత వాతారణాన్ని కల్పించండి , ధర్మాచార్యులను అగౌరవపరచకండి' - మాన్య డా . ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి   
ఫైల్ ఫోటో 

న్యు డిల్లి , 24/08/2013 : దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ద్వారా నిర్వహించబడుతున్న ' అయోధ్య జి  84 కోసి పరిక్రమ యాత్ర ' ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేదించడం పై విశ్వ హిందూ పరిషద్ తీవ్ర అసంతృప్తిని , వేదనను వ్యక్తం చేసింది . ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య డా తొగాడియా యాత్ర స్వభావాన్ని వివరిస్తూ ' ఇది కేవలం దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ధార్మిక పాదయాత్ర మాత్రమె , ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావు లేదు , కాని ఆశ్చర్యకరంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేదించడం , 144 సెక్షన్ ను విధించడం సహేతుకంగా లేదు , ఇప్పటికే 100 మందికి పైగా ధర్మాచార్యులను , అనేక మంది విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. దీని పట్ల విహిప తీవ్ర దిద్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది , నేను మాన్య అఖిలేష్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి హిందువుల మనోభావాలను గౌరవించండి , అరెస్టైన సాదు సంతులను అగౌరవపరిచే చర్యలు మానుకోండి ' అని అన్నారు. అందులోని అంశాలు క్రింది విధంగా ఉన్నాయి .

  1.  అయోధ్యాజి 84 కోసి పరిక్రమ యాత్ర  ప్రసార మధ్యమాలోని కొంత భాగం మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చుపుతున్నట్ల్టుగా రాజకీయ కార్యక్రమమో లేదా నిరసన కార్యక్రమమో కాదు , ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంస్కృతిక పాద యాత్ర మాత్రమె .
  2. తేది 25 ఆగస్టు 2013 ప్రారంభమై తేది 15 సెప్టెంబర్ 2013 తో ముగిసే ఈ యాత్ర లో ప్రతి రోజు కేవలం 150 - 200 మంది సాధువులు , ధర్మాచార్యులు మాత్రమె పరిక్రమ యాత్ర కేంద్రాల వద్ద పాల్గొంటారు ..
  3. నియమిత సంఖ్యలో ధర్మాచార్యులు పాల్గొంటూ నిర్వహించబడుతున్న ధార్మిక పరిక్రమ యాత్ర పట్ల ప్రభుత్వం చూపుతున్న భీతికి కారణం లేదు .
Source : www.samvada.org


    Thursday, 22 August 2013

    VHP dares The Yatra Ban; says ‘The 84-Kosi Parikrama of Ayodhya would take place as scheduled’

    ‘The 84-Kosi Parikrama of Ayodhya would take place as scheduled! U.P. Government should review its decision of crushing the 84-Kosi Ayodhya Parikrama of Sants and seers coming from all over the country, otherwise Hindus should remain ready for a peaceful and democratic struggle’   – Ashok Singhal, Patron, VHP

    New Delhi, Aug. 20, 2013 – On August 17Sat, 2013, post-meet of the Sri Rama Janma Bhumi Temple Construction Sant High-Power Committee, an 11-member Sant Delegation called on Sri Mulayam Singhji Yadav and the Chief Minister of Uttar Pradesh Sri Akhilesh Singhji at their residence in Lucknow. The conversation with Sri Mulayam Singhji continued for about two hours. Sri Mulayam Singhji dropped hints that the Sants should call off the scheduled 84-Kosi Yatra in view of the aggressive designs of China and Pakistan. On there being no comment on this from the Sants, he said that the 84-Kosi Yatra tithis (dates) are fixed, this Yatra takes place in the month of Chaitra, and, therefore, no new tradition could be initiated. On this the Jagadguru Ramanandacharya Ven. Swami Rambhadracharyaji Maharaj made it clear that the 84-Kosi Yatra is a tradition that has been there for thousands of years with the belief that it gives deliverance to the performer from the cycle of 84-Lakh Yonis. Just as the Kamadgiri Parikrama at Chitrakoot, Govardhan Hill Parikrama at Braj Mandal, 84-Kosi Parikrama of Braj Kshetra and the Thiruvannamalai Parikrama of the Sacred Arunachala Hill in South India can be undertaken at any time of the year and no specific time-frame is fixed for it, similarly the 84-Kosi Parikrama of Ayodhya can also be undertaken at any time of the year.

    Sri Mulayam Singhji told the delegation that he would make efforts, after consultations with the local authorities, so that the Yatra could take place. At no point during the conversation did the delegation have an inkling that he was against this Yatra or that any sort of ban would be imposed on it. The Sants were fully confident that this Yatra would be undertaken peacefully. But yesterday’s Government notification was surprising as to the barrier that came in between that compelled overnight Sri Mulayam Singhji and the Chief Minister of U.P. for a volte-face and change of mind and in order to stop this Yatra they clamped Section 144 of the Criminal Procedure Code (CrPC) to prohibit assembly of people in all those districts around Ayodhya that host the progressive legs of the 84-Kosi Parikrama (Circumambulation). This decision of the Government is not only unfortunate but also one of tyranny on the Hindu society with a view to playing to the gallery of Muslim Vote Bankers. There is not an iota of doubt in it that they are out to crush Hindu feelings only under pulls and pressures from the Muslim leaders entrenched in their own party.

    Sri Mulayam Singhji and the Congress leaders have been telling it again and again that the court’s verdict should be awaited. When the Court verdict after 60 years has already come that where Sri Ram Lala is Virajman today that is His Birthplace, it was the duty of Sri Mulayam Singhji to mobilize the Muslim religious leaders to honour and materialize their word to “…voluntarily hand over the…” Sri Rama Janma Bhumi (Ayodhya) “…shrine to the Hindus” (vide Paras 2.1, 2.2 and 2.3 of the White Paper of Government of India). Instead of doing this, Sri Mulayam Singhji’s move to oppose and oppress the Yatra is not only a violation of the Constitutional rights of Hindus but a gag and betrayal of the Hindu society. The Hindu society is no longer ready to tolerate it. This Dharmic Yatra is being undertaken by the Sants and seers coming from all the States of the country. This circumambulatory pilgrimage would take place as scheduled as it is the directive of the Sant Fraternity.

    We would request Sri Mulayam Singhji Yadav and the Chief Minister of U.P. Sri Akhilesh Yadavji that before going ahead armed with their state machinery to crush the Dharmic feelings of the Sant Fraternity they should review their decision. If they do not do this then the Hindu society, in order to defend its rights, should remain ready to wedge a struggle through peaceful and democratic way. 

    About Me

    Powered by Blogger.

    Blog Archive

    Contact us

    Name

    Email *

    Message *

    Top Ad unit 728 × 90

    Disqus Shortname

    Comments system

    Ad Inside Post

    వార్తా - హైందవం

    News

    Contact Form

    Name

    Email *

    Message *

    Purchasing Code

    Home PageNav

    PageNav Posts Number

    Scroll Animation

    Boxed Style