Our amazing new site will launch in

Sunday, 16 February 2014

భాగ్యనగర్ : సామాన్యులకు ఉచిత మెరుగైన వైద్యం ఒక్క ఫోన్ కాల్ దూరంలో 'ధన్వంతరి హెల్త్ సెల్' ప్రారంభించిన ప్రవీణ్ భాయి తొగాడియా

భాగ్యనగర్ , 16/02/2014 : దేశం లోని పేదలు, అభాగ్యుల ల వైద్య అవసరాలను తీర్చే ' ధన్వంతరి హెల్త్ సెల్ ' - ఇండియా హెల్త్ లైన్ నేడు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా (వి హెచ్ పి అంతర్జాతీయ కార్యద్యక్షులు ) చే హైదరాబాద్ లో ప్రారంబించబడినది . ఇక పై దేశం లోని ఏమూల నుండైన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పేదలు మెరుగైన వైద్య సహాయం పొందొచ్చు  " 18602333666 " అనే నంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దేశం లోని ప్రముఖ ఆసుపత్రులను, వైద్యులను, పాథాలజీ ల్యాబ్ లను ఈ నెట్వర్క్ తో అనుసందానం చేస్తూ జరిగిన బృహత్తర ప్రయత్నం ఇండియా హెల్త్ లైన్ లా రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమ ప్రారంభంలో మాన్య ప్రవీణ్ భాయి తొగాడియ మాట్లాడుతూ ' చాలా వరకు ప్రాథమిక వ్యాది నిర్దారణ అనతరం ఆ వ్యాధికి చెందిన నిపుణుడైన వైద్యున్ని సంప్రదించకపోవడమే అనేక సార్లు వ్యాది నయం కాకపోవడానికి కారణం అవుతుంది, ఈ కాలంలో పెరిగిపోయిన వైద్య ఖర్చులు, పేదరికం , వ్యాది తీవ్రత పై సరైన అవగాహణ లేకపోవడం వంటి కారణాలు మృత్యువుకు దారి తీస్తున్నాయి, వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండటం మూలాన అనేక మంది వ్యాది పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, ఇదీ వ్యాది ప్రభావాన్ని మరింతంగా పెంచుతుంది, ఆ వైద్య ఖర్చుల కోసం  ఎక్కువ గంటలు, రోజులు పని చేయడం తద్వారా మరితంగా ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది, ఇదీ వ్యాదిగ్రస్తుడి కుటుంబం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, భారత దేశం లోని బీద, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి ప్రజలు ఈ సమస్య మూలాన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సామాన్యులకు మంచి వైద్యం అందే క్రమంలో ఉన్న ఈ రుగ్మతలను దూరం చేయడానికే " ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ " ను ప్రారంబించడం జరిగింది, ఈ దేశం లోని వైద్యులు ఎంతో సేవా గుణం కలిగిన వారు సంపూర్ణ ఆరోగ్య భారతం సాదించే కలలో వారు ముఖ్యమైన భాగస్వామ్యలు , ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ అలాంటి వారికి ఒక మంచి వేదికను ఏర్పర్చుతుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రముఖ కాన్సర్ సర్జన్ లు , న్యూరో సర్జన్ లు , గుండె వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, ముత్ర పిండ వైద్య నిపుణులు, నేఫ్రలజిస్ట్ లు, లతో పాటు అనేక మంది వైద్య నిపుణులు   ఇండియా హెల్త్ లైన్ తో కలసి పనిచేయడానికి సిద్ద పడ్డారు, వీరు ఇండియా హెల్త్ లైన్ కార్యకర్తల ద్వారా తెలుపబడిన రోగులకు ఉచిత సలహా , వైద్యం అందిస్తారు. అనేక పాథాలజీ సెంటర్ లు , ఎక్ష్ - రే / ఎం ఆర్ ఐ సెంటర్లు , మందుల దుకాణాలు, రక్త నిధి బ్యాంకులు పేదవానికి వైద్య సహాయం అందిచే ఈ దేశ భక్త ' ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ ' పనిలో అధిక సంఖ్య లో భాగస్వామ్యం అయ్యాయి' అని అన్నారు,
సంపూర్ణ ఆరోగ్యం తో నిండిన భారతాన్ని నిర్మించడానికి ఏర్పాటైన ' ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ ' తో భారి సంఖ్యలో వైద్యులు , వైద్య సేవలు అందిచే రంగాలు కలసి పేదవానికి, అభాగ్యునికి మెరుగైన వైద్యం అందిచే ఈశ్వరీయ కార్యంలో చేతులు కలపాలని ప్రవీణ్ భాయి తొగాడియ విజ్ఞప్తి చేసారు .
ఈ కార్యక్రమంలో వి హెచ్ ఫై అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ రెడ్డి గారు, ఇండియా హెల్త్ లైన్ జాతీయ సలహాదారులు శ్రీ DR జితేంద్ర పటేల్ గారు, DR గిరీష్ కుమార్ సింగ్ గారు, IHL జాతీయ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తొగాడియ గారు, ఆంధ్ర ప్రదేశ్ అద్యక్షులు శ్రీ DR మాణిక్యాచారి గారు, DR ఎన్ అప్పా రావు గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, DR ఎం యాదగిరి గారు కార్యదర్శి ఆంద్ర ప్రదేశ్ గారు, ఎం రామ రాజు ప్రాంత అద్యక్షులు విహిప గారు, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 15 February 2014

భాగ్యనగర్ : జాతీయ స్థాయిలో విహెచ్‌పి హెల్త్‌లైన్ - నేడు ప్రవీణ్ భాయి తొగాడియా చేతుల మీదుగా ప్రారంభం

  • సామాన్యులకు ఉచితంగా కార్పోరేట్ స్థాయి వైద్యం అందిచే యత్నం 
  • దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కాల్ సెంటర్లు 
  • 1500 పాథాలజీ కేంద్రాలను అనుసందానం చేసే ప్రయత్నం
  • ధన్వంతరి సెల్ - ఇండియా హెల్త్ లైన్ గా నామకరణం 
  • ఈ రోజు ప్రవీణ్ భాయి తొగాడియ చేతుల మీదుగా ప్రారంభం
విజయ శ్రీ భవనం, భాగ్యనగర్,16/02/2014: కోట్లాది భారతీయుల ఆరోగ్య ప్రణాళిక కోసం ఇండియా హెల్త్‌లైన్-్ధన్వంతరిని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. నిపుణులైన డాక్టర్లచే ఖరీదైన వైద్య చికిత్స అతిసామన్య నిస్సహాయ బాధితులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది. అభాగ్యులకు, వైద్య శిఖామణులతో ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసి సామాన్యులకు సైతం దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. దేశమంతటా ధన్వంతరి- ఇండియా హెల్త్‌లైన్ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు. ఉచితంగా లేదా అతి చౌకగా పరీక్షించే స్పెషలిస్టు డాక్టర్ వద్ద సమయం తీసుకుని ఈ కార్యకర్త రోగికి హెల్త్‌లైన్ పత్రాన్ని అందిస్తారు. అలాగే అతి దగ్గరలో ఉన్న వైద్యుడి వివరాలు కూడా రోగికి ఇస్తారు. వీరు మామూలు రోగులకు వీలైనంత త్వరలో మార్గదర్శనం లేదా చికిత్స చేస్తారు. దేశం నలుమూలల కాల్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద ఇదో అద్భుతమైన సేవాప్రకల్పమని ఇండియా హెల్త్‌లైన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యాచారి, పరిషత్ అధ్యక్షుడు యం రామరాజు, మహానగర్ ప్రచార ప్రముఖ్ భరత్ వంశీ పేర్కొన్నారు. పరీక్ష, చికిత్స కూడా ముగించే విధంగా ఈవ్యవస్థ ఏర్పాటైందని చెప్పారు. పాథాలజీ ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలు, ఎంఆర్‌ఐ కేంద్రాలు, సిటి స్కాన్ కేంద్రాలు అన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇండియా హెల్త్‌లైన్ 16499977036281 అని వారు తెలిపారు. ఈ ప్రణాళికను సికిందరాబాద్ బాలంరాయ్ పెరకి ప్యాలస్ ఫంక్షన్ హాలులో ప్రవీణ్‌భాయ్ తొగాడియా ప్రారంభిస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ అధ్యక్షుడు ఎన్ అప్పారావు, ఎం యాదగిరి, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని అన్నారు.

నల్గొండ : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 34 కుటుంబాలు - సత్యం జి మార్గదర్శనం

నల్గొండ,16/02/2014 : నల్గొండ జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు పునరాగమణ కార్యక్రమాలలో గతంలో మతం మారిన 34 కుటుంబాలు తిరిగి తమ మాతృజీవన స్రవంతి అయిన హిందూ ధర్మాన్ని స్వీకరించాయి. ఈ నెల 13 న చందం పేట్ లో జరిగిన కార్యక్రమం లో నాలుగు కుటుంబాలు, 14 న జరిగిన కార్యక్రమం లో 30 కుటుంబాలు పునరాగమణ పాల్గొన్నాయి.

ఈ రెండు కార్యక్రమాల్లోనూ మాన్య శ్రీ గుమ్మాల సత్యం గారు విశ్వ హిందూ పరిషద్ జాతీయ కార్యదర్శి మార్గదర్శనం చేస్తూ ' హిందుత్వం నరుడిని నారాయణునితో ప్రత్యక్షంగా మార్గదర్శనం చేయించే దర్మం, పరోపకారార్థ మిదం శరీరం అంటూ పరుల సేవలోనే తన ఆనందాన్ని వెతుక్కో అని తెలిపే దర్మం కేవలం హిందుత్వం, ఏ రూపంలో నీవు భగవంతుడుని పూజించినా నీకు మోక్షం లభిస్తుంది అని చెపుతూ ప్రకృతిలోని ప్రతిదానిలో భగవంతుడుని చూడగలిగే ఏకైక దర్మం హిందుత్వం, ఇలాంటి ధర్మం లో ఆ భగవంతుడు మనలని జన్మ ఇవ్వడం మనం ఏ జన్మ లో చేసుకున్న సుక్రుతమో , స్వామి వివేకుని మార్గదర్శనం లో సోదరి నివేదితగా మరీన మర్గానేట్ నోబుల్ లాంటి వారితో పాటు అనేక మంది విదేశీయులు కనీసం వచ్చే జన్మలోనైనా ఈ పుణ్యభూమి భారత్ లో హిందువుగా జన్మించాలనే ఉద్ద్యేశంతో తమ తుది శ్వాస ను ఇక్కడే విడవాలని కలలు కంటూ ఉంటారు, అలాంటి దర్మం లో పుట్టిన మనం అనేక ప్రలోబాలకు లోనై విదేశీ మతాలలోకి మారినా తిరిగి తాము కోల్పోయిన అమ్మ ప్రేమను వెతుక్కుంటూ తిరిగి రావడం ఏంతో ఆనందంగా ఉంది, మీ అందరి స్పూర్తితో మతం మారిన మన సహోదరులకు తిరిగి అమ్మ ప్రేమ చూపెడదాం' అని అన్నారు.

యజ్ఞ కార్యక్రమము ద్వార జరిగిన  పునరాగమణ తర్వాత సాముహిక బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, అందరికి శ్రీ రాముని చిత్ర పటాలు బహుమతిగా ఇవ్వబడ్డాయి.   
   

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style