Our amazing new site will launch in

Sunday, 5 January 2014

దేశం ఎదుర్కొంటున్న అన్ని సమశ్యలకు 'హిందూ ఓటు బ్యాంక్' నిర్మాణమే సమాదానం : ప్రవీణ్ భాయి తొగాడియా

హిందూ యువశక్తి ప్రదర్శన, భాగ్య నగర్, 05/01/2013: భజరంగ్ దళ్ భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో టోలిచౌకి లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో జరిగిన '  హిందూ యువ శక్తి ప్రదర్శన ' విజయవంతం అయింది , ' జై కర్ వీర్ భజరంగి - హరహర మాహదేవ్ ' అన్న నినాదాలలో మైదానం మార్మోగిపోయింది, భజరంగిలు చేసిన శారీరిక , భౌద్ధిక ప్రదర్శనలు అనుశాసనబద్దంగా సాగాయి.


ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా మార్గదర్శనం చేస్తూ ' హిందుత్వం నేడు అన్ని దిశల నుండి ప్రమాదం లో ఉంది , ప్రపంచ వ్యాప్తంగా హిదువుల పై భౌతిక దాడులు జరుగుతున్నాయి ఇటీవల ఆస్ట్రేలియా , శ్రీలంక, బర్మా, సిరియా, ఇంగ్లాండ్, లాంటి దేశాలలో హిందువులు తన్యతకు గురిఅయ్యారు, కాని భారత దేశ ప్రభుత్వానికి వారిని పట్టించుకునే తీరికలేదు, భారత దేశం లోని హిందువులు అల్ప సంఖ్యాకులుగా ఉన్న అనేక ప్రాంతాలలో హిందువులు సురక్షితంగా లేరు అక్కడ వారి జీవితం దిన దిన గండంగా ఉంది, మైనారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం లో రాజకీయ నాయకులు హిందువుల పక్షాన నిలబడటం లేదు, హిందువుల దేశమైన భారత్ లోనే మన మానబిందువులు అవమానానికి గురి అవుతున్నాయి, ప్రతి రోజు కొన్ని లక్షల సంఖ్యలో గో - సంతతి కబెలాలకు తరలించబడుతుంది, లవ్ జిహాద్ పేరుతొ మన బిడ్డలు మతం మార్చబడుతున్నారు, మన మందిరాలు సురక్షితంగా లేవు పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోనే అన్య మతాలకు చెందిన అక్రమ నిర్మాణాలు ప్రణాళిక బద్దంగా నిర్మించబడుతున్నాయి. హిందూ సమాజం పై జరుగుతున్న బహుముఖ దాడులను ఎరుర్కోనడానికి హిందూ యువకులు అధిక సమయం ఇచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది, మన ఓటు హక్కును ఆయుధంగా మలుచుకుని కనీసం 300 లకు పైగా రామ భక్తులను పార్లమెంట్ కు పంపించి మన శక్తిని చాటాలి, హిందూ హితాన్ని కోరుకునే వారు మాత్రమె ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆర్హులు ఆదిశలో మన సర్వ శక్తి యుక్తుల్ని ఒడ్డి పనిచేస్తారని ఆశిస్తున్నాను ' అని చేసిన ప్రసంగం భజరంగిల హృదయంతరాలను తాకింది. 
తదుపరి శ్రీ రాఘవ రెడ్డి గారు (విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ అద్యక్షులు) మాట్లాడుతూ ' నా కన్నుల ముందు నిజంగానే ' హిందూ యువ శక్తి ప్రదర్శన ' కనిపిస్తుంది, నా గుండెల్లో ఇప్పుడు ఒక సురక్షిత భావన ఏర్పడుతుంది, హిందూ సమాజ క్ష్యాత్ర తేజం భజరంగి లలో కనిపిస్తుంది ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణం లో హిందువుల రక్షణ కోసం భజరంగ్ దళ్ ఉంది అనే బరోస హిందులలో కలిగిననాడు మన శత్రువులు మన వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు, అప్పుడే మన మానబిందువులు సురక్షితంగా ఉండలగుతాయి' అని అన్నారు .



ఈ కార్యక్రమం లో ప్రవీణ్ జి తొగాడియ, రాఘవ రెడ్డి గారు, శ్రీ రామ రాజు గారు, శ్రీయాదగిరి రావు  శ్రీ సురేందర్ రెడ్డి గారు, శ్రీ మాధవ రెడ్డి గారి గాళ్ రెడి గారు, శ్రీ కేశవరాజు గారు,  శ్రీ భాను ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు.

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style