Our amazing new site will launch in

Tuesday, 31 December 2013

సూరత్ : ప్రారంభమైన విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ పాలక మండలి సమావేశాలు


  • వచ్చే ఎన్నికల్లో ఎ పార్టి ప్రభుత్వం వచ్చిన అయోధ్య లో శ్రీ రామ మందిరం నిర్మిచాల్సిందే - ప్రవీణ్ తొగాడియ 
  • స్వర్ణోత్సవాల సందర్భంలో దేశ వ్యాప్తంగా లక్ష యాభై వేల గ్రామాలో పరిషత్ సమితుల నిర్మాణానికి నిర్ణయం 

సూరత్ , గుజరాత్ 31/12/2013 : విశ్వ హిందూ పరిషద్ లో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  అంతర్జాతీయ పాలక మండలి ఐదు రోజుల పాటు నిర్వహించే సమావేశాలు తేది 31/12/2013 న గుజరాత్ రాష్ట్రము లోని సూరత్ నగరం లో ప్రాపంభమయ్యాయి.  ప్రముఖ భాగవత ప్రవచనకారులు పూజ్య శ్రీ రమేష్ భాయి ఓజా మరియు స్వామి నారాయణ మందిరం యొక్క సంతు శ్రీ నౌతం జి మహారాజ్, మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గార్ల దివ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఉద్గాటన జరిగింది .
ప్రస్తుత ప్రభుత్వం హిందూ ఆధ్యాత్మిక వేత్తలు , సాధు సంతులు లను లక్ష్యంగా చేసుకుని మైనారిటి సంతుస్టికరణ చేసి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది - పూజ్య రమేష్ భాయి ఓజా 
సాధువుల అశిః ప్రసంగం అనంతరం మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియ మార్గదర్శం చేస్తూ ' నేడు దేశం లో ఏ హిందువు సురక్షితంగా లేదు , అనునిత్యం దేశంలో లోని ఎదో ఒక చోట హిందువుల పై దాడులు జరిగుతూనే ఉన్నాయి , ముజఫర్ నగర్ లాంటి సంఘటనలు సర్వ సాధారణం అయ్యాయి , కాశ్మీర్ అస్సాం లాంటి హిందూ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి మరీ విషమంగా ఉంది , ఈ దేశంలో హిందువుల రక్షణ విషయంలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. వచ్చే విశ్వ హిందూ పరిషద్ స్వర్ణోత్సవ ఉత్సవాలలో దేశం లోని లక్ష యాభై వేల గ్రామాలలో విశ్వ హిందూ పరిషద్ , భజరంగ్ దళ్ , దుర్గావహిని సమితులను ఏర్పాటు చేసి తద్వారా ఈ జాతి వ్యతిరేక శక్తులకు గట్టి సమాదానం చెప్పాల్సి ఉంది ఆ దిశలో మనమందరం కలసి పనిచేద్దాం అని ఆశిస్తున్నాను ' అని అన్నారు.



ఈ సమావేశాలలో విశ్వ హిందూ పరిషద్ కార్యధ్యక్షులు ( విదేశీ విభాగం ) మాయ శ్రీ అశోక్ రావు చంగ్లె , విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్య శ్రీ చంపత రాయ్ లతో పాటు పరిషత్ పదాదికారులు హాజరయ్యారు .

Saturday, 14 December 2013

సూర్యాపేట్ లో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 68 కుటుంబాల నుండి 221 మంది

సూర్యాపెట్ , నల్గొండ , 13/12/2013 : నల్గొండ జిల్లా సూర్యాపేట్ లోని అంబేద్కర్ నగర్ రామాలయం లో జరిగిన పునరాగమణ కార్యక్రమమం లో చుట్టు ప్రక్కల 7 గ్రామాలకు చెందిన 68 కుటుంబాల నుండి 221 మంది మతం మారిన హిందువులు తిరిగి హిందూదర్మం లోకి వచ్చారు, వారందరికీ శ్రీ రాముని చిత్ర పటాలు, నూతన వస్త్రాలు అందించబడ్డాయి. 

మాన్య శ్రీ గుమ్ముల సత్యం విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి గారు మాట్లాడుతూ ' జాతి ప్రధాన జీవన స్రవంతి నుండి ప్రలోభాలకు లోనై మతం మారినవారందరూ తిరిగి హిందుత్వంలోనికి రావడం శుభపరిణామం, హిందూ దర్మం చిర పురాతనం - నిత్య నూతనం అందుకే దీనిని సనాతన దర్మం అని అన్నారు , హిందుత్వంలో లేనిది ప్రపంచంలోని ఏ మతంలోనూ లేదు, అన్ని మతాలకు ధర్మాలకు జననిలాంటిది హిందుత్వం, నదులు ఎక్కడ పుట్టినా , ఎక్కడెక్కడ తిరిగినా అవి చివరికి ఆ సముద్రాన్నే చేరుతాయి అని ప్రభోదించిన హిందుత్వం ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమౌతుంది, తమ తల్లిని వీడిన మన సహోదరులందరినీ తిరిగి తమ మాతృ వోడిలోకిని తీసుకురావలసిన బాధ్యత మన అందరిది ' అని అన్నారు .

ఈ కార్యక్రమంలో శ్రీ పాల్శర్మ గారు , శ్రీ ఎల్లయ్య గారు , శ్రీ BS మూర్తి గారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు 

Thursday, 5 December 2013

Ram Madhav’s book: COMMUNAL VIOLENCE BILL : THREAT TO NATIONAL INTEGRATION

A reposting:
RSS Akhil Bharatiya Sah Sampark Pramukh Sri Ram Madhav’s book on COMMUNAL VIOLENCE BILL: THREAT TO NATIONAL INTEGRATION, SOCIAL HARMONY AND CONSTITUTIONAL FEDERALISM
Find the e-book by clicking this link.
RM

హిందు వ్యతిరేకమైన మత హింస నిరోద బిల్లు పై దేశ వ్యాప్త ఉద్యమం : ప్రవీణ్ భాయి తొగాడియ

దేశం లోని మెజారిటి హిందువుల కు వ్యతిరేకంగా ఉన్న మత హింస నిరోధ బిల్లును విశ్వ హిందు పరిషత్ వ్యతిరేకిస్తుంది , ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ 
ప్రవీణ్ భాయి తొగాడియ 
కొత్త డిల్లి : హిందువుల రాజ్యాంగపర మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉన్న మత హింస నిరోద బిల్లును విశ్వ హిందు పరిషద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ,దేశం లోని మైనారిటిల హక్కులనును రక్షించే ముసుగులో ఈ బిల్లు హిందువుల మౌలిక హక్కులను కాలరాసేదిగా ఉంది , కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి లేని యెడల  దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్యమం నిర్వహిస్తామని విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాన్య శ్రీ ప్రవ్చీన్ భాయి తొగాడియా ప్రకటించారు .

బిల్లు ఎందుకు హిందూ వ్యతిరేకం : 

  1. బిల్లులో మెజారిటి అయిన హిందువులను నేరస్తులుగా , మైనారిటిలను బాదితులుగా చూపెట్టబడింది, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం ఈ కారణం గా దేశం లోని హిందువుల పై మత హింస చెలరేగిన సందర్భంలో దాడులు జరిగిన కనీసం మెజారిటి హిందువుల వాని వినిపించుకునే నాధుడే ఉండడు.
  2. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చట్టం అందరికి సమాన రక్షణ కలిగించాలి కాని ఈ బిల్లు మత హింస చెలరేగిన సందర్భంలో  కేవలం ముస్లీంలకు మాత్రమె రక్షణ కలిగించేలా ఉంది.
  3. భారత దేశ న్యాయ సూత్రాల ప్రకారం ముద్దాయి న్యాయస్థానం లో నేర నిరూపణ జరిగే వరకుకూడా ముద్దయిగానే పరిగణించబడాలి, కాని ఈ బిల్లులో హిందువులు ఆరోపణ జరిగిన వెంటనే నేరస్తులుగా పరిగనించబడతారు , నాన్ - బెయిలబుల్ కేసులు మోపబడతాయి .
  4. నేరారోపణ జరిగిన వ్యక్తికీ తను ఆ నేరం చేయలేదని నిరూపించుకునే హక్కు ఉంది, కాని ఈ బిల్లు కారణంగా మత హింస చెలరేగిన సందర్భంలో  హిందువులు ఆ ప్రాధమిక హక్కును కోల్పోతారు.
  5. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పొలిసు యంత్రాంగాన్ని న్యాయ వ్యవస్థను మైనరిటిల చేతిలో పెట్టె ప్రయత్నం చేస్తుంది, పొలిసు ఉన్నతాదికారులు సహితం కేసు పురోగతిని ప్రతివారం ఫిర్యాది కి తెలపాలనడం ఇందుకు నిదర్శనం.
  6. ఈ బిల్లు వలన హిందువులేవరు " ముస్లీం " అనే పదాన్ని కుడా ఉచ్కరించలేరు, ఎవరైనా ముస్లీం వ్యాపారవేత్త హిందూ వ్యాపారుల వలన తన వ్యాపారం జరగటంలేదు అని ఫిర్యాదు చేస్తే ఆ హిందూ వ్యాపారులు మత హింస నిరోద బిల్లు పరిధిలోకి వస్తారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటుకు , కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని కోరారు, ప్రభుత్వ యంత్రాగాన్ని , న్యాయవ్యవస్థను మైనారిటిల చేతిలో పెట్టె ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ప్రజాస్వామిక ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు .       
Source: www.samvada.org 

Wednesday, 4 December 2013

మిర్యాలగూడలో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 12 క్రైస్తవ కుటుంబాలు

మిర్యాలగూడ , ధర్మప్రసార్ , 28-Nov-2013 : మిర్యాలగూడ పట్టణం లోని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో చుట్టూప్రక్కల ఆరు గ్రామాలకు చెందిన 12 కుటుంబాల నుండి 48 మంది గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు , కాని వారి పూర్వికుల ధర్మానికి అన్యాయం జరుగుతుంటే , తాము అనేక తరాలుగా పూజిస్తున్న దేవుళ్ళను సైతాన్లు అని అంటుంటే భరించలేక తమ తప్పిదాన్ని తెలుసుకుని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో కి  శ్రీశ్రీశ్రీ స్వామి సత్యాపాదానంద స్వామిజి మార్గదర్శనం లో తిరిగి తమ మాత్రు ధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరైన శ్రీ గుమ్ముల్ల సత్యం విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి హిందూ ధర్మ వైభవాన్ని వివరించారు , అలాగే దారి తప్పిన మన సహోదరులను సక్రమ మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత మన అందరిది అని గుర్తుచేశారు . 



ఈ కార్యక్రమంలో BS మూర్తి గారు , బొడ్ల మాలికార్జున్ గుప్త గారు , శ్రీ ఉపేందర్ గారు , మొదలగువారు పాల్గొన్నారు , కార్యక్రమ అనంతరం స్వధర్మాన్ని స్వీకరించిన వారికి క్రొత్త బట్టలు , శ్రీ రాముని చిత్ర పటాలు పంపిణి చేయడం జరిగింది .    

విశ్వ హిందు - Dec - 2013

(or)
Download as pdf format


About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style