ఆదోని రూరల్ : ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మమల్ని కాపాడు తుందని, ప్రళయానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని వీహెచ్ పీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి ఆకరపు కేశవరాజు పేర్కొన్నారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే వరదలు తీవ్ర రూపం దాల్చి ఉత్తరాఖండ్‌లో వేలాది మంది మృత్యువాత పడ్డారన్నారు. వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు 2 వేల మంది ప్రమాద స్థలానికి చేరుకున్నారన్నారు. రుషికేష్, హరిద్వార్, కొట్టుద్వార్, హర దోన్‌లలో వేలాది మందికి వసతి, భో జన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. మరో 2 వేల మందిని కూడా రక్షించిన ట్లు పేర్కొన్నారు. వైద్య సహాయం కో సం నాలుగు వైద్య బృందాలు శివనా రాయణసింగ్ ఆధ్వర్యంలో సేవా కా ర్యక్రమాలు ప్రారంభించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మందులు, ఆహార పదార్థాలు సంఘటనా స్థలానికి చేరు కొని బాధితులకు అందిస్తున్నామన్నా రు.
హిమాలయాల్లో విద్యుత్ తయారీ అనుమతులు ఇవ్వడం, కొండలపైన ప్రాజెక్టులు కట్టడంవల్ల ఈ జల ప్రళ యం వచ్చిందని, దీనికి ప్రభుత్వ విధా నాలే కారణమని ఆయన ఆరోపించా రు. ప్రకృతి విపత్తులను గుర్తించేందు కు ప్రభుత్వం నియమించిన బృందం హిమాలయ కొండల్లో విద్యుత్‌శక్తి ప్రా జెక్టులు ఏర్పాటు చేస్తే నష్టం సంభవి స్తుందని 2001లో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలకు నివేదికలు సమర్పించినా ప్ర భుత్వాలు పెడ చెవిన పెట్టాయని ఆరో పించారు. 200 విద్యుత్ తయారీ కేంద్రాలు ఉన్నాయని, మరో 70 ప్రాజెక్టు లకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైందన్నారు. దీని వల్ల గంగానది ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అ న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేదార్ నాథ్‌కు వెళ్లిన తెలుగు భక్తులకు సహా యక చర్యలు అందించడంలో ఘోరం గా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో భజరంగ్‌దళ్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్్, నగర అధ్యక్షుడు బసవన్నగౌడ్, నగర కోశాధికారి భద్రి నారాయణప్ప, నగర సహ కార్యదర్శి దేవేంద్ర, భజరంగదళ్ నగర ప్రముఖ్ నాగరాజుగౌడ్, నగరసహా ప్రముఖ్ విజయకృష్ణ, రాష్ట్ర విభాగ్ కార్యదర్శి రామదాసు పాల్గొన్నారు.


