Our amazing new site will launch in

Monday, 20 May 2013

మెట్ పల్లి లో దిగ్విజయమైన శ్రీ రామ నామ జప యజ్ఞం


మెట్ పల్లి విశ్వ హిందూ పరిషద్   .
కార్యక్రమం : శ్రీరామ నామ జపయజ్ఞం
వివరాలు :
  • తేది : 19.5.2013 ఆదివారం రోజు మెట్ పల్లి నగరం లోని  శ్రీ కోదండ రామాలయం నందు శ్రీ రామ నామ జపయజ్ఞం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని నగర విశ్వహిందూ పరిషద్  నిర్వహించినది.
  • కార్యక్రమం ఉదయం 8 గంటలకు యజ్ఞ కార్యక్రమం తో ప్రారంభమయ్యింది . శ్రీమతి మరియు  శ్రీ గాజంగి రాజమల్లయ్య ,శ్రీమతి మరియు  శ్రీ గొనె భూమయ్య గార్లు యజ్ఞ కార్యం నిర్వహించారు . స్థానిక పూజారులు శ్రీమాన్  బండలింగాపురం పంతులు గారు  , నరసింహ మూర్తి గారు , శశికాంత్ శర్మ గారు యజ్ఞాన్ని నిర్వహింప జేశారు .
  • యజ్ఞ హవనం కోసమై  150 జంటలు కూర్చున్నాయి . నగరం లోని వివిధ ప్రాంతాల నుండి 500 లకు పైగా భక్తులు పాల్గొన్నారు .
  • యజ్ఞ కార్యక్రమం అనంతరం సభా సమావేశం జరిగింది . ఇట్టి కార్యక్రమం లో స్వాములు శ్రీయుతులు   సనకానంద స్వామీ, చిన్మయానంద తీర్థ స్వామీ, శ్రద్ధానంద స్వామీ, జగదేశానంద స్వామీ, అవదూతమహరాజ్ స్వామీ జీ లు పాల్గొన్నారు. భక్తులకు మార్గదర్శనం చేశారు.
  • అలాగే జిల్లా విశ్వహిందూ పరిషద్ గౌరవ అధ్యక్షులు డా. వెంకట్ రెడ్డి గారు , జిల్లా అధ్యక్షులు శ్రీ కోటగిరి రాజేశం గారు, పాల్గొన్నారు . నగర బృందం మానాల రాజారాం గారు, మార్గం గంగాధర్ గారు , ప్రదీప్ గారు , మధుసూదన్ గారు , భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు .
ప్రవచనాలు - మార్గదర్శన ముఖ్యాంశాలు :
  • మన సంప్రదాయ పరిరక్షనే మన ధ్యేయం కావాలి - సనకానంద స్వామీ జీ 
  • అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ దేశ సమస్త హిందూ జనవాహిని కోరిక . దీని కోసం సాదుసంతుల కుంభమేళా తీర్మానాల మేరకు మనం ఈనాటి కార్యక్రమం చేసుకున్నాం .ఈ దేశ ప్రజల ఆకాంక్ష నెరవేరే టట్లు పాలకులు తక్షణమే రామ మందిర నిర్మాణానికి చర్యలు చేపట్టాలి . - కోటగిరి రాజేశం గారు 
  • జపం శక్తిని జాగృతం చేస్తుంది . దీనిని నిత్యం చెయ్యాలి . శ్రీ రామ జయరామ జ్యాయ రామ అనే మహా మంత్రం మన కోరిక ను నెరవేరుస్తుంది . - శశికాంత్ గారు 
యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం లో స్థానిక MLA గారు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  పాల్గొన్నారు . అనంతరం మహాప్రసాద కార్యక్రమం జరిగింది .

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style